India Vs West Indies T20 Series: విండీస్ గడ్డపైన ఎప్పుడూ ఎరుగని రీతిలో వరుసపరాజయాలతో చతికిలబడిన టీమిండియా రాబోయే మరో ఆసక్తికరమైన పోరుకు సిద్ధం కాబోతోంది. మంగళవారం గయానా వేదికగా జరగబోతున్న ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్ అమీ తుమీ తేల్చుకోవడానికి రెడీగా ఉంది. ఇప్పటికే తీసుకున్న కొన్ని నిర్ణయాల కారణంగా గెలవాల్సిన మ్యాచ్ చేయి జారిపోయింది…వరసగా రెండు పరాజయాలు ఎదుర్కొన్న ఇండియన్ టీం ఇప్పుడు కచ్చితంగా గెలవాల్సింది లేకపోతే ఈ సిరీస్ విండీస్ ఖాతాలోకి వెళ్ళిపోతుంది.
గెలవడం తప్ప వేరే ఆప్షన్ లేకపోవడంతో బరిలోకి దిగనున్న టీమిండియా మంచి పట్టుదలతో కనిపిస్తోంది. మరోపక్క హ్యాట్రిక్ సాధించి సిరీస్ ని కైవసం చేసుకోవాలని వెండిస్ కూడా తెగ తాపత్రయ పడుతోంది. దీని ద్వారా వన్డే మరియు టెస్ట్ సిరీస్ ఓటములకు ప్రతీకారం తీర్చుకోవాలి అనేది విండీస్ ఎత్తు. మరి టీమిండియా విజయం సాధించాలి అంటే బ్యాటింగ్ బలంగా ఉండాలి కదా…
గత రెండు మ్యాచ్ల గణాంకాలను పరిశీలిస్తే బ్యాటర్లు చేతులెత్తేసిన కారణంగానే ఇండియా తక్కువ స్కోర్ కి పరిమితమైంది. అందుకే జరగబోయే మూడవ మ్యాచ్లో పేలవమైన రికార్డు ఉన్న ఇషాన్ కిషన్ పై వేటు పడనుంది. ఆల్రెడీ సంజూ శాంసన్ వికెట్ కీపర్ గా అవైలబిలిటీలో ఉన్నాడు కాబట్టి ఇక బ్యాటింగ్ సరిగ్గా చేయని ఇషాన్ తప్పించి ఆ స్థానంలో యశస్వి జైస్వాల్ ను దించే అవకాశం కనిపిస్తోంది. అలాగే గాయం కారణంగా రెండవ టీ20 మ్యాచ్ కి దూరమైన కులదీప్ యాదవ్ మళ్లీ ఎంట్రీ ఇస్తున్నాడు.
వెస్టిండీస్ జట్టులో పెద్దగా మార్పులు జరిగే అవకాశం అయితే కనిపించడం లేదు. వాళ్ల టీం మొదటి నుంచి మెరుగు గానే పర్ఫార్మ్ చేస్తోంది అన్న భావన ఉంది కాబట్టి ఎవరిని రీప్లేస్ చెయ్యకపోవచ్చు. కానీ రెండవ టీ20 మ్యాచ్ లో బ్యాటింగ్ సమయంలో తీవ్రమైన గాయానికి గురి అయిన జాసన్ హోల్డర్ ఈసారి బరిలోకి దిగడం పై సందేహాలు ఉన్నాయి. ఫిట్గా ఉంటే బరిలోకి దిగుతాడు లేకపోతే అతని ప్లేస్ లో మరొక ప్లేయర్ ఎంట్రీ ఇస్తాడు.
రెండవ టీ20 లో ఎటువంటి పిచ్ అయితే ఉపయోగించారు ఈ మ్యాచ్ లో కూడా అదే పిచ్ ను ఉపయోగించనున్నారు. ఎప్పటిలాగే ఈ పిచ్ స్పిన్ బౌలర్స్‌కే కాకుండా స్లో బౌలర్స్‌కి కూడా ఎంతో అనుకూలంగా ఉంటుంది. కానీ వాతావరణం కాస్త సహకరించేలా కనిపించడం లేదు.. మధ్యాహ్న సమయంలో వర్షం పడే సూచన ఉందని వాతావరణ శాఖ పేర్కొనడంతో… ఈ వర్షం మ్యాచ్‌కు అంతరాయం కలిగించే అవకాశం ఉంది. మరి ఈ వర్షం భారత్‌కు అనుకూలిస్తుందా లేదా అనేది ప్రశ్నార్థకమే.
మొన్న జరిగిన రెండవ టీ20 మ్యాచ్ లో కెప్టెన్ హార్దిక్ పాండే తీసుకున్నటువంటి కొన్ని రాంగ్ నిర్ణయాల వల్ల గెలవవలసిన మ్యాచ్ చేయి జారిపోయింది. మరోపక్క తమ బ్యాట్ కి పదును పెట్టి బాల్ బౌండరీ దాటించవలసిన ప్లేయర్స్ పెవిలియన్ వైపు పరుగులు పెట్టారు.. ఈసారి జరగనున్న మూడవ టీ20 మ్యాచ్ ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ నేపథ్యంలో భారత్ జట్టు కోట్లాదిమంది అభిమానుల ఆశలను నిరాశ పరచడమే ఆశిస్తున్నాము.