Nirmalamma: అమ్మగా అలనా పాలనా చూసేవారు.. అత్తగా ఆదరించేవారు.. బామ్మగా బంధాలను కలిపేవారు నిజజీవితంలో చాలా మందికి కరువవుతారు. కానీ ఈ పాత్రల్లో నటించి అమ్మ, అత్త, బామ్మలు ఎలా ఉంటారో చూపించి.. అందరికీ అమ్మగా మారి పేరు తెచ్చుకున్న నటి నిర్మలమ్మ. అలనాటి హీరోయిన్ సావిత్రి తరువాత రియల్ నటిగా పేరు తెచ్చుకున్నారు నిర్మలమ్మ అని కొందరు కొనియాడుతారు. దాదాపు రెండు తరాల ప్రేక్షకులను అలరించి, అందరికీ దగ్గరైన నిర్మలమ్మ సినిమాల్లో ఎంతో చక్కగా నటించింది. సినిమాల్లోనే కాకుండా రియల్ జీవితంలో ఎంతో మనసున్న మా తల్లి అని పేరు తెచ్చుకున్నారు. ఎందుకంటే తన ఇంటికి ఆకలితో ఎవరూ వచ్చినా కాదనకుండా కడుపు నింపేది. అలాంటి ‘అన్నపూర్ణ’ చివరి రోజుల్లో ఎన్నో కష్టాలను ఎదుర్కొంది… వ్యథలను భరించింది… అందరు ఉన్నా అనాథగా మరణించింది. ఇంతకీ ఏం జరిగిందంటే?
నిర్మలమ్మ గారు 1920 జూలై 18న మచీలీపట్నంలో జన్మించారు. 1943లో గరుడ గర్బభంగం అనే సినిమాలో తొలిసారిగా నటించారు. ఆ తరువాత పాదుకా పట్టాభిషేకం, కృష్ణ ప్రేమ, కులగోత్రాలో వంటి మొదటితరం హీరో అయినా ఎన్టీఆర్ సినిమాల్లో ఎక్కువగా కనిపించారు. ఆ తరువాత రాజేంద్రప్రసాద్, చిరంజీవి, నందమూరి బాలకృష్ణ సినిమాల్లో నటించారు. ఇక ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్షన్లో వచ్చిన ప్రతీ సినిమా నిర్మలమ్మ కనిపించే ప్రయత్నం చేశారు. చివరగా ఆయన డైరెక్షన్లో వచ్చిన ‘ప్రేమకు స్వాగతం’లో నిర్మలమ్మ కనిపించి .. మళ్లీ వెండితెర వైపు చూడలేదు.
నిర్మలమ్మ పర్సనల్ లైఫ్ కొంచెం విషాదాంతమే. ఆమె ఎవరినీ పెళ్లి చేసుకున్నట్లు ఆధారాలు లేవు. అయితే కవిత అనే కుమార్తెను దత్తత తీసుకొని పెంచేవారు. ఆ తరువాత మరికొందరికి సాయం చేస్తూ వారి ఎదుగుదలకు సహకరించారు. సినిమాల నుంచి బయటకు వస్తున్న రోజుల్లో నిర్మలమ్మ డయాబెటిస్ తో బాధపడేవారు. కానీ ఈ విషయాన్ని తాను ఆలనా పాలనా చూసేవారు పట్టించుకోలేదు. నిర్మలమ్మ సాయంతో పెరిగి పెద్దయి జీవితంలో ఎదిగినా ఆమెను ఎవరూ బాగోగులు చూసుకోలేదు.
ఆత్మాభిమానంతో నిర్మలమ్మ తన ఆరోగ్య విషయాలను ఎవరికీ చెప్పలేదు. దీంతో సినీ ఇండస్ట్రీకి చెందిన వారు సైతం నిర్మలమ్మ గురించి పెద్దగా ఆలోచించలేదు. అంతేకాకుండా తన చివరి రోజుల్లో ఎంతో మదన పడుతూ ఉండేవారు. తనను ఎవరూ పట్టించుకోలేదనే బాధపడుతూ చివరికి 2009 ఫిబ్రవరి 19న కన్నమూశారు. నిర్మలమ్మ సాధారణంగానే మరణించారు అని అనుకున్నారు. కానీ ఆమెను ఆదరించేవారు లేక బాధపడుతూ మరణించినట్లు కొందరు ఆ తరువాత బయటపెట్టారు. ఎందరినో ఆదరించిన ఆమెను ఎవరూ పట్టించుకోకుండా మరణించడంపై ఆమె అభిమానులు ఎమోషనల్ అవుతున్నారు.