Chiranjeevi-Pawan Kalyan: సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ మెగాస్టార్ చిరంజీవి దంపతులను ఇండస్ట్రీలో పెద్దలుగా గౌరవిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఉన్న స్ట్రైచర్ అలాంటిది. ఇక ఇది ఇలా ఉంటే చిరంజీవి భార్య అయిన సురేఖ ఉమెన్స్ డే సందర్భంగా ఒక పత్రిక తో మాట్లాడుతూ చిరంజీవి పవన్ కళ్యాణ్ లా ఆహారపు అలవాట్ల గురించి చెప్పింది.
ఏంటి అంటే చిరంజీవి తినే విషయంలో అసలు ఏమి పట్టించుకోడని, పచ్చడ ఉన్న కూడా దాంతో తినేస్తాడని ఆయనకు స్పెషల్ గా ఇదే కావాలి అని ఏది లేదు. తినే టైంలో ఏది ఉంటే దాంతో తినేస్తూ సర్ది పెట్టుకుంటాడు అని చెప్పింది. అలాగే పవన్ కళ్యాణ్ కూడా వాళ్ల అన్నయ్య లాగే ఏది ఉంటే దాంతో తినేస్తాడు అంతే తప్ప ఇది ఉంటేనే తింటాను అది లేకపోతే తినను అని కండిషన్స్ ఏం పెట్టడు. కానీ మా మామయ్య గారు మాత్రం మంచి బోజన్ ప్రియలు. అన్ని ప్లేట్ లో పెట్టుకొని అన్నింటిని టేస్ట్ చేస్తూ సంపూర్ణ భోజనం చేసేవారు. ఇక పెళ్లైన కొత్తలో నాకు వంట చేయడం వచ్చేది కాదు.
మా అత్తమ్మ చాలా బాగా వండి పెట్టేది. కానీ చిరంజీవి గారికి మాత్రం నేను వంట చేస్తే తినాలని కోరికగా ఉండేది. కానీ వంట చేయడం రాదు దాంతో ఒకరోజు తెగించి ఉప్మా చేశాను అది చాలా గట్టిగా వచ్చింది. దాంతో కొద్దిరోజుల దాకా మరోసారి వంట చేయడం ఆపేసాను. ఇక దాంతో మా ఆయన నేను నిరుత్సాహ పడకూడదని తనే నాకు దగ్గరుండి మరి వంట నేర్పించారు. ఆయన చాలా బాగా వంట చేస్తారు. నా గురువు కూడా చిరంజీవి గారే కావడం విశేషం అంటూ ఆమె నవ్వుకున్నారు.
ఇక అప్పుడు నేర్చుకున్న వంటలతో ఇప్పుడు పర్ఫెక్ట్ గా వంట చేయగలుగుతున్న అప్పుడు ఉప్మా అంటే నాకు చేయడం రాదు కానీ ఇప్పుడు నేను చేసే ఉప్మా అడిగి చేయించుకొని తింటారు అంటూ ఆమె వాళ్ళ ఫ్యామిలీ గురించి చిరంజీవి పవన్ కళ్యాణ్ లా ఆహారపు అలవాట్ల గురించి తెలియజేసింది…