KCR : తెలంగాణ ఆర్థిక పరిస్థితి పైన మెరుపులు.. లోన పురుగులు అన్నట్టుగ ఉంది. రాష్ట్ర అసెంబ్లీలో డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క విడుదల చేసిన శ్వేతపత్రంతో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ చేసిన అప్పుల మాయ బయటపడింది. రాష్ట్ర మొత్తం అప్పులను రూ.6,71,757 కోట్లుగా పేర్కొన్నారు. ఇది చూస్తుంటే కేసీఆర్ ఆర్థిక ఆరాచకత్వాన్నే తెలియజేస్తోంది. 2014లో రెవెన్యూ మిగులు ఉన్న రాష్ట్రాన్ని ఎలా రెవెన్యూ లోటులోకి తీసుకెళ్లారో అర్థమవుతోంది.
Also Read : శ్వేత పత్రం.. ఎవరిది తప్పు? ఎవరిది ఒప్పు?
తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్‌రెడ్డి తొలిరోజే దూకుడు పెంచారు. కేబినెట్ భేటీ నిర్వహించి కీలక అంశాలపై చర్చించారు.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితితోపాటుగా ప్రధానంగా విద్యుత్ అంశంపై ఫోకస్ పెట్టారు.
రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థ పనితీరు చర్చ జరిగింది.. విద్యుత్ రంగంలో ఏం జరిగిందో తెలుపుతూ సమగ్రంగా శ్వేతపత్రం విడుదల చేయాలని మంత్రివర్గం అభిప్రాయపడింది. ఆ శాఖలో వాస్తవాలను వెల్లడించకుండా చాలాకాలంగా దాచిపెట్టడాన్ని తప్పుపడుతూ.. ఆ శాఖ ఉన్నతాధికారిపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. శుక్రవారం ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ రివ్యూకు ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకరరావును కూడా రప్పించాలన్నారు. ఆయన రాజీనామాను కూడా ఆమోదించొద్దని సీఎం ఆదేశించారు.
Also Read : రైతు బంధు రూ.7,700 కోట్లు ఏమయ్యాయి?
కేసీఆర్ ఆర్థిక అరాచకత్వాన్ని బయటపెట్టిన శ్వేతపత్రం .. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
