https://oktelugu.com/

కొవిషీల్డ్ జాప్యం.. మనకు చేటేనా?

కొవిషీల్డ్ టీకా డోసుల మధ్య తేడా ప్రస్తుతం చర్చనీయాంశం అయింది. ప్రభుత్వమే కావాలని వ్యవధి పెంచిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మొదటి డోసుకు రెండో డోసుకు మధ్య ఎంత ఎక్కువ గ్యాప్ ఉంటే అంత బాగా పని చేస్తుందని కేంద్ర ప్రభుత్వం సరికొత్త వాదన తెరపైకి తేవడంతో దుమారం రేగుతోంది. వ్యాక్సిన్ల ఉత్పత్తిలో ఆలస్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వం డోసుల మధ్య దూరం పెంచిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డోసుల మధ్య వ్యత్యాసంపై ఇప్పటికే పలు వాదనలు వినిపిస్తున్నాయి. కొవిషీల్డ్ […]

Written By:
  • Srinivas
  • , Updated On : June 17, 2021 / 11:23 AM IST
    Follow us on

    కొవిషీల్డ్ టీకా డోసుల మధ్య తేడా ప్రస్తుతం చర్చనీయాంశం అయింది. ప్రభుత్వమే కావాలని వ్యవధి పెంచిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మొదటి డోసుకు రెండో డోసుకు మధ్య ఎంత ఎక్కువ గ్యాప్ ఉంటే అంత బాగా పని చేస్తుందని కేంద్ర ప్రభుత్వం సరికొత్త వాదన తెరపైకి తేవడంతో దుమారం రేగుతోంది. వ్యాక్సిన్ల ఉత్పత్తిలో ఆలస్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వం డోసుల మధ్య దూరం పెంచిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డోసుల మధ్య వ్యత్యాసంపై ఇప్పటికే పలు వాదనలు వినిపిస్తున్నాయి.

    కొవిషీల్డ్ టీకాల మధ్య తేడా తాము సూచించలేదని ప్రభుత్వం నియమించిన శాస్ర్తీయ బృందంలోని ముగ్గురు నిపుణులు చెప్పడం సంచలనం సృష్టించింది. ఈ ముగ్గురు నిపుణులు ఎన్ టాగీ స్టాండింగ్ టెక్నికల్ సబ్ కమిటీ సభ్యులు డాక్టర్ ఎండీ గుప్తే, డాక్టర్ మాథ్యూ వర్గీస్, డాక్టర్ ములియర్. వీరిలో ములియర్ కొవిడ్-19 వర్కింగ్ గ్రూపు సభ్యుడు కావడం గమనార్హం.

    కొవిషీల్డ్ మొదటి డోసు, రెండో డోసుకు మధ్య తేడా మొదట్లో 4 నుంచి 6 వారాలుగా నిర్ణయించారు. తరువాత తేడా మూడింతలు పెరగడంతో అందరు ఆశ్చర్యపోయారు. డోసుల మధ్య వ్యత్యాసం12 నుంచి 16 వారాలకు పెంచుతూ మే 13న కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బ్రిటన్ అధ్యయనాల ప్రకారం ఎన్ టాగీ బృందం చేసిన సూచనల మేరకు డోసుల మధ్య వ్యత్యాసం పెంచుతూ నిర్ణయం తీసుకున్నామని కేంద్రం తెలిపింది.

    ఈ నేపథ్యంలో ఎన్ టాగీలోని కొవిడ్-19 వర్కింగ్ గ్రూప్ అధిపతి ఎన్ కే అరోడా స్పందిస్తూ మే 10 నుంచి 13 నడుమ జరిగిన ఎన్ టాగీ సమావేశాల్లో కొవిషీల్డ్ డోసుల మధ్య తేడా పెంపు నిర్ణయంపై గప్తే, వర్గీస్, ములియల్ అభ్యంతరం వ్యక్తం చేయలేదు. దీంతో శాస్ర్తీయ ఆధారాలు, ఏకాభిప్రాయంతోనే డోసుల మధ్య వ్యత్యాసం పెంచుతూ నిర్ణయం తీసుకున్నామని కేంద్రం తెలిపింది.