అందుబాటులోకి 2డీజీ ఔషధం

కరోనాపై పోరాడేందుకు భారత రక్షణ సంస్థ డీఆర్ డీఓ అభివృద్ధి చేసిన 2డీజీ అందుబాటులోకి వచ్చింది. ఔషధాన్ని సోమవారం ఢిల్లీలో కేంద్ర రక్షణ, ఆరోగ్య శాఖ మంత్రులు రాజ్ నాథ్ సింగ్, హర్షవర్ధన్ విడుదల చేశారు. వాటిని దేశ రాజధాని ఢిల్లీలోని పలు ఆసుపత్రుల్లో మొత్తం పదివేల డోసులు పంపిణీ చేయనున్నారు. పొడి రూపంలో రానున్న ఈ ఔషధాన్ని నీటితో కలిపి తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో వైరస్ ఉన్న కణాల్లోకి చేరి, దానిని అడ్డుకుంటుందని డీఆర్ డీఓ […]

Written By: Suresh, Updated On : May 17, 2021 11:21 am
Follow us on

కరోనాపై పోరాడేందుకు భారత రక్షణ సంస్థ డీఆర్ డీఓ అభివృద్ధి చేసిన 2డీజీ అందుబాటులోకి వచ్చింది. ఔషధాన్ని సోమవారం ఢిల్లీలో కేంద్ర రక్షణ, ఆరోగ్య శాఖ మంత్రులు రాజ్ నాథ్ సింగ్, హర్షవర్ధన్ విడుదల చేశారు. వాటిని దేశ రాజధాని ఢిల్లీలోని పలు ఆసుపత్రుల్లో మొత్తం పదివేల డోసులు పంపిణీ చేయనున్నారు. పొడి రూపంలో రానున్న ఈ ఔషధాన్ని నీటితో కలిపి తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో వైరస్ ఉన్న కణాల్లోకి చేరి, దానిని అడ్డుకుంటుందని డీఆర్ డీఓ వివరించింది. కరోనాకు ఇప్పటి వరకు వ్యాక్సిన్లు మాత్రమే ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ ఈ పౌడర్ ను డాక్టర్ రెడ్డీస్ లాబోరేటరి సహకారంతో అభివృద్ధి  చేసింది.