https://oktelugu.com/

ఆదిలాబాద్ ‘అడవుల్లో’ పురుడుపోసుకున్న కొత్త ఉద్యమం..!

అడవిబిడ్డలు మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. గతంలో ఎన్నో ఉద్యమాలకు కేరాఫ్ గా ఆదిలాబాద్ అడవులు నిలిచిన సంగతి తెల్సిందే. మన్యంవీరుడు కొమురంభీం స్ఫూర్తితో ఆదివాసీ బిడ్డలు ‘సేవ్ ట్రైబల్స్ ఫ్రం టైగర్’ ఉద్యమానికి సిద్ధమయ్యారు. ఆదిబాద్ లోని ఏజెన్సీ ప్రాంతాల్లో కొద్దిరోజులుగా పెద్దపులి సంచరిస్తోంది. ఆదివాసీ గూడెల్లోని పశువులపై పెద్దపులి దాడి చేస్తుండటంతో ప్రజలంతా భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడేం జరుగుందా? అని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. పెద్దపులిని ఫారెస్టు అధికారులు పట్టుకొని తమను.. పశువులను కాపాడాలని […]

Written By:
  • Neelambaram
  • , Updated On : January 2, 2021 / 01:00 PM IST
    Follow us on

    అడవిబిడ్డలు మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. గతంలో ఎన్నో ఉద్యమాలకు కేరాఫ్ గా ఆదిలాబాద్ అడవులు నిలిచిన సంగతి తెల్సిందే. మన్యంవీరుడు కొమురంభీం స్ఫూర్తితో ఆదివాసీ బిడ్డలు ‘సేవ్ ట్రైబల్స్ ఫ్రం టైగర్’ ఉద్యమానికి సిద్ధమయ్యారు.

    ఆదిబాద్ లోని ఏజెన్సీ ప్రాంతాల్లో కొద్దిరోజులుగా పెద్దపులి సంచరిస్తోంది. ఆదివాసీ గూడెల్లోని పశువులపై పెద్దపులి దాడి చేస్తుండటంతో ప్రజలంతా భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడేం జరుగుందా? అని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.

    పెద్దపులిని ఫారెస్టు అధికారులు పట్టుకొని తమను.. పశువులను కాపాడాలని ఆదివాసీలు ఫారెస్టు అధికారులను డిమాండ్ చేస్తున్నారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు గుప్పిస్తున్నారు.

    ఫారెస్టు అధికారుల తీరును నిరసిస్తూ ఆదివాసీలంతా ఇటీవల జిల్లాలో నిరసనలు తెలిపారు. ఫారెస్టు అధికారులు పెద్దపులిని పట్టుకోవడంలో విఫలమయ్యారంటూ ఆరోపణలు గుప్పించారు.

    ఫారెస్టులు అధికారులు వెంటనే పెద్ద పులిని పట్టుకునేందుకు చర్యలు తీసుకోవాలని.. లేనట్లయితే తామే పెద్దపులిని పట్టుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. పులిని పట్టుకునే క్రమంలో ఆదివాసీలకు ఏదైనా జరిగితే పూర్తి ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు.

    ఆదివాసీల ఉద్యమానికి ఇటీవల మద్దతు తెలిపిన ఎంపీ సోయంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివాసీ ప్రాంతాల్లోని ప్రజలను గూడెల్లో నుంచి తరిమేందుకు పెద్దపులిలను అధికారులు స్వేచ్ఛగా వదిలేశారని ఆరోపించారు.

    అడవులు గిరిజనులకు చెందినవి.. అక్కడే స్వేచ్ఛ బతికే హక్కు వారిని ఉందని తెలిపారు. దీంతో ఆయనన వ్యాఖ్యలు రాజకీయంగా కలకలరం రేపాయి. కాగా ఆదివాసీలు చేపడుతున్న ‘సేవ్ ట్రైబల్స్ ఫ్రం టైగర్స్’ ఉద్యమాన్ని 150కు పైగా ఆదివాసీ గూడాల్లో చేపట్టేందుకు ఏజేన్సీవాసులు సిద్ధమవుతున్నారు.

    ఈ ఉద్యమం తీవ్రరూపం దాల్చకముందే ఫారెస్టు అధికారులు పెద్దపులిని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే పెద్దపులి ఫారెస్టు అధికారులకు బోనుకు చిక్కుతుందా? లేదంటే ఆదివాసీల చేతికి చిక్కుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది.