https://oktelugu.com/

Pragya Jaiswal: బికినీ వేసిన బాలయ్య భామ… ప్రగ్యా జైస్వాల్ గ్లామర్ కి సోషల్ మీడియా బ్లాస్ట్!

ప్రగ్యా జైస్వాల్ కి అఖండ ఆఫర్ దక్కింది. మూవీ బ్లాక్ బస్టర్ కావడంతో ప్రగ్యా పేరు కొంచెం గట్టిగానే వినిపించింది. అఖండ మూవీలో ప్రగ్యా పాత్రకు ప్రాధాన్యత. స్క్రీన్ స్పేస్ కూడా ఉంది. కాబట్టి ప్రగ్యాకు అవకాశాలు పెరగాల్సింది. కానీ ప్రగ్యాకు నిరాశే ఎదురైంది. అఖండ తర్వాత ఆమె సన్ ఆఫ్ ఇండియా వంటి చిత్రంలో నటించాల్సి వచ్చింది.

Written By:
  • Shiva
  • , Updated On : May 2, 2023 / 08:11 AM IST
    Follow us on

    Pragya Jaiswal: ప్రగ్యా జైస్వాల్ కి అసలు టైం కలిసి రావడం లేదు. అఖండ వంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినా కూడా ఆమె ఫేట్ మారలేదు. చేతిలో ఒక్క ఆఫర్ కూడా లేని ప్రగ్యా మేకర్స్ వైపు ఆశగా చూస్తుంది. ప్రగ్యా జైస్వాల్ దర్శకుడు క్రిష్ ఫేవరేట్ హీరోయిన్. ఆ విధంగా ఆమెకు బాలయ్య-బోయపాటి శ్రీను మూవీలో ఛాన్స్ ఇప్పించాడు. అఖండ నాటికి బాలయ్య పరిస్థితి దారుణంగా ఉంది. వరుస ప్లాప్స్ తో అసలు కెరీర్ క్లోజ్ అవుతుందనే వాదన మొదలైంది. అఖండకు ముందు బాలయ్య చేసిన రూలర్ మూవీ డబుల్ డిజాస్టర్. కనీస వసూళ్లు రాలేదు. దాంతో బాలయ్యతో నటించేందుకు హీరోయిన్స్ ఎవరూ సిద్ధంగా లేరు.

    అలా ప్రగ్యా జైస్వాల్ కి అఖండ ఆఫర్ దక్కింది. మూవీ బ్లాక్ బస్టర్ కావడంతో ప్రగ్యా పేరు కొంచెం గట్టిగానే వినిపించింది. అఖండ మూవీలో ప్రగ్యా పాత్రకు ప్రాధాన్యత. స్క్రీన్ స్పేస్ కూడా ఉంది. కాబట్టి ప్రగ్యాకు అవకాశాలు పెరగాల్సింది. కానీ ప్రగ్యాకు నిరాశే ఎదురైంది. అఖండ తర్వాత ఆమె సన్ ఆఫ్ ఇండియా వంటి చిత్రంలో నటించాల్సి వచ్చింది. మోహన్ బాబు సినిమాలో హీరోయిన్ అంటే ఆమె రేంజ్ ఎక్కడికి పడిపోయింది అర్థం చేసుకోవచ్చు.

    ఇక సన్ ఆఫ్ ఇండియా రిజల్ట్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. పార్కింగ్, పోస్టర్ ఛార్జెస్ కూడా రాలేదు. చూస్తుంటే టాలీవుడ్ లో ప్రగ్యా ప్రయాణం ముగిసినట్లు అనిపిస్తుంది. ప్రగ్యా పరిశ్రమకు వచ్చి దశాబ్దం అవుతుంది. 2014లో విడుదలైన తమిళ చిత్రం విరాట్టు ఆమె డెబ్యూ ఫిల్మ్. తెలుగులో ఈ మూవీ డేగ టైటిల్ తో విడుదలైంది. మిర్చిలాంటి కుర్రోడు మూవీతో టాలీవుడ్ లో అడుగుపెట్టారు.

    దర్శకుడు క్రిష్ తెరకెక్కించిన కంచె మంచి చిత్రంగా పేరు తెచ్చుకుంది. ఈ పీరియాడిక్ ఎమోషనల్ లవర్ డ్రామా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. చెప్పుకోదగ్గ కమర్షియల్ హిట్ కాకున్నా… కంచె ఆకట్టుకుంది. కంచె అనంతరం ఓం నమో వెంకటేశాయా అనే భక్తి చిత్రంలో నటించారు. గుంటూరోడు, నక్షత్రం డిజాస్టర్స్ అయ్యాయి. మంచు విష్ణుకు జంటగా నటించిన ఆచారి అమెరికా యాత్ర సైతం నిరాశపరిచింది. కాగా ఆఫర్స్ లేని ప్రగ్యా సోషల్ మీడియా వేదికగా అందాల ప్రదర్శన చేస్తుంది. తాజాగా బికినీలో కనిపించి షాక్ ఇచ్చింది.