https://oktelugu.com/

నిరుద్యోగులకు శుభవార్త.. రాతపరీక్ష లేకుండా రైల్వేలో ఉద్యోగాలు..?

రైల్వే శాఖ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. 2,532 అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి ఇండియన్ రైల్వే నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. ముంబై ప్రధాన కేంద్రంగా పని చేస్తున్న సెంట్రల్‌ రైల్వేలో ఉన్న ఖాళీల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు ఎలాంటి దరఖాస్తు ఫీజు ఉండదు. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా మార్చి 5వ తేదీ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉంది. Also Read: పది పాసైన […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 7, 2021 / 06:35 PM IST
    Follow us on

    రైల్వే శాఖ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. 2,532 అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి ఇండియన్ రైల్వే నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. ముంబై ప్రధాన కేంద్రంగా పని చేస్తున్న సెంట్రల్‌ రైల్వేలో ఉన్న ఖాళీల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు ఎలాంటి దరఖాస్తు ఫీజు ఉండదు. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా మార్చి 5వ తేదీ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉంది.

    Also Read: పది పాసైన వాళ్లకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. భారీగా ఖాళీలు..?

    ఆన్ లైన్ లో మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మార్కుల ఆధారంగా ఈ ఉద్యోగాల భర్తీ జరగనుండటంతో మెరిట్ అభ్యర్థులకు ప్రయోజనం చేకూరనుంది. ఎంపికైన అభ్యర్థులు నాగ్‌పూర్‌, భుసావల్‌, షోలాపూర్‌, ముంబై, పుణె డివిజన్ లలో పని చేయాల్సి ఉంటుంది.

    Also Read: పదో తరగతి చదువుతో తపాలా ఉద్యోగం.. ఎలా దరఖాస్తు చేయాలంటే..?

    పదోతరగతి చదివి ఐటీఐ చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. కనీసం 50 శాతం మార్కులతో పాసైన అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 15 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. https://www.rrccr.com/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

    మరిన్ని వార్తలు కోసం: విద్య / ఉద్యోగాలు

    ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఎన్‌టీవీసీ సర్టిఫికెట్‌ ను తప్పనిసరిగా కలిగి ఉండాలి. మొత్తం 2532 ఖాళీలలో క్యారేజ్‌ అండ్‌ వ్యాగన్‌ డిపో, వ్యాగన్‌ వాడి బందర్ లో ‌ ఖాళీలు 469, మాతుంగా వర్క్‌ షాప్‌ లో 547 కుర్లా డీజిల్‌ షెడ్‌ లో 60 ఖాళీలు ఉన్నాయి.