India vs China చైనా ఇన్నాళ్లు ఏదైతే అనుమానిస్తున్నామో అదే జరిగింది. తన విస్తరణ వాదంలో భాగంగా మీడియాను, ప్రజలను ఆలోచనను కూడా మార్చేస్తోంది. ఒక పద్ధతి ప్రకారం చేస్తోంది. మీడియా సంస్థలను , వార్త సంస్థలను చైనా కంట్రోల్ చేస్తోంది. వాటికి ఆర్థిక సాయం చేస్తోంది. చైనా అనుకూల వార్తలు రాయిస్తోంది. చైనాను వ్యతిరేకించే దేశాలను అణగదొక్కే రాజకీయం చేస్తోంది. ఇదే ఇప్పుడు అమలు చేస్తోంది.
ఇందుకోసం అన్ని దేశాల్లోని బడా మీడియా సంస్థలను, జర్నలిస్టులకు డబ్బులు గుప్పిస్తూ తనకు అనుకూలంగా రాయిస్తోంది. యూరప్ లో చైనా పోలీస్ స్టేషన్ లు బయటపడడం సంచలనంగా మారింది. అమెరికా, జపాన్ లోనూ చైనా దురాగతాలు బయటపడుతున్నాయి. 21వ శతాబ్ధంలో నయా సామ్రాజ్యవాద దేశంగా .. పెత్తందారి దేశంగా చైనా ముద్రపడిపోయింది.