https://oktelugu.com/

ఆ వ్యక్తి ఆచూకీ చెబితే లక్ష రూపాయలు.. అతనెవరంటే..?

కేంద్రం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో రైతులు ఉద్యమం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే గణతంత్ర దినోత్సవం రోజున ఎర్రకోట దగ్గర హింసాత్మక ఘటనలు చోటు చేసుకోగా ఆ ఘటనలకు కారణమైన పంజాబ్ నటుడు, గాయకుడు దీప్ సిద్ధు ఆచూకీ తెలిపిన వారికి పోలీసులు లక్ష రూపాయల రివార్డ్ ఇస్తామని కీలక ప్రకటన చేశారు. దాదాపు రెండు నెలల పాటు రైతుల ఉద్యమం ప్రశాంతంగా జరగగా గణతంత్ర దినోత్సవం రోజున ఉద్రిక్తత […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 3, 2021 / 02:39 PM IST
    Follow us on

    కేంద్రం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో రైతులు ఉద్యమం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే గణతంత్ర దినోత్సవం రోజున ఎర్రకోట దగ్గర హింసాత్మక ఘటనలు చోటు చేసుకోగా ఆ ఘటనలకు కారణమైన పంజాబ్ నటుడు, గాయకుడు దీప్ సిద్ధు ఆచూకీ తెలిపిన వారికి పోలీసులు లక్ష రూపాయల రివార్డ్ ఇస్తామని కీలక ప్రకటన చేశారు. దాదాపు రెండు నెలల పాటు రైతుల ఉద్యమం ప్రశాంతంగా జరగగా గణతంత్ర దినోత్సవం రోజున ఉద్రిక్తత చోటు చేసుకుంది.

    Also Read: ఇంటి నుంచే ఆధార్ అప్ డేట్ చేసుకునే ఛాన్స్.. ఎలా అంటే..?

    రైతు సంఘాలు రైతు గణతంత్ర పరేడ్‌ పేరుతో ట్రాక్టర్ల ర్యాలీ చేపట్టగా ఆ ర్యాలీలో తలెత్తిన విధ్వంసానికి దీప్ సిద్ధు ప్రధాన కారణమని ఆరోపణలు వ్యక్తమయ్యాయి. దీంతో ఢిల్లీ పోలీసులు దీప్ సిద్ధును పట్టుకోవాలనే ఉద్దేశంతో లక్ష రూపాయల రివార్డును ప్రకటించారు. ఇతర నిందితుల వివరాలు చెబితే కూడా 50 వేల రూపాయలు రివార్డు ఇస్తామని పోలీసులు వెల్లడించారు. రైతు సంఘాల నేతలు దీప్ సిద్ధు పేరు చెప్పడంతో అతని గురించి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

    Also Read: ప్రపంచం త్వరలోనే అంతం.. డూమ్స్ డే క్లాక్ ఏం చెబుతోందంటే..?

    రైతు గణతంత్ర పరేడ్‌ రోజున దీప్ సిద్ధు తన ఫేస్ బుక్ ఖాతాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు కూడా చేశారని తెలుస్తోంది. కేంద్రం అమలులోకి తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని దీప్ సిద్ధు అతని బృందం నిర్దేశించిన మార్గంలో కాకుండా మరో మార్గంలో వెళ్లి ఎర్రకోట్లపై మతపరమైన జెండాను ఎగురవేశారు. ఆ తరువాత అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న వెంటనే దీప్ సిద్ధు అక్కడినుంచి పరారయ్యాడు.

    మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

    ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు ఇప్పటికే 12 మంది నిందితులకు సంబంధించిన ఫోటోలను విడుదల చేశారు. పోలీసులపై ఆరోజు కర్రలతో దాడి చేసిన నిందితులు కూడా వీరేనని సమాచారం. పోలీసులు కొంతమంది జర్నలిస్టులపై కూడా కేసులు నమోదు చేసినట్టు తెలుస్తోంది.