
Chaina Phones: మారుమూల గ్రామాల్లోని ప్రజలు మొబైల్ ఫోన్లు వాడుతున్నారంటే అందుకు చైనా ఫోన్లే ప్రధాన కారణం. అతి తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్లను అందించిన చైనా ఆ తరువాత ఈ ఫోన్లను ప్రపంచ వ్యాప్తంగా సరఫరా చేసింది. తక్కువ ధరకే ఇవి రావడంతో చాలా మంది కొనుగోలు చేశారు. అంతేకాకుండా గ్రామాల్లోని ప్రజలు నెట్ వాడకం చైనా ఫోన్ నుంచే నేర్చుకున్నారు. అయితే చైనా ఫోన్లో ఆ మధ్య విపరీతమైన సమస్యలు వచ్చాయి. ఆటోమెటిక్ గా పేలడం, ఎక్కువ రోజులు పనిచేయకపోవడంతో వాటిపై చాలా మంది దృష్టి సారించడం లేదు. కానీ తాజాగా ఓ దేశం చైనా ఫోన్లను వాడవద్దని ఆదేశించింది. ఇప్పటి వరకు తమ దగ్గర చైనా ఫోన్ ఉంటే వెంటనే వాటిని పగలగొట్టండంటూ చెబుతోంది. చైనా ఫోన్లను వాడొద్దనడానికి కారణం ఏంటి? ఎందుకు వాటిని పగలగొట్టాలని చెబుతోంది..?
లిథువేనియా అనే దేశం ఇటీవల తమ ప్రజలకు ఓ హెచ్చరిక జారీ చేసింది. చైనా తయారు చేసే ఏ ఫోన్లను కొనవద్దని తెలిసింది. ఇదివరకు తమ దగ్గర చైనా ఫోన్లు ఉంటే వాటిని పడేయాలని తెలిపింది. దేశ భద్రతకు, యూజర్ డేటాకు చైనా ఫోన్లలో రక్షణ లేదని పేర్కొంటోంది. షియోమీ అనే చైనా ఫోన్లో కొన్ని ప్రత్యేక టూల్స్ ఉన్నాయని, వీటి ద్వారా సైబర్ దాడులకు గురయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు లిథువేనియా రక్షణ శాఖ మంత్రి మార్గిరిస్ ఆదేశాలు జారీ చేశారు. ఇది లిథువేనియాకు మాత్రమే కాకుండా షియోమీ పరికరాలు ఉపయోగించే అన్ని దేశాలకు కీలకం అని ఆదేశ నేషనల్ సైబర్ సెక్యూరిటీ తెలిపింది.
తక్కువ ధరకు ఖరీదైన ఫీచర్లను జోడించి ఫోన్లను విక్రయిస్తూ షియోమీ కంపెనీ అతికొద్ది కాలంలోనే పాపులర్ అయింది. కేవలం ఆరునెలల్లలో ఈ కంపెనీ ఆదాయం 64 శాతం పెరిగింది. షియోమి ఫ్లాగ్ షిప్ ఎంఐ 10 టీ అనే 5జీ ఫోన్లో ‘ఫ్రీ టిబెట్’, ‘లాంగ్ లివ్ తైవాన్ ఇండిపెండెన్స్’ వంటి పదాలను గుర్తించారు. ఇది డిఫాల్డ్ ఇంటర్నెట్ బ్రౌజర్ తో సహా షియోమి ఫోన్ సిస్టమ్ యాప్ లు, సెన్సార్ చేయగల 449 కంటే ఎక్కువ పదాలను హైలెట్ చేసింది. ఈ సెన్సార్ షిఫ్ చేయగల యాప్ లను పనిచేయకుండా చేశారని, కానీ ఎప్పుడైనా రిమోట్ గా వాటిని యాక్టివ్ చేయొచ్చని రిపోర్టులో పేర్కొంది.
మరో చైనా కంపెనీ హువావే ఫోన్లు కూడా వాడొద్దని లిథువేనియా హెచ్చరించింది. ఇందులో వినియోగదారుల సైబర్ డేటా -సెక్యూరిటీని ఉల్లంఘిస్తుందని తెలిపింది. ఈ ఫోన్లోని అప్లికేషన్ వినియోగదారులను థర్డ్ పార్టీ ఈ-స్టోర్ లకు వెళ్లేలా చేస్తోంది. ఇక్కడ కొన్ని అప్లికేషన్లు యాంటి వైరస్ ప్రొగ్రామ్ ల ద్వారా ఫోన్లోకి వైరస్ ఎంట్రి ఇచ్చినట్లు గుర్తించామని లిథువేనియర్ రక్షణ శాఖ తెలిపింది.
లిథువేనియా దేశ ఆరోపణలపై ఈ చైనా ఫోన్ల కంపెనీ ప్రతినిధులు స్పందించారు. తమ ప్రొడక్ట్ అమ్ముతున్న దేశాల చట్టాలకు, నిబంధనలకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. హువావే ఫోన్ల నుంచి కస్టమర్ల డేటా బయటకు వెళ్లే ప్రసక్తే లేదని అంటున్నారు. యాప్ గ్యాలరీ తన కస్టమర్లకు ఇతర యాప్ స్టోరీల మాదిరిగానే అనుమతించడానికి డేటా సేకరిస్తుందని అంటున్నారు.
మరోవైపు లిథువేనియా, చైనాల మధ్య జరిగిన వివాదం కారణంగా చైనా ఫోన్లపై ప్రభావం చూపుతుందని అంటున్నారు. ఇదివరకు లిథువేనియాలోని తమ రాయబారిని వెనక్కి రావాలని చైనా ఆదేశించింది. తమ రాయబారిని ఆ దేశం నుంచి ఉపసంహరించకున్నట్లు ప్రకటించింది. దీంతో లిథువేనియా సైతం చైనా ఫోన్లను దేశంలో డేంజర్ అని వాడొద్దని ఆదేశాలిచ్చింది. ఈ క్రమంలోనే లిథువేనియాలోని తన కార్యకలాపాలను తైవానీస్ ప్రతినిధి కార్యాలయం నుంచి చేస్తామని చైనా దేశం ప్రకటించడంతో మరో వివాదం ప్రారంభమైంది. మొత్తంగా చైనా ఫోన్ల గుట్టు రట్టు చేసిన లిథువేనియాపై ఇప్పుడు చైనా కారాలు మిరియాలు నూరుతోంది. ఈ వివాదం ఎటువైపు దారితీస్తుందో చూడాలి మరీ.