https://oktelugu.com/

పెన్షనర్లే వాళ్ల టార్గెట్.. డిపాజిట్ కాగానే లక్షల్లో లూటీ..?

ప్రతి నెలా పెన్షనర్లకు ఖాతాలలో పెన్షన్ డబ్బు జమవుతుందన్న సంగతి తెలిసిందే. అయితే కొంతమంది సైబర్ మోసగాళ్లు ప్రస్తుతం పెన్షనర్లనే టార్గెట్ చేస్తున్నారు. బ్యాంకుల నుంచి ఎంత మొత్తం ఖాతాలలో డిపాజిట్ అవుతుందో అంతే మొత్తాన్ని సైబర్ నేరగాళ్లు మాయం చేస్తుండటం గమనార్హం. యూపీలోని ఘాజియాబాద్, మీరట్ జిల్లాలకు చెందిన ముగ్గురు వ్యక్తుల ఖాతాలలోని 30 లక్షల రూపాయల వరకు ఈ విధంగా మాయం చేసినట్లు తెలుస్తోంది. Also Read: కేంద్రం శుభవార్త.. కారును తుక్కు చేస్తే […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 7, 2021 / 06:56 PM IST
    Follow us on

    ప్రతి నెలా పెన్షనర్లకు ఖాతాలలో పెన్షన్ డబ్బు జమవుతుందన్న సంగతి తెలిసిందే. అయితే కొంతమంది సైబర్ మోసగాళ్లు ప్రస్తుతం పెన్షనర్లనే టార్గెట్ చేస్తున్నారు. బ్యాంకుల నుంచి ఎంత మొత్తం ఖాతాలలో డిపాజిట్ అవుతుందో అంతే మొత్తాన్ని సైబర్ నేరగాళ్లు మాయం చేస్తుండటం గమనార్హం. యూపీలోని ఘాజియాబాద్, మీరట్ జిల్లాలకు చెందిన ముగ్గురు వ్యక్తుల ఖాతాలలోని 30 లక్షల రూపాయల వరకు ఈ విధంగా మాయం చేసినట్లు తెలుస్తోంది.

    Also Read: కేంద్రం శుభవార్త.. కారును తుక్కు చేస్తే కొత్త‌కారుపై డిస్కౌంట్‌..!

    మీరట్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదులు అందగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి కేసులు వెలుగులోకి రాకపోయినా అప్రమత్తంగా ఉంటే మంచిది. బ్యాంక్ స్టాఫ్ నుంచి లీక్ అయిన కాన్ఫిడెన్షియల్ డేటా సహాయంతో సైబర్ నేరగాళ్లు ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. రిటైర్మెంట్ సమయానికి పెన్షనర్ అకౌంట్ లో డిపాజిట్ అయ్యే ఎక్కువ మొత్తం నగదును సైబర్ మోసగాళ్లు మాయం చేస్తున్నారు.

    Also Read: ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భార్యను హత్య చేసిన భర్త.. చివరకు..?

    సైబర్ క్రైమ్ సెల్ అధికారులు నెలలో ఏకంగా 300 మంది సైబర్ మోసగాళ్ల బారిన పడి మోసపోయామని ఫిర్యాదు చేస్తున్నారని.. నగదు పోగొట్టుకున్న వాళ్లలో 35 శాతం మంది బాధితుల సొమ్ము మాత్రమే రికవరీ అవుతోందని వెల్లడించారు. కొందరు సైబర్ మోసగాళ్లు ట్రెజరీ డిపార్టుమెంట్ నుంచి కాల్ చేసామని చెప్పి ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నారని పోలీసులు చెబుతున్నారు.

    మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

    గత నెలలో రిటైర్ అయిన నేపాల్ సింగ్ అనే వ్యక్తి ఖాతాలో ఏకంగా 11 లక్షల రూపాయలు మాయమయ్యాయని ఆరు అంకెల ఓటీపీ చెప్పడం వల్ల ఈ డబ్బులు మాయమయ్యాయని సమాచారం. ఘాజియాబాద్ కు చెందిన మరో వ్యక్తి 13 లక్షల రూపాయలు ఇదే విధంగా పోగొట్టుకున్నాడని తెలుస్తోంది.