https://oktelugu.com/

బియ్యపుపిండితో ముగ్గు వేయటం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా?

సాధారణంగా మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ప్రతి రోజు ఉదయం మన ఇంటి లోగిళ్ళలో శుభ్రం చేసి కళ్ళాపి చల్లి ముగ్గులు వేయడం ఒక ఆచారంగా వస్తోంది. ముఖ్యంగా సంక్రాంతి సమయాలలో రంగు రంగు ముగ్గులను వేసి గొబ్బెమ్మలను పెడుతూ ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అయితే కొంతమంది ముగ్గును వేసేటప్పుడు బియ్యపు పిండితో వేయాలని సూచిస్తుంటారు. బియ్యప్పిండితో ముగ్గు వేయడం వెనక ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం…. Also Read: కిడ్నీల్లో రాళ్ళతో బాధ పడుతున్నారా.. […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : March 3, 2021 / 11:17 AM IST
    Follow us on

    సాధారణంగా మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ప్రతి రోజు ఉదయం మన ఇంటి లోగిళ్ళలో శుభ్రం చేసి కళ్ళాపి చల్లి ముగ్గులు వేయడం ఒక ఆచారంగా వస్తోంది. ముఖ్యంగా సంక్రాంతి సమయాలలో రంగు రంగు ముగ్గులను వేసి గొబ్బెమ్మలను పెడుతూ ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అయితే కొంతమంది ముగ్గును వేసేటప్పుడు బియ్యపు పిండితో వేయాలని సూచిస్తుంటారు. బియ్యప్పిండితో ముగ్గు వేయడం వెనక ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం….

    Also Read: కిడ్నీల్లో రాళ్ళతో బాధ పడుతున్నారా.. తినకూడని ఆహారాలివే..?

    భూమికి దక్షిణ దిశలో దక్షిణ ధృవం ఉంది. ఈ దక్షిణ దిక్కు యముడి దిక్కు. అదేవిధంగా దక్షిణ ధ్రువం నుంచి వచ్చే అయస్కాంత శక్తులనే రాక్షసులు ,పిచాచులు, అని మన పూర్వీకులు అంటూ ఉంటారు.అందుకోసమే దక్షిణ దిశ వైపు తల పెట్టుకుని నిద్ర పోకూడదని కూడా మన పెద్దలు చెబుతుంటారు. ఈ భూమిపై సమస్త ప్రాణకోటి నివసిస్తుంటాయి. పాములు, పిశాచులు రాక్షసులు తిరుగుతుంటాయని భావిస్తారు.

    Also Read: సిమ్ కార్డులతో బ్యాంక్ ఖాతా ఖాళీ.. మోసగాళ్లు ఏం చేస్తున్నారంటే..?

    ఈ విధంగా  మన ఇంటి లోనికి ప్రవేశించకుండా ఇంటి ముందు బియ్యపు పిండితో ముగ్గు పెట్టడం వల్ల రాక్షసులు ఇంటిలోనికి ప్రవేశించే సమయంలో బియ్యపు పిండి తింటూ లోపలికి రావడం మర్చిపోతాయని పూర్వీకుల భావిస్తారు.అందుకోసమే అప్పట్లో బియ్యపు పిండితో ముగ్గులు వేసే వారు. రాను రాను ప్రస్తుత కాలంలో రాళ్ల పిండితో ముగ్గులను వేస్తూ ఉండడం మనం చూస్తున్నాము. బియ్యపు పిండితో ముగ్గులు వేయడానికి గల కారణం పిశాచులు, రాక్షసుల నుంచి విముక్తి పొందడం కోసమే అని పండితులు చెబుతున్నారు.

    మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం