
NTR- Lakshmi Pranathi: స్టార్ హీరో ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి సింప్లిసిటీకి నెటిజెన్స్ ఫిదా అవుతున్నారు. ఆమె ఓ సాధారణ మహిళలా పబ్లిక్ లో షాపింగ్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. స్టార్స్ కి ఉండే ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారి కుటుంబ సభ్యులను కూడా ఫ్యాన్స్ అనుసరిస్తారు. బయట కనిపిస్తే ఫోటోలు దిగేందుకు ఎగబడతారు. అందుకే హీరోల భార్యలు, కుటుంబ సభ్యులు భద్రత లేకుండా పబ్లిక్ లోకి వచ్చే సాహసం చేయరు. దాన్నో ప్రమాదంగా చూస్తారు. ఎన్టీఆర్ వైఫ్ లక్ష్మీ ప్రణతి అందుకు భిన్నంగా ఆలోచించి ప్రశంసలు అందుకుంటుంది.
జనాలతో నిండిపోయి ఉండే రద్దీ మార్కెట్ లో లక్ష్మీ ప్రణతి షాపింగ్ చేశారు. చార్మినార్ నైట్ మార్కెట్ ఆడవాళ్ళ అలంకరణ సామాగ్రికి చాలా ఫేమస్. ఇక రంజాన్ నెలలో మరింత శోభ సంతరించుకుంటుంది. రంజాన్ మాసంలో ముస్లిం మహిళలతో పాటు హిందువులు కూడా పలువురు అక్కడ గాజులు, ఆభరణాలు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. ఈ మార్కెట్ లో లక్ష్మీ ప్రణతి షాపింగ్ చేయాలని భావించారు.
ఇది ఒక సాహసం. ఎన్టీఆర్ వైఫ్ అని గుర్తిస్తే అభిమానులు చుట్టుముట్టే ప్రమాదం ఉంది. అయినా కూడా లక్ష్మీ ప్రణతి తన కోరిక తీర్చుకున్నారు. చార్మినార్ వద్దగల నైట్ మార్కెట్ లో ఒంటరిగా షాపింగ్ చేశారు. అప్పుడు ఎన్టీఆర్ ఆమె వెంట లేరు. అక్కడకు షాపింగ్ కి వెళతానని ఎన్టీఆర్ ని లక్ష్మీ ప్రణతి పర్మిషన్ అడిగారట. ఎన్టీఆర్ ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా ఒప్పుకున్నాడట. ఎన్టీఆర్ అనుమతించడంతో స్వేచ్ఛగా ఛార్మినార్ నైట్ మార్కెట్ లో షాపింగ్ చేసే ఛాన్స్ ఆమెకు దక్కింది.

ఎన్టీఆర్-లక్ష్మీ ప్రణతి టాలీవుడ్ లవ్లీ కపుల్ గా పేరు తెచ్చుకున్నారు. 2011లో వీరు వివాహం చేసుకున్నారు. లక్ష్మీ ప్రణతి ఎన్టీఆర్ కి దగ్గర బంధువు అవుతారు. పెద్దలు కుదిర్చి ఈ వివాహం చేశారు. ఎన్టీఆర్ కి ఇద్దరు కుమారులు. పెద్దబ్బాయి పేరు అభయ్ రామ్ కాగా, చిన్నవాడి పేరు భార్గవ్ రామ్. లక్ష్మీ ప్రణతి లో ప్రొఫైల్ మైంటైన్ చేస్తారు. సోషల్ మీడియా అసలు వాడరు. అరుదుగా బయట కనిపిస్తుంటారు.