Russia Ukraine War: ఒకప్పుడు సోవియట్ యూనియన్ లో భాగమైన ‘ఉక్రెయిన్’ దేశం.. ఒక అధ్యక్షుడి ‘పాశ్చాత్య’ ధోరణికి బలైపోయిందన్న చర్చసాగుతోంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు.. తమ మిత్ర దేశం రష్యాను కాదని.. యూరప్ దేశాలతో చేతులు కలిపి ‘నాటో’ కూటమిలో చేరాలనుకుంది. ఉక్రెయిన్ లో సైనిక, వైమానిక స్థావరాలను నాటో సాయంతో ఏర్పాటుచేసింది. ఇదే రష్యా కోపానికి కారణమైంది. తమ పక్కలో బల్లెంలా తయారవుతున్న రష్యాపై యుద్ధానికి ఉసిగొల్పింది. ఈ మొత్తం ఎపిసోడ్ లో రష్యా తమ రక్షణ కోణంలో యుద్ధానికి దిగడం ఎంత తప్పో.. అంతే తప్పు ఉక్రెయిన్ దేశం చేసింది.

ఎందుకంటే బలమైన యూరప్, అమెరికా చూసుకొని ఉక్రెయిన్ రెచ్చిపోయింది. బలమైన రష్యా ముందు కుప్పిగంతులు వేసింది. వెరసి రష్యా యుద్ధానికి దిగినా యూరప్, నాటో దేశాలు స్పందించలేదు. ఉక్రెయిన్ కు బాసటగా యుద్ధంలోకి దిగలేదు. కేవలం ఆయుధాలు పంపించి చేతులు దులుపుకుంది. దీంతో యుద్ధంతో నిండా మునిగి ఇప్పుడు ఉక్రెయిన్ శిథిల సౌధాలతో ప్రాణ నష్టాలతో కునారిల్లుతోంది. నాటో దేశాలను నమ్ముకొని నిండా మునిగామని ఉక్రెయిన్ అధ్యక్షుడు ఇప్పుడు ఎంత ఏడ్చినా నిండా మునిగాక ఆ చలి తీవ్రత ఇక కనిపించదనే చెప్పాలి.
ఉక్రెయిన్ పై రష్యా దాడితో ఒకటి మాత్రం ప్రపంచానికి అర్థమైంది. నాటో, అమెరికాను చూసుకొని విర్రవీగిన ఉక్రెయిన్.. రష్యాకు వ్యతిరేకంగా సరిహద్దుల్లో సైనిక స్థావరాలు ఏర్పాటు చేసింది. తమను యూరప్, అగ్రరాజ్యం అమెరికా ఆదుకుంటుందని ఉక్రెయిన్ భావించింది. కానీ వాళ్లు ఎవరూ సపోర్టుగా యుద్దంలోకి రాకపోవడంతో ఇప్పుడు నిండా మునిగింది.
ఇప్పుడే కాదు.. గతంలో అమెరికా, నాటో కూటమి ఇచ్చిన హామీలను విశ్వసించిన జార్జియా దేశం కూడా ఇలానే యుద్ధం దెబ్బకు నిండామునిగింది. అచ్చం ఇప్పుడు వాటిని నమ్మిన ఉక్రెయిన్ దేశం కూడా ఇప్పుడు ఎటూ కాకుండా పోయింది. అమెరికా, నాటో దేశాల హామీలతో అణ్వాయుధాలను ఉక్రెయిన్ నిర్వీర్యం చేసింది. ఇప్పుడు అణుబాంబులు ఉంటే రష్యా దాడి చేసేందుకు సందేహించేది. ఉక్రెయిన్ అణుబాంబులు వేస్తే రష్యా నాశనమయ్యేది. అగ్రరాజ్యాలను నమ్మి ఇప్పుడు ఉక్రెయిన్ మునిగిందనే చెప్పాలి.
Also Read: ఉక్రెయిన్ యుద్ధం: రష్యా తగ్గడం లేదు..
ఇక అమెరికా, యూరప్ దేశాల హామీలు నీటిమూటలని.. నమ్మించి మోసం చేస్తాయని మరోసారి నిరూపితమైంది. మొన్నటికి మొన్న అప్ఘనిస్తాన్ నుంచి వైదొలిగి నాశనం చేసి అమెరికా, నాటో ఇఫ్పుడు ఉక్రెయిన్ ను అలాగే వదిలేసింది. ఈ దేశాలను ఇప్పుడు ప్రపంచ దేశాలు నమ్మని పరిస్థితులు నెలకొన్నాయి.
ఇరాక్, అప్ఘనిస్తాన్ యుద్ధాలతో అమెరికా చితికి పోయింది. ఈ క్రమంలోనే వచ్చిపడ్డ కరోనా దెబ్బకు ఆర్థికంగా కుదేలైంది. దీంతో ఇప్పుడు చైనా అగ్రరాజ్యంగా తెరపైకి వచ్చింది.అందుకే ఉక్రెయిన్ విషయంలో అమెరికా మౌనం దాల్చింది.
Also Read: పవన్ కళ్యాణ్ రియల్ లైఫ్ లో కూడా హీరోనే!
[…] Also Read: అమెరికా, యూరప్ మోసం.. నమ్మి ‘ఉక్రెయిన… […]
[…] Russia-Ukraine conflict: ముందు నుయ్యి వెనుక గొయ్యి అంటే ఇదేనేమో. ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ పై యుద్ధం చేస్తోంటే ప్రపంచ దేశాలు రష్యా చర్యను ఖండిస్తుంటే డ్రాగన్ మాత్రం ఎటూ తేల్చుకోలేకపోతోంది. దీంతో రష్యా చర్యను అన్ని దేశాలు ముక్త కంఠంతో ప్రశ్నిస్తుంటే చైనా మాత్రం ఏమీ అనలేకపోతోంది. ఉక్రెయిన్ కు మద్దతుగా చాలా దేశాలు మద్దతు తెలుపుతుంటే చైనా ఏ నిర్ణయం చెప్పలేకపోతోంది. […]