అంతర్జాతీయంGold Reserves : సౌదీ, యూకేను మించి బంగారం నిల్వల్లో భారత్ ముందుకు? ఎందుకంత రిజర్వ్...

Gold Reserves : సౌదీ, యూకేను మించి బంగారం నిల్వల్లో భారత్ ముందుకు? ఎందుకంత రిజర్వ్ చేశారు?

Gold Reserves : సాధారణంగా బంగారం అనే పేరు ప్రస్తావనకు వస్తే ముందుగా మన మదిలో సౌదీ అరేబియా మిగులుతుంది. ఆ తర్వాత యునైటెడ్ కింగ్డమ్ జ్ఞప్తికి వస్తుంది. ఇక నుంచి బంగారం అంటే భారత్ అనే పేరు ప్రస్తావనకు వస్తుంది. ఎందుకంటే యూకే, సౌదీని మించి మన వద్ద పసిడి నిలువలు అధికంగా ఉన్నాయి. ఫలితంగా అధిక మొత్తంలో బంగారు నిల్వలు కలిగిన తొలి దేశాలలో భారత్ చోటు దక్కించుకుంది. ప్రపంచ పసిడి సమాఖ్య వెల్లడించిన తాజా నివేదిక ప్రకారం.. బంగారం నిల్వలు అధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ 9వ స్థానంలో నిలిచింది. భారత్ వద్ద 3,59,208 కోట్ల (48,157 మిలియన్ డాలర్లు) విలువైన 800.78 టన్నుల బంగారం ఉంది. ఈ ఘనతతో ధనిక దేశాలైన సౌదీ అరేబియా, యూనైటెడ్ కింగ్డమ్ వంటి దేశాలను భారత్  వెనక్కి నెట్టింది. ఈ జాబితాలో అమెరికా మొదటి స్థానంలో నిలిచింది. అగ్రరాజ్యం అమెరికా వద్ద ప్రస్తుతం 4,89, 133 మిలియన్ డాలర్ల విలువైన 3,352 టన్నుల బంగారం నిల్వ ఉన్నట్టు తెలుస్తోంది. తర్వాతి స్థానాల్లో జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, రష్యా దేశాలు ఉన్నాయి..   యుద్ధం ప్రారంభమైన తర్వాత రష్యా తమ దేశాలలో దాచుకున్న బంగారం నిలువలను పశ్చిమ దేశాలు హోల్డ్ లో పెట్టాయి. వాటిని విడుదల చేయించుకునేందుకు రష్యా అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తోంది.. అయితే అందులో కొంత మేర బంగారాన్ని వివిధ మార్గాల ద్వారా రష్యా విక్రయించి.. వర్తమాన దేశాలకు ఆర్థిక సహాయం చేసినట్టు తెలుస్తోంది. ఇక మనకు పొరుగున ఉన్న చైనాలో 2,191.53 టన్నుల బంగారం నిల్వ ఉంది. అయితే ఈ దేశాలు ఎందుకు పసిడిని ఆ స్థాయిలో నిలువ చేస్తున్నాయి అనే అనుమానం ప్రతి ఒక్కరిలో కలుగుతుంది.

అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాలు.. దేశ కరెన్సీలో భారీ మార్పులు రాకుండా ఉండేందుకు.. మార్కెట్లో సుస్థిరంగా ఉండేందుకు బంగారాన్ని నిలువ చేస్తాయి. అంతే కాదు తాము పెడుతున్న పెట్టుబడుల్లో వైవిధ్యం ఉండే విధంగా చూసుకునేలా బంగారాన్ని కొనుగోలు చేసి ప్రభుత్వాలు నిల్వచేస్తాయి. ఇక ప్రపంచాన్ని నడిపించే అమెరికన్ డాలర్ విలువకు బంగారానికి అమితమైన సంబంధం ఉంటుంది. అయితే ఈ రెండింటి మధ్య విలువ విలోమానుపాతంలో ఉంటుంది. అవి రెండు కూడా మార్కెట్ ను శాసిస్తాయి. సింపుల్గా చెప్పాలంటే అమెరికన్ డాలర్ విలువ తగ్గితే బంగారం విలువ పెరుగుతుంది. బంగారం విలువ తగ్గితే డాలర్ ధర పెరుగుతుంది. అందుకే ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు వివిధ దేశాల బ్యాంకులు తమ వద్ద నిల్వ ఉన్న బంగారాన్ని అత్యంత జాగ్రత్త బహిరంగ విపణి లోకి ప్రవేశపెట్టకుండా కాపాడుకుంటాయి. అనుకోని పరిస్థితులు, ఏవైనా యుద్ధాలు జరిగినప్పుడు అయా దేశాలు బంగారాన్ని వివిధ ప్రపంచ సంస్థల వద్ద తనఖా పెట్టి అప్పు తెచ్చుకుంటాయి. అలా అప్పు తీసుకొచ్చుకొని విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటాయి. మనదేశంలో ఒకప్పుడు ఆ నిశ్చిత పరిస్థితులు ఏర్పడినప్పుడు బంగారాన్ని విక్రయించి డబ్బులు తీసుకొచ్చుకున్నాం. ఆ తర్వాత పరిస్థితులు చక్కబడటంతో మళ్లీ మన బంగారాన్ని తెచ్చుకున్నాం. సాధారణంగా బంగారాన్ని పెట్టుబడిగా ప్రభుత్వాలు భావిస్తూ ఉంటాయి.

ఇక మన దేశంలో బంగారం వినియోగం అధికంగా ఉంటుంది. చమరు తర్వాత మన దేశం అత్యధికంగా దిగుమతి చేసుకునే వస్తువుల్లో బంగారం అతి ముఖ్యమైనది. మనదేశంలో ప్రస్తుతం వాడుకలో ఉన్న కరెన్సీ కి సమానంగా ప్రభుత్వం బంగారాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద భద్రపరుస్తుంది.. అందువల్లే ఆర్థికంగా ప్రపంచ దేశాలు ఇబ్బంది పడుతున్నప్పటికీ.. భారత్ కుదురుగా ఉంటుంది అంటే దానికి కారణం అదే. ప్రపంచంలో నాలుగవ ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న నేపథ్యంలో.. భవిష్యత్తు కాలాన్ని దృష్టిలో పెట్టుకొని మన దేశం బంగారాన్ని అత్యంత జాగ్రత్తగా నిల్వ చేసుకుంటోంది. ముఖ్యంగా ఆసియాలో చైనా తర్వాత అంతటి ప్రబల ఆర్థిక శక్తిగా భారత ఎదుగుతోంది. ప్రపంచ జనాభాలో మొదటి స్థానంలో ఉన్న నేపథ్యంలో భవిష్యత్తు కాలంలో ఏవైనా అనర్ధాలు జరిగితే భారత్ లాంటి దేశాన్ని ఆదుకోవడం ప్రపంచానికి తలకు మించిన భారం అవుతుంది. అలాంటి ఇబ్బందులు తలెత్తుకుండా ఉండేందుకు భారత్ ముందుగానే జాగ్రత్త పడుతోంది. పసిడి తయారవుతున్న సౌదీ అరేబియాను మించి.. అగ్రరాజ్యంగా వెలుగొందుతున్న ఇంగ్లాండ్ ను తలదన్ని బంగారాన్ని నిల్వ చేసుకుంటోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Shraddha Dhawan Dairy Business: మల్లారెడ్డి సార్ లెక్కనే పాలమ్ముతోంది.. పాతికేళ్ల ఈ అమ్మాయి ఏడాదికి ఎంత సంపాదిస్తుందో తెలుసా.

Shraddha Dhawan Dairy Business: మల్లారెడ్డి సార్.. గా పొద్దు పాలమ్మిన.. పూలమ్మిన.. కష్టపడ్డ.. సక్సెస్ అయిన.. అని అన్నడు కదా.. అట్లనే ఈ అమ్మాయి కూడా సక్సెస్ అయింది.. తనతోటి వాళ్ళు...

Stock Market Updates: ఒకటా, రెండా.. ఏకంగా 10 లక్షల కోట్లు?

Stock Market Updates: భారత స్టాక్ మార్కెట్లు గత రెండు రోజులుగా భారీ నష్టాలను చవిచూశాయి. ముఖ్యంగా భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై నెలకొన్న అనిశ్చితి దేశీయ మార్కెట్లను తీవ్ర ఒత్తిడికి...

Most Popular

Delhi Protests: అటు కాక్రోచ్ లు.. ఇటు రైతులు.. మోడీకి ఏంటీ తలనొప్పులు

Delhi Protests: ఢిల్లీ నగరం ఆందోళనలతో అట్టుడికి పోతుంది. గతంలో కేంద్రం వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చింది. అప్పుడు హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది రైతులు అందులో పాల్గొన్నారు. ఇదే అదునుగా ఖలీస్థానీ...

Indus Water Dispute: సింధూ జలాలు కావలట… పాపం ఇజ్జత్ పోగొట్టుకున్న పాకిస్తాన్

Indus Water Dispute: ఎన్ని రకాలుగా అంతర్జాతీయ వేదికల మీద పరువు పోగొట్టుకున్నప్పటికీ పాకిస్తాన్ తీరు మారదు. సిగ్గు లేదా జీడి గింజ అంటే.. నల్లగున్న నాకేం సిగ్గు అన్నట్టుగా పాకిస్తాన్ వ్యవహారం...

Skyroot Aerospace: స్కై రూట్ మాత్రమే కాదు.. ఇంకా చాలా ఉన్నాయి.. భవిష్యత్తు మొత్తం వీటిదే..

Skyroot Aerospace: స్కై రూట్ అంతరిక్ష పరిశోధన లో సరికొత్త చరిత్రను ఆవిష్కరించింది. తక్కువ, మధ్య స్థాయి బరువున్న ఉపగ్రహాలను ప్రత్యేకమైన రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపించి అద్భుతం సృష్టించింది. ప్రైవేట్ రంగంలో...

Maho Beach: విమానం టేకాఫ్.. భయంకరమైన గాలులు.. పర్యాటకులు ఎగిరిపడ్డారు.. వైరల్ వీడియో

Maho Beach: వాతావరణం ఆహ్లాదంగా ఉంది.. మబ్బులు కమ్ముకున్నాయి. సముద్రపు అలలు తీరాన్ని తాకుతున్నాయి. పర్యాటకులు ఆ వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. సముద్రపు ఒడ్డున సేద తీరుతున్నారు. నచ్చిన ఫుడ్ తింటు ఎంజాయ్ చేస్తున్నారు....

ISI Agents In India: అమాయక హిందువులే పాకిస్తాన్ ఐఎస్ఐ టార్గెట్.. ఎంతటి దుర్మార్గానికి పాల్పడిందంటే..

ISI Agents In India: సరిహద్దుల్లో మారణ హోమం సృష్టిస్తూ ఉంటుంది. మన సైనికులపై దాడులకు పాల్పడుతూ ఉంటుంది. ప్రశాంతమైన మనదేశంలో అల్లకల్లోలం సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. నకిలీ నగదు.....
Exit mobile version