కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు, చదువు మధ్యలో ఆపేసిన వాళ్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. పీఎం కుశల్ వికాస్ యోజన స్కీమ్ ద్వారా చదువు మధ్యలో ఆపేసిన వారికి, నిరుద్యోగులకు ప్రయోజనం చేకూర్చనుంది. ఈ స్కీమ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు ఉద్యోగం కల్పించనుంది. దేశంలో నిరుద్యోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో నిరుద్యోగులకు ప్రయోజనం చేకూర్చేందుకు కేంద్రం ఈ స్కీమ్ ను అమలు చేస్తోంది.
Also Read: సీబీఎస్ఈ విద్యార్థులకు అలర్ట్… పరీక్షలు ఎప్పుడంటే..?
నిరుద్యోగులకు ఎటువంటి దరఖాస్తు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేకుండా సులభంగా ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు గతంలో ఈ స్కీమ్ అమలు ద్వారా కేంద్ర ప్రభుత్వం వేల సంఖ్యలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను కల్పించింది. మరోమారు కేంద్రం కరోనా, లాక్ డౌన్ వల్ల దేశంలో నిరుద్యోగుల సంఖ్య పెరగడంతో భారీగా ఉద్యోగాలకు భర్తీ చేసేందుకు కేంద్రం సిద్ధమవుతూ ఉండటం గమనార్హం.
పీఎంకేవీవై స్కీమ్ ద్వారా కేంద్రం శిక్షణ ఇవ్వడంతో పాటు శిక్షణ అనంతరం కంపెనీలలో ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది. https://www.pmkvyofficial.org/ వెబ్ సైట్ ద్వారా నిరుద్యోగులు ప్రధాన్ మంత్రి కుశల్ వికాస్ యోజన స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. దరఖాస్తు చేసి శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులు 8,000 రూపాయలు పొందే అవకాశం ఉంటుంది.
Also Read: పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి శుభవార్త.. ఖాతాల్లో నగదు జమ..?
ఈ స్కీమ్ కొరకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు హ్యాండిక్రాఫ్ట్ ఫుడ్ ప్రాసెసింగ్, ఫర్నీచర్ అండ్ ఫిటింగ్స్, ఇతర విభాగాలకు సంబంధించి శిక్షణను తీసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ ద్వారా జిల్లా స్థాయి స్కిల్ కమిటీలను బలోపేతం చేయనుంది. కేంద్రం అమలు చేస్తున్న ఈ స్కీమ్ ద్వారా వేల సంఖ్యలో నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది.
మరిన్ని వార్తల కోసం: విద్య / ఉద్యోగాలు