https://oktelugu.com/

గూగుల్ పే, ఫోన్ పే కస్టమర్లకు శుభవార్త.. ఆ ఛార్జీలు లేనట్లే..?

దేశంలో కోట్ల సంఖ్యలో వినియోగదారులు గూగుల్ పే, ఫోన్ పే ద్వారా డిజిటల్ లావాదేవీలు జరుపుతున్న సంగతి తెలిసిందే. అయితే గత కొన్నిరోజులుగా థర్డ్ పార్టీ యాప్ లైన గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లావాదేవీలు జరిపే వాళ్లు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వెల్లడించినట్టు ఒక వార్త వైరల్ అవుతోంది. ప్రస్తుతం గూగుల్, ఫోన్ పే, ఇతర యూపీఐల సహాయంతో సులభంగా లావాదేవీలను నిర్వహించడం సాధ్యమవుతోంది. Also Read: […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 2, 2021 / 12:16 PM IST
    Follow us on


    దేశంలో కోట్ల సంఖ్యలో వినియోగదారులు గూగుల్ పే, ఫోన్ పే ద్వారా డిజిటల్ లావాదేవీలు జరుపుతున్న సంగతి తెలిసిందే. అయితే గత కొన్నిరోజులుగా థర్డ్ పార్టీ యాప్ లైన గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లావాదేవీలు జరిపే వాళ్లు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వెల్లడించినట్టు ఒక వార్త వైరల్ అవుతోంది. ప్రస్తుతం గూగుల్, ఫోన్ పే, ఇతర యూపీఐల సహాయంతో సులభంగా లావాదేవీలను నిర్వహించడం సాధ్యమవుతోంది.

    Also Read: అమ్మఒడి పథకంలో చేరేవారికి అలర్ట్.. దరఖాస్తుకు చివరితేదీ ఎప్పుడంటే..?

    తాజాగా ఎన్పీసీఐ వైరల్ అవుతున్న వార్తల గురించి ఛార్జీల గురించి స్పష్టత ఇచ్చింది. వినియోగదారుల నుంచి యూపీఐ లావాదేవీలకు ఎటువంటి ఛార్జీలను వసూలు చేయడం లేదని వినియోగదారులు కంగారు పడవద్దని ఎన్పీసీఐ వెల్లడించింది. జనవరి 1వ తేదీ నుంచి అదనపు ఛార్జీలు అమలవుతాయని గూగుల్ పే, ఫోన్ పే యూజర్లు భావించగా అలాంటి ఛార్జీలను వసూలు చేయడం లేదని ఎన్పీసీఐ పేర్కొంది. గతంలోలా యూపీఐ లావాదేవీలను జరుపుకోవచ్చని తెలిపింది.

    Also Read: జియో కస్టమర్లకు బంపర్ ఆఫర్.. ఉచితంగా వాయిస్ కాల్స్..?

    గతేడాది అదనపు ఛార్జీల గురించి వెలువడిన నివేదికల గురించి కూడా ఎన్పీసీఐ స్పందించి స్పష్టతనిచ్చింది. అధికారిక ప్రకటన వస్తే తప్ప నివేదికలను నమ్మవద్దని ఎన్పీసీఐ తెలిపింది. యూజర్ల నుంచి అదనంగా ఛార్జీలను వసూలు చేసే ఉద్దేశం లేదని ఎన్పీసీఐ పేర్కొంది. కేంద్రం కూడా యూపీఐ యాప్స్ చెల్లింపులపై అదనపు ఛార్జీలను విధించడానికి సుముఖంగా లేదు.

    మరిన్ని వార్తల కోసం: ప్రత్యేకం

    కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహిస్తోంది. యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు విధిస్తే డిజిటల్ లావాదేవీలు తగ్గడంతో పాటు నగదు సహిత లావాదేవీలు పెరిగే అవకాశాలు ఉంటాయి. అందువల్ల డిజిటల్ లావాదేవీలపై ఛార్జీలు విధించడానికి కేంద్రం సుముఖంగా లేదని తెలుస్తోంది.