Shivaratri: ప్రతి ఏడాది ఫాల్గుణ మాసంలో మహాశివరాత్రి పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది మహా శివరాత్రి పండుగ మార్చి ఒకటో తేదీ వచ్చింది అయితే మహా శివరాత్రిని పార్వతీ పరమేశ్వరుల కల్యాణం జరిగిన రోజుగా భక్తులు జరుపుకుంటారు. ఈ క్రమంలోనే మహా శివరాత్రి పండుగ రోజు దేశంలోని అన్ని శివాలయాలు శివ నామస్మరణతో మార్మోగిపోతూ ఉంటాయి. అయితే ఈ మహా శివరాత్రి రోజు భక్తులు పెద్ద ఎత్తున ఉపవాస జాగరణలతో స్వామి వారిని పూజిస్తారు.

ఈ విధంగా స్వామివారికి పూజ చేసే సమయంలో పొరపాటున కూడా కొన్ని వస్తువులను ఉపయోగించకూడదని పండితులు చెబుతున్నారు మరి ఆ వస్తువులు ఏమిటి అనే విషయానికి వస్తే….
శంఖం: ఆ మహా శివుడి పూజలో పొరపాటున కూడా శంఖం ఉపయోగించకూడదు. శివుడు శంఖచూడుడు అనే రాక్షసుడిని చంపటం వల్ల అప్పటి నుంచి శంఖాన్ని ఆ రాక్షసుడికి ప్రతీకగా భావిస్తారు. అలాగే శంఖచూడుడు నారాయణకి పరమ భక్తుడు కావటంచేత శంఖం శివుడి పూజలో ఉపయోగించరు.
మొగలి పువ్వు: మొగలిపువ్వు పరమేశ్వరుడు పూజకు అనర్హం. తన పూజకు మొగలిపువ్వు ఉపయోగించకూడదని పరమేశ్వరుడు శాపం పెట్టడం వల్ల పరమేశ్వరుడి పూజలో మొగలిపువ్వు ఉపయోగించరు.
పసుపు కుంకుమ: మహా శివుడి పూజలు ఎప్పుడు కూడా పసుపు కుంకుమ ఉపయోగించకూడదు. శివుడి పూజలో కేవలం భస్మం మాత్రమే ఉపయోగించాలి. కుంకుమ రంగు ఉద్దీపనకు కారణంగా పరిగణిస్తారు కనుక శివుడి పూజలో కుంకుమ పసుపు ఉపయోగించరు.
తులసి దళం: పురాణాల ప్రకారం గత జన్మలో తులసి బృందాగా జన్మించి ఉంటుంది ఆమె భర్త పేరు జలంధర్. శివుడు జలంధరుడి ని చంపటం వల్ల బృందా తన భర్తను చంపిన ఆ శివుడిపూజకు తనని ఉపయోగించవద్దని శాపం కారణంగా శివుడి పూజలు తులసిని ఎప్పటికి ఉపయోగించకూడదు. కనుక పొరపాటున కూడా ఈ వస్తువులను శివ పూజలో ఉపయోగించ కూడదని పండితులు చెబుతున్నారు.