
Ramoji Rao: రామోజీరావు.. తెలుగు మీడియా మొగల్.. ఈనాడు గ్రూపు సంస్థల యజమాని, రామోజీ ఫిలిం సిటీ ఓనర్, డాల్ఫిన్ హోటల్ అధిపతి.. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితా చాంతాడంత ఉంటుంది. ఇది బయటికి కనిపించే కోణమే.. కనిపించని రామోజీరావు వేరే, అగుపించని రామోజీరావు వేరే. ఎక్కడో హైదరాబాద్ కు అవతల ఉన్న రామోజీ ఫిలిం సిటీ లో అత్యంత విలాసవంతమైన సౌధంలో ఉండే రామోజీరావు ఒకానొక దశలో కోర్టు ముందు నిలబడ్డాడు.. జడ్జి ముందు బోనులో చేతులు కట్టుకొని మౌనంగా ఉన్నాడు. అంతటి కొరుకుడు పడని రామోజీరావు ను కోర్టు దాకా తీసుకొచ్చిన కథ ఇప్పటి పొలిటికల్ సర్కిల్ కు తెలియదు కానీ.. ఒకప్పుడు మాత్రం ఇది ముంజేతి కంకణమే.
ప్రస్తుతం రామోజీరావు మార్గదర్శి మీద జగన్ గుడ్లు ఉరుముతున్నాడు. కోడి కత్తి కేసు, వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు తెరపైకి రాకుంటే ఈపాటికి రామోజీకి మరొకసారి చుక్కలు చూపించేవాడే. వాస్తవానికి ఈ కేసు విషయంలో జగన్ పొలిటికల్ లెక్కలే ఎక్కువగా ఉన్నాయి. మార్గదర్శి మీద ప్రభుత్వం గాయి గాయి చేస్తున్నప్పటికీ ప్రజల్లో అంతగా ఆగ్రహం వెలువెత్తడం లేదు. ఆఫ్ కోర్స్ ఇది పొలిటికల్ రివెంజ్ అని ప్రజలకు కూడా తెలుసు కాబట్టి చాలా సులువుగా తీసుకున్నట్టు కనిపిస్తోంది. కానీ ఈ సోయిలేని ఈనాడు మార్గదర్శికి అనుకూలంగా పేజీల కొద్దీ వార్తలు కుమ్మేస్తోంది. ఒకప్పుడు పత్రికలో సెంటీమీటర్ స్పేస్ కూడా చాలా విలువైంది అని చెప్పిన రామోజీరావు.. మార్గదర్శి కోసం పేజీలకొద్ది వార్తలు నింపడం నిజంగా ఆశ్చర్యకరమే. మార్గదర్శి మీద జగన్ గుడ్లు ఉరుముతున్నప్పటికీ రామోజీరావును ఏమి చేయలేకపోతున్నాడు. మహా అయితే మంచంలో పడుకో పెట్టవచ్చు గాక.. అంతకుమించి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోతున్నాడు. మోడీ షా ముందు జగన్ ఎంత సాగిల పడినప్పటికీ కోడి కత్తి కేసులో ఉపశమనం లభించడం లేదు. వివేకానంద రెడ్డి హత్య కేసులో ఫాయిదా దక్కడం లేదు. ఈ కేసులు గనక లేకుంటే జగన్ రామోజీరావు విషయంలో నట్లు మరింత గట్టిగా బిగించేవాడు..కానీ ప్చ్ లాభం లేదు.

కానీ అంతటి కాకలు తీరిన రామోజీరావు ఓ జడ్జి నేలకు దించాడు. బోనులో చేతులు కట్టుకొని నిలబడేలా చేశాడు. దీని వెనుక ఒక ఆసక్తికరమైన నేపథ్యం ఉంది. కృష్ణాజిల్లాలో వట్టి వెంకట పార్థసారథి అనే ఒక పెద్దమనిషి డిసిసిబి ప్రెసిడెంట్ గా పని చేసేవారు.. అయితే డిసిసిబిలో భారీ అవినీతి జరిగిందని ఈనాడు పత్రికలో ఒక ఫుల్ పేజీ కథనం ప్రచురితమైంది. ఆ కథనాన్ని చూసి పార్థసారధికి కోపం పెరిగిపోయింది. దీన్ని సవాల్ గా తీసుకొని గవర్నమెంట్ అధికారులతో ఆడిట్ చేయించుకున్నాడు. అందులో ఎలాంటి అపకతవకలు జరగలేదని సర్టిఫై చేయించుకున్నాడు. తర్వాత తాడేపల్లిగూడెం కోర్టులో పరువునష్టం దావా వేశాడు. ..
ఈ కేసును తాడేపల్లిగూడెంలోని ఓ జడ్జి విచారణకు తీసుకున్నారు. కేసు పూర్వపరాలు పరిశీలించి వార్త రాసిన విలేకరి నుంచి పత్రిక ఎడిటర్ రామోజీరావు దాకా అందర్నీ కోర్టుకు రావాలని ఆర్డర్ వేశారు. అయితే కోర్టుకు సంబంధించి హాజరయ్యేందుకు మినహాయింపు ఇవ్వాలని రామోజీరావు రకరకాల ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో రామోజీరావు ప్రత్యేక ఫ్లైట్లో హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చారు. అక్కడి నుంచి ఒక బెంజ్ కార్ లో తాడేపల్లిగూడెం వచ్చారు. జడ్జి ముందుకు వచ్చి చేతులు కట్టుకొని, నిలుచొని నమస్కారం చేశారు. అయితే ఈ కేసులో రామోజీరావుకు రెండు సంవత్సరాల జైలు, అపరాధ రుసుం విధించారు. దీన్ని సవాల్ చేస్తూ రామోజీరావు జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ కేసు ఏడు సంవత్సరాల పాటు కోర్టు విచారణలో ఉంది. పార్థసారధి కూడా మొక్కవోని ధైర్యంతో కోర్టు చుట్టూ తిరిగారు. తర్వాత కేసును కోర్టు కొట్టి వేసింది.
ఇంతటితోనే అయిపోలేదు. అసలు కథ ఇక్కడే ఉంది. రామోజీరావు తన సొంత వ్యవహారంలో ఎలాంటి జాగ్రత్త పాటిస్తారో మచ్చుకు ఇది ఉదాహరణ మాత్రమే. తాడేపల్లి గూడెం కోర్టుకు హాజరైన రామోజీరావును ఇతర విలేకరులు ఫోటోలు తీయకుండా ఈనాడు ఉద్యోగులు జాగ్రత్త పడ్డారు. రామోజీరావు ముఖానికి గొడుగులు అడ్డం పెట్టారు. అయితే కోర్టు హాల్లో రామోజీరావు నేరుగా పెంచు ముందుకు వెళ్లి నిలబడితే మెజిస్ట్రేట్ రామోజీరావు న్యాయవాది పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడ నిలబడాలో మీ క్లైంట్ కు చెప్పండి అంటూ గట్టిగా మందలించారు. అప్పుడు ముద్దాయిలు నిలబడే చోటులో రామోజీరావు నిలబడాల్సి వచ్చింది. రామోజీరావును నేలకు దించిన స్టేట్ పేరు జనం మంచి సాంబశివ్. నిజాయితీకి నిలువుటద్దం లాంటి వాడు. కాలి నడకనే కోర్టుకు వచ్చేవాడు. ఆ రోజుల్లో తాడేపల్లిగూడెంలో సాంబ శివ్ గురించి కథలుకథలుగా చెప్పుకునేవారు. ఈ కేసు ముగిసిన తర్వాత ఈనాడు ఆయన గురించి రాయాలని చూసింది..కానీ సాంబశివ్ అవకాశం ఇవ్వలేదు.