Congress : దేశమంతటా (దక్షిణాది తప్ప) కాంగ్రెస్ పరిస్థితి దయనీయం

దేశమంతటా (దక్షిణాది తప్ప) కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా ఉందని.. పార్లమెంట్ ఎన్నికలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు..

Written By: NARESH, Updated On : March 8, 2024 5:49 pm

Congress : ఒకనాడు కాంగ్రెస్ విముక్త భారత్ అని చెప్పి మోడీ మాట్లాడినప్పుడు ఇది ఏదో పొలిటికల్ స్లోగన్.. జరగదని అనుకున్నాం.. ప్రతిపక్షం కూడా గట్టిగా ఉండాలని కోరుకున్నాం.. కానీ పరిస్థితి చూస్తుంటే అదే నిజమయ్యేలా కనిపిస్తోంది.

ఉత్తర భారతంలో చూసుకుంటే.. మొత్తం 180 సీట్లు ఉంటే.. పోయిన సారి కాంగ్రెస్ కు 10 సీట్లు మాత్రమే వచ్చాయి. ఉత్తరప్రదేశ్ లో ఒకటి.. మధ్యప్రదేశ్ లో ఒకటి.. పంజాబ్ లో 8, మిగతా ఎక్కడా రాలేదు..

ఈసారి కూడా భిన్నంగా ఏమీ కనిపించడం లేదు. యూపీలోని కాంగ్రెస్ కోట రాయబరేలిలో కూడా గెలిచేలా కాంగ్రెస్ కనిపించడం లేదు. హర్యానాలో ఒకటి లేదా రెండు.. వచ్చే ఛాన్స్ ఉంది.. ఉత్తర భారతంలో 180కి ఆరు వరకూ రావచ్చు..

తూర్పు భారతంలో కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా ఉంది. మొత్తం 129 లో పోయిన సారి 8 సీట్లు వచ్చాయి.. ప్రస్తుతం 2 వచ్చే అవకాశం కనిపిస్తోంది.

దేశమంతటా (దక్షిణాది తప్ప) కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా ఉందని.. పార్లమెంట్ ఎన్నికలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు..