మైక్రో సాఫ్ట్ అధినేత బిల్ గేట్. ఆయన జీవితంలో సైతం చీకటి కోణం ఉన్నట్లు తేలింది. సహోద్యోగిణితో సాగించిన రాసలీల ఫలితమే విడాకులని ఓ కథ ప్రచారంలో ఉంది. అయితే ఇవేవీ కాదని వారు పరస్పర సమ్మతంతోనే విడాకులు తీసుకున్నారని మరో కథనం. ఇందులో ఏది నిజమో ఏది అబద్దమో ఎవరికీ తెలియదు. మహానుభావుల జీవితాల్లో కూడా చీకట్లు కమ్మే చేదు నిజాలు ఉంటాయనేది సత్యం. అపర కుబేరుడిగా, దానకర్ణుడిగా పేరున్న బిల్ గేట్ ఓ మహిళకు లొంగిపోవడం యాదృచ్ఛికమేమీ కాదు. ఇందులో ఏదో తెలియని మతలబు దాగే ఉంటుంది.
రాసలీలల కారణంగానే..
మైక్రోసాఫ్ట్ బోర్డు నుంచి గత మార్చి 13న బోర్డు నుంచి వైదొలిగారు. అయితే సేవా కార్యక్రమాలను విస్తృతం చేయాలనే ఉద్దేశంతోనే బోర్డు నుంచి తప్పుకున్నట్లు ప్రకటించినా సహోద్యోగిణితో రాసలీలల ఫలితమేనని కొందరు పేర్కొంటున్నారు. నీరు పల్లమెరుగు… నిజం దేవుడెరుగు అన్నట్టు బిల్ గేట్ జీవితంలో చీకటి కోణంపై నిజానిజాలు ఆ దేవుడికే తెలియాలి.
దర్యాప్తులో తేలిన నిజం
మైక్రో సాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ అక్రమ సంబంధాలపై మహిళా ఇంజినీర్ బోర్డుకు లేఖ రాసింది. దీంతో నిజానిజాలు తేల్చేందుకు బోర్డు దర్యాప్తునకు ఆదేశించింది. మహిళా ఇంజినీర్ లేఖపై ప్రత్యేకంగా థర్డ్ పార్టీ న్యాయ విభాగంతో విచారణ జరిపించింది. అక్రమ సంబంధం వ్యవహారం నిజమేనని నిర్ధారించింది. దీంతో బోర్డు సభ్యులు సదరు మహిళకు రక్షణ కల్పించినట్లు తెలుస్తోంది.
వివాహేతర సంబంధం కారణం కాదు
బిల్ గేట్స్ విడాకులు తీసుకోవడానికి వివాహేతర సంబంధం కారణం కాకపోవచ్చని బిల్ గేట్స్ అధికార ప్రతినిధి వివరించారు. వారి మధ్య సంబంధం ఇప్పటిది కాదని గత 20 ఏళ్లుగా కొనసాగుతోందని స్పష్టం చేశారు. బిల్ గేట్స్ విడాకులకు ఈ సంబంధం కారణం కాదనే విషయం స్పష్టం చేశారు. 2000 సంవత్సరంలో బిల్ గేట్స్, ఆ మహిళా ఇంజినీర్ కొంత కాలం ఏకాంతంగా గడిపారని తెలిపారు.
మలి దశలో..
బిల్ గేట్స్ మలిదశలో 65
సంవత్సరాల వయసులో భార్యకు విడాకులివ్వడం చర్చనీయాంశమైంది. 27 సంవత్సరాల వైవాహిక జీవితంలో అనుబంధాల స్మృతులను నెమరు వేసుకోవాల్సిన వయసులో విడాకులు తీసుకోవడం వెనుక ఆంతర్యమేమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. ఒకరిపై ఒకరికి నమ్మకం సడలుతున్నందునే విడాకులు తీసుకుంటున్నట్లు ఇద్దరూ ప్రకటించారు. తమ భవిష్యత్తు జీవితంపై కలలు కంటూ ట్విటర్లో పోస్టులు పెట్టారు.