అంగారకుడిపై దిగిన అమెరికా రోవర్.. అద్భుత ఫొటోలు వీడియోలు విడుదల

అంగారక గ్రహంపై అమెరికా పంపిన ‘పర్సెవరెన్స్’ రోవర్ క్షేమంగా దిగిన సంగతి తెలిసిందే. ఆ గ్రహంపై కాలు మోపిన రోవర్ అక్కడ దిగడానికి ముందు.. దిగిన తర్వాత తీసిన ఫొటోలు వీడియోలను చాలా చాకచక్యంగా తీసింది. వాటిని తాజాగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా విడుదల చేసింది. Also Read: క్రికెట్ ఫ్యాన్స్ కు శుభవార్త.. ఐపీఎల్ వేదికలు ఖరారు.. ఎక్కడెక్కడంటే? అంగారకుడిపై ఒకప్పుడు జీవం ఉండేదా అన్నది తెలుసుకునేందుకు ఈ రోవర్ ను అమెరికా […]

Written By: NARESH, Updated On : February 23, 2021 9:52 am
Follow us on

అంగారక గ్రహంపై అమెరికా పంపిన ‘పర్సెవరెన్స్’ రోవర్ క్షేమంగా దిగిన సంగతి తెలిసిందే. ఆ గ్రహంపై కాలు మోపిన రోవర్ అక్కడ దిగడానికి ముందు.. దిగిన తర్వాత తీసిన ఫొటోలు వీడియోలను చాలా చాకచక్యంగా తీసింది. వాటిని తాజాగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా విడుదల చేసింది.

Also Read: క్రికెట్ ఫ్యాన్స్ కు శుభవార్త.. ఐపీఎల్ వేదికలు ఖరారు.. ఎక్కడెక్కడంటే?

అంగారకుడిపై ఒకప్పుడు జీవం ఉండేదా అన్నది తెలుసుకునేందుకు ఈ రోవర్ ను అమెరికా పంపింది. తాజాగా విడుదల చేసిన మూడు నిమిషాల వీడియోలో ‘పర్సెవరెన్స్’ రోవర్ అంగారక గ్రహం ఉపరితలంపై ల్యాండ్ అయిన వైనం చూపించారు. రోవర్ ల్యాండ్ అవుతుండగా అంగారకుడిపై దుమ్ము లేచిపోవడం.. ప్యారాచూట్ సాయంతో వ్యోమనౌక నుంచి రోవర్ కిందకు దిగడం.. శాస్త్రవేత్తలు చప్పట్లతో ఆనందం వ్యక్తం చేయడం ఈ వీడియోలో కనిపిస్తోంది.

అంగారకుడిపై ల్యాండ్ అయినప్పుడు ఇంతవరకు ఎవరూ వీడియోలను క్యాప్చర్ చేయలేకపోయారు. కానీ నాసా టీం ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. ఇప్పటివరకు ఊహించిన విధంగా రోవర్ పనిచేస్తున్నట్టు నాసా శాస్త్రవేత్తలు తెలిపారు.

Also Read: ఐపీఎల్ కు డేవిడ్ వార్నర్ దూరం.. సన్ రైజర్స్ కు షాక్

పర్సెవరెన్స్ రోవర్ శుక్రవారం గ్రహ ఉపరితలంపై దిగింది. రోవర్ రికార్డ్ స్థాయిలో 25 కెమెరాలు, రెండు మైక్రో ఫోన్లను ఇంజనీర్లు అమర్చారు. రోవర్ ల్యాండింగ్ సమయంలో రికార్డు చేయడానికి 7 కెమెరాలను స్విచ్ ఆన్ చేశారు. రోవర్ ల్యాండింగ్ సమయంలో మరిన్ని ఫోటోలు, వీడియోలు నాసా విడుదల చేస్తోంది. ఈ ఫొటోలు చూసి అందరూ అబ్బురపడుతున్నారు.