https://oktelugu.com/

Udhayanidhi Stalin Remarks : ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యల్ని ఖండించిలేని స్థితిలో కాంగ్రెస్

ఇక ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలను డీఎంకేతో కలిసి పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ ఖండించలేని నిస్సహాయ స్థితిలో ఉంది. చూస్తుంటే ఇండియా కూటమి, కాంగ్రెస్ స్వీయ వినాశన దిశగా సాగుతోందని అనిపిస్తోంది. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు. 

Written By:
  • NARESH
  • , Updated On : September 5, 2023 / 05:05 PM IST

    Udhayanidhi Stalin Remarks  : తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మానికి వ్యతిరేకంగా చేసిన కామెంట్స్ దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. హిందూవాదులు ఆయనను తీవ్రంగా తప్పుబడుతున్నారు. కొందరైతే ఉదయనిధి స్టాలిన్ తల నరికి తెచ్చిన వ్యక్తికి బహుమతి అంటూ రాడికల్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వివాదంపై హీరో రామ్ చరణ్ స్పందించారు. ఆయన పరోక్షంగా ఉదయనిధి స్టాలిన్ కామెంట్స్ ఖండించారు. సనాతన ధర్మానికి మద్దతుగా నిలిచాడు.

    తమిళనాడు ప్రోగ్రెసివ్ రైటర్స్ అండ్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ శనివారం ‘సనాతన ధర్మం నిర్మూలన’ అనే అంశం మీద కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన ఉదయనిధి స్టాలిన్… సనాతన ధర్మం సమానత్వం, సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా ఉంది. సనాతన ధర్మం దోమ వంటిది. మలేరియా, డెంగ్యూ వంటి ప్రమాదకర వ్యాధులను వ్యాప్తి చేస్తుంది. దోమలను ఎలా అంతం చేస్తామో… సనాతన ధర్మాన్ని కూడా అంతం చేయాలని అన్నారు.

    ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు అతిపెద్ద చర్చకు దారి తీశాయి. అయితే ప్రకాష్ రాజ్ వంటి నటులు ఆయనకు మద్దతు తెలిపారు. సనాతన ధర్మం ఆమోద యోగ్యం కాదు. దాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల్లో మత విద్వేషాలు లేపడానికి వాడుతున్నారని అంటున్నారు. మొత్తంగా ఉదయనిధి స్టాలిన్ కామెంట్స్ తో ఆయన్ని హిందూ వ్యతిరేకిగా చిత్రీకరిస్తున్నారు. ఇక ఈ వివాదం ఎక్కడ ఆగుతుందో చూడాలి.

    ఇక ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలను డీఎంకేతో కలిసి పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ ఖండించలేని నిస్సహాయ స్థితిలో ఉంది. చూస్తుంటే ఇండియా కూటమి, కాంగ్రెస్ స్వీయ వినాశన దిశగా సాగుతోందని అనిపిస్తోంది. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.