పార్టీ ప్రకటించకముందే షర్మిలపై విమర్శల ట్రోల్స్‌

తెలంగాణ రాష్ట్రంలో రాజన్న రాజ్యం తెస్తానంటూ తెరమీదకు వచ్చిన వైఎస్‌ షర్మిల.. ఇప్పుడు రాష్ట్రమంతటా చర్చకు తెరతీశారు. మరికొద్ది రోజుల్లోనే ఆమె పార్టీ పేరును.. విధివిధానాలను ప్రకటించబోతున్నారు. ఇప్పటికే ఆమె ఆయా జిల్లాల వైఎస్‌ అభిమానులతో మీటింగ్‌లు సైతం నిర్వహిస్తున్నారు. అయితే.. ఇప్పుడు పార్టీకి హైప్ తీసుకొచ్చేందుకు.. ఆ పార్టీ వ్యూహకర్తలు చేస్తున్న తప్పటడుగులు షర్మిల చేత చేయిస్తున్న ప్రకటనలు ట్రోలింగ్‌కు గురవుతున్నాయి. సోషల్ మీడియాలో కామెడీ చేస్తున్నారు. Also Read: అప్పుల కుప్పయిన ఏపీ వీటన్నింటిని […]

Written By: Srinivas, Updated On : March 3, 2021 11:19 am
Follow us on


తెలంగాణ రాష్ట్రంలో రాజన్న రాజ్యం తెస్తానంటూ తెరమీదకు వచ్చిన వైఎస్‌ షర్మిల.. ఇప్పుడు రాష్ట్రమంతటా చర్చకు తెరతీశారు. మరికొద్ది రోజుల్లోనే ఆమె పార్టీ పేరును.. విధివిధానాలను ప్రకటించబోతున్నారు. ఇప్పటికే ఆమె ఆయా జిల్లాల వైఎస్‌ అభిమానులతో మీటింగ్‌లు సైతం నిర్వహిస్తున్నారు. అయితే.. ఇప్పుడు పార్టీకి హైప్ తీసుకొచ్చేందుకు.. ఆ పార్టీ వ్యూహకర్తలు చేస్తున్న తప్పటడుగులు షర్మిల చేత చేయిస్తున్న ప్రకటనలు ట్రోలింగ్‌కు గురవుతున్నాయి. సోషల్ మీడియాలో కామెడీ చేస్తున్నారు.

Also Read: అప్పుల కుప్పయిన ఏపీ

వీటన్నింటిని చూస్తున్న నెటిజన్లు సైతం ఇంత ఎలివేషన్ అవసరమా అన్న కామెంట్స్ పెడుతున్నారు. దీనికి కారణం కాస్త ‘అతి’గా రాజకీయవ్యూహాలు అమలు చేయడమే. కొద్ది రోజుల కిందట.. షర్మిల యూనివర్శిటీల విద్యార్థులతో భేటీ అయ్యారు. ఎక్కడెక్కడి నుంచి వచ్చారో కానీ.. ఓ రెండు వందల మంది వరకూ వచ్చారు. ఆ విద్యార్థుల్లో ఒక వ్యక్తి.. తనకు తండ్రి లేడని.. అన్నీ షర్మిల అక్కేనని కన్నీళ్లు పెట్టుకున్నాడు. అక్క రావాలి.. అక్క కావాలి అని.. భావోద్వేగంగా స్పందించాడు. దానికి షర్మిల కూడా ఆనందభాష్పాలతో స్పందించారు.

‘నేను నిలబడతా.. మిమ్మల్ని నిలబెడతా’ అని డ్రమెటిక్‌గా ప్రకటన చేశారు. ఈ సీన్ సోషల్ మీడియాలో హైలెట్ అయిపోయింది. పెయిడ్ ఆర్టిస్టులతో షర్మిల రాజకీయం చేస్తున్నారని ట్రోలింగ్స్ ప్రారంభమయ్యాయి. అక్క రావాలి అని ఏడ్చిన వ్యక్తి విద్యార్థి కాదు కల్వరి చర్చిలో వేషాలు వేస్తూ డ్రమ్స్ వాయించే వ్యక్తి. ఆ తర్వాత కూడా షర్మిల చేత చేయిస్తున్న ప్రకటనలు అన్నీ వివాదాస్పదమవుతున్నాయి. షర్మిల పార్టీలోకి ఆ ప్రముఖ నేత..ఈ ప్రముఖ నేత రాబోతున్నారని ప్రచారం చేయించుకుటున్నారు. మీడియాకు లీకులిస్తున్నారు.

Also Read: అమ్మాయితో రాష్ట్రమంత్రి సెక్స్ వీడియో.. వైరల్

కానీ.. లోటస్ పాండ్ వైపు గతంలో వైసీపీలో పని చేసి.. ఇప్పుడు ఏ పార్టీలోనూ చోటు లేక రాజకీయంగా ఖాళీగా ఉన్న వాళ్లు మాత్రమే వచ్చి పోతున్నారు. ఓ రకంగా తెలంగాణలో మిగిలి ఉన్న వైసీపీ నేతలు మాత్రమే వస్తున్నారు. అయినప్పటికీ.. లక్షల మందితో సభలు అంటూ మీడియాతో ప్రచారం చేయించుకునేందుకు షర్మిల పార్టీ వర్గాలు చాలా ప్రయత్నిస్తున్నారు. తాజాగా.. ఖమ్మంలో ఏప్రిల్ 9న లక్షల మందితో సభ పెట్టి పార్టీని ప్రకటిస్తామని.. జూలై 8న ఐదు లక్షల మందితో సభ పెట్టి విధివిధానాలు ప్రకటిస్తామని చెప్పుకొచ్చారు. ఐదు లక్షల మందితో సభ ఎక్కడ పెడతారంటే హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో అని చెబుతున్నారు. మరి ఆ స్టేడియం కెపాసిటీ ఎంతో షర్మిలకు తెలుసా అని ట్రోల్‌ అవుతోంది. ఆ స్టేడియం కెపాసిటీ 30 వేలు. గ్రౌండ్‌లో ఓ ఐదు వేలు పడతారేమో. మరి ఐదు లక్షల మందితో గ్రాఫిక్స్‌తో నిర్వహిస్తారా అన్న ట్రోలింగ్స్ ప్రారంభమయ్యాయి. వైసీపీ రాజకీయాలు ఎలా చేస్తోందో అచ్చంగా అదే ఫార్ములాను షర్మిల అమలు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్