ఇంగ్లండ్ తో టెస్ట్: పంత్ మెరుపులు.. పోరాడుతున్న భారత్

భారత్ తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ పట్టు బిగిస్తోంది. భారత బ్యాట్స్ మెన్ వరుసగా ఔట్ కావడంతో మూడోరోజు సైతం ఇంగ్లండ్ ఆధిపత్యం చెలాయించింది. అయితే రిషబ్ పంత్ 88 బంతుల్లోనే 91 పరుగులు చేసి ఇంగ్లండ్ ను తన దూకుడైన ఆటతో బెంబేలెత్తించాడు. అతడికి పూజారా 73 పరుగులతో అండగా నిలవడంతో టీమిండియా ఆ మాత్రం స్కోరైనా సాధించింది. ప్రస్తుతం టీమిండియా కష్టాల్లో ఉంది. 257/6 తో ఎదురీదుతోంది. సుందర్ 33 పరుగులు, అశ్విన్ […]

Written By: NARESH, Updated On : February 7, 2021 7:00 pm
Follow us on

భారత్ తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ పట్టు బిగిస్తోంది. భారత బ్యాట్స్ మెన్ వరుసగా ఔట్ కావడంతో మూడోరోజు సైతం ఇంగ్లండ్ ఆధిపత్యం చెలాయించింది. అయితే రిషబ్ పంత్ 88 బంతుల్లోనే 91 పరుగులు చేసి ఇంగ్లండ్ ను తన దూకుడైన ఆటతో బెంబేలెత్తించాడు. అతడికి పూజారా 73 పరుగులతో అండగా నిలవడంతో టీమిండియా ఆ మాత్రం స్కోరైనా సాధించింది.

ప్రస్తుతం టీమిండియా కష్టాల్లో ఉంది. 257/6 తో ఎదురీదుతోంది. సుందర్ 33 పరుగులు, అశ్విన్ 8 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆస్ట్రేలియా టెస్టులో లాగా వీరిద్దరూ నిలబడితే ఖచ్చితంగా ఈ టెస్టులో ఇండియా నిలబడుతుంది. లేదంటే ఓటమి ఖాయం. మరో రెండు రోజులు ఆట మిగిలి ఉండడం.. పిచ్ అనూహ్యంగా మలుపులు తిరుగుతుండడంతో టెస్ట్ రసకందాయంలో పడింది.

ఇంగ్లండ్ బౌలర్లలో బెస్ 4 వికెట్లు, అర్చర్ 2 వికెట్లతో ఇండియాను దెబ్బతీశారు. భారత్ ఇంకా 321 పరుగులతో వెనుకంజలో ఉంది. రేపు పుంజుకోకుంటే భారత్ కు మరిన్ని కష్టాలు తప్పవు.

అంతకుముందు 555/8 స్కోరుతో మూడోరోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో 578 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

భారీ స్కోరును ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ 73 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. రోహిత్ 6, గిల్ 29 పరుగులకే ఔట్ అయ్యారు. కోహ్లీ సైతం 11 పరుగులకే ఔట్ అయ్యాడు. రహానే సైతం 1 పరుగుకే ఔట్ కావడంతో భారత్ 73 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

ఇక పూజారా-పంత్ కలిసి భారత్ ను ఆదుకున్నారు. పంత్ 91 పరుగులకు ఔట్ అయ్యాడు. ప్రస్తుతం అశ్విన్ తో కలిసి సుందర్ మరో వికెట్ పడకుండా వికెట్ కాపాడుకున్నాడు.