Kerala CM Vijayan daughter : నిన్న కవిత.. నేడు వీణ.. ఎవరు వీళ్లిద్దరూ.. ఒకరు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె అయితే.. రెండో వ్యక్తి వీణ.. ఇప్పటి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె. కవిత, వీణ ఇద్దరూ ముఖ్యమంత్రుల కూతుళ్లు.. ఇద్దరూ అవినీతి కుంభకోణాల్లో చిక్కుకున్నారు. కవితది వందలాది కోట్ల రూపాయల కుంభకోణం.. కేరళలో తక్కువైనా ూసరే అవినీతి కుంభకోణం. కోటి 70 లక్షల కుంభకోణం అని అంటున్నారు.
ఇద్దరికీ ఉన్న సామీప్యత ఏంటంటే.. ఒకనాడు సన్ స్ట్రోక్ లు ఉండేవి. ఇప్పుడు కూతుళ్ల స్ట్రోక్ లు నేతలకు తగులుతున్నాయి.. వీణ ఎవరని వివరాల్లోకి వెళితే.. వీణ పినరయి విజయన్ కుమార్తె. ఈమె వ్యాపారం మొదలుపెట్టింది. ఎక్స్ లాజిక్ సర్వీసెస్ అని సాఫ్ట్ వేర్ కన్సల్టెంట్ సేవలు అందిస్తుంది. కొచ్చిన్ లో పక్కన ఫ్యాక్టరీ పెటింది. ఈ కంపెనీ సీఎం కుమార్తెకు డబ్బులు పంపిణీ చేస్తోంది. ఆమె ఏ సేవలు అందించకుండానే వీణ కంపెనీకి నిధులు వస్తున్నాయి. ఇన్ కంట్యాక్స్ దీన్ని కనిపెట్టింది. 2015-18 వరకూ వీణ కంపెనీకి, ఆమె వ్యక్తిగత అకౌంట్లలో కూడా కోటి 70 లక్షలు జమ చేశారు. వీణకు 55 లక్షలు జమ చేశారు.
ఐటీ ఈ మేరకు వీణకు , ఈమెకు డబ్బులు జత చేసిన కంపెనీ నోటీసులు ఇస్తే అసలు సమాధానం లేదు.
నిన్న కవిత, నేడు వీణ: అవినీతి కుంభకోణంలో ముఖ్యమంత్రి కూతుళ్ళ వ్యవహారంపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.