నిరుద్యోగులకు శుభవార్త.. బీటెక్ అర్హతతో ఆర్మీలో ఉద్యోగాలు..?

ఇండియన్ ఆర్మీ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్స్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. బీటెక్ పాసైన వాళ్లతో పాటు బీటెక్ ఫైనలియర్ చదువుతున్న విద్యార్థులు సైతం ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 40 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఇండియన్ ఆర్మీ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. వివాహం కాని పురుషులు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. Also Read: ఇంటర్ విద్యార్థులకు శుభవార్త.. […]

Written By: Navya, Updated On : March 3, 2021 12:33 pm
Follow us on

ఇండియన్ ఆర్మీ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్స్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. బీటెక్ పాసైన వాళ్లతో పాటు బీటెక్ ఫైనలియర్ చదువుతున్న విద్యార్థులు సైతం ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 40 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఇండియన్ ఆర్మీ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. వివాహం కాని పురుషులు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Also Read: ఇంటర్ విద్యార్థులకు శుభవార్త.. నెలకు రూ.5 వేల నుంచి రూ.7 వేల స్టైఫండ్..?

ఇప్పటికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా మార్చి 26 ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉంది. https://joinindianarmy.nic.in/ వెబ్ సైట్ ద్వారా 40 ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తెలుసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు ఏకంగా 49 వారాల పాటు డెహ్రడూన్‌లోని ఇండియన్ మిలిటరీ అకాడమీలో శిక్షణ ఉంటుంది.

Also Read: విద్యార్థులకు కేంద్రం శుభవార్త.. ఫ్రీగా టాబ్లెట్స్‌, టెక్ట్స్‌ బుక్స్‌..?

2021 సంవత్సరం జులై 1వ తేదీ నాటికి 20 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవాలనే అభ్యర్థులు మొదట https://joinindianarmy.nic.in/ వెబ్ సైట్ లోకి లాగిన్ అయ్యి officers entry login అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఆ తరువాత రిజిస్ట్రేషన్ ట్యాబ్ పై క్లిక్ చేసి వివరాలను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

మరిన్ని వార్తలు కోసం: విద్య / ఉద్యోగాలు

ఆ తరువాత ఫోటో, సంతకం అప్ లోడ్ చేసి వివరాలను ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుని సబ్మిట్ చేసి ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. 40 ఉద్యోగ ఖాళీలలో సివిల్ లేదా బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ టెక్నాలజీ ఉద్యోగాలు 11 ఉండగా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఉద్యోగాలు 9, ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఉద్యోగాలు 4, ఏరోనాటికల్ లేదా ఏరోస్పేస్ లేదా ఏవియానిక్స్ ఉద్యోగాలు 3, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉద్యోగాలు 3, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ ఉద్యోగాలు 2, టెలీకమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, శాటిలైట్ కమ్యూనికేషన్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, టెక్స్‌టైల్ ఇంజనీరింగ్ ఉద్యోగ ఖాళీలు ఒకటి చొప్పున ఉన్నాయి.