YCP- Chiranjeevi and Pawan Kalyan: వైసీపీకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కలలో కూడా కనిపిస్తున్నారు. ఆయన దూకుడుకు కళ్లెం ఎలా వేయాలో తెలియక అటు సీఎం జగన్ నుంచి మంత్రుల వరకూ తలలు పట్టుకుంటున్నారు. అందుకే అదే పనిగా పవన్ ను టార్గెట్ చేయాలని అటు మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీ నాయకులకు పురమాయిస్తున్నారు. అటు వైసీపీ సోషల్ మీడియా వింగ్ సైతం అదే పనిలో ఉంది. అయినా పవన్ వెనక్కి తగ్గడం లేదు. ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలపై గట్టిగానే పోరాటంచేస్తున్నారు. దీంతో జనసేన గ్రాఫ్ గణనీయంగా పెరిగింది., అటు సర్వల్లో కూడా అదే స్పష్టమవుతోంది. ఇది అధికార పార్టీకి కలవరపాటుకు గురిచేస్తోంది. అందుకే దానికి విరుగుడు చర్యల కోసం ప్రయత్నిస్తోంది. అయితే ఆ ప్రయత్నంలో భాగంగానే చిరంజీవిని ఒక ఆప్షన్ గా ఎంచుకున్నట్టు తెలుస్తోంది. పవన్ దూకుడుకు చిరంజీవితో కళ్లెం వేయాలని భావిస్తున్నారు.

అయితే పవన్ విషయంలో వైసీపీ విమర్శల దాడి తగ్గడం లేదు. అదే సమయంలో సోషల్ మీడియా వేదికగా మెగా బ్రదర్ పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై, ఆ పార్టీ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతుంటారు. దీనికి కౌంటర్ గా మంత్రులు, వైసీపీ నాయకులు రంగంలోకి దిగుతుంటారు. తిట్టిన తిట్టు తిట్టకుండా పవన్ తో పాటు నాగబాబుపై విమర్శలు చేస్తుంటారు. ముఖ్యంగా అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, కన్నబాబు, రోజా లాంటి వారు విరుచుకుపడుతుంటారు. అయితే చిరంజీవిని వీరు పల్లెత్తు మాట అనరు. పైగా ఆయన ఎంతో హుందాతనం కలిగిన వ్యక్తిగాఅభివర్ణిస్తుంటారు. చిరంజీవికి చెడ్డపేరు తెస్తున్నారంటూ ఆ మెగా బ్రదర్ పై విమర్శలు గుప్పిస్తుంటారు. అయితే ఇదంతా వైసీపీ వ్యూహాత్మక డ్రామాగా విశ్లేషకులు భావిస్తుంటారు. ప్రస్తుతం మెగా కాంపౌండ్ వాల్ నుంచి చాలామంది హీరోలు ఉన్నారు.వారికి రాష్ట్ర వ్యాప్తంగా మంచి ఫాలోయింగే ఉంది. అయితే గత ఎన్నికల్లో చిరంజీవి అభిమానులు కొందరు స్థానికాంశాల దృష్ట్యా వైసీపీకి సపోర్టు చేశారు. ఈ సారి ప్రజా వ్యతిరేకత ఉన్న దృష్ట్యా చిరంజీవిని దూరం చేసుకుంటే వారంతా దూరమయ్యే అవకాశముందని భావించి చిరంజీవిని మచ్చిక చేసుకుంటున్నారు.
ఏపీ సీఎం జగన్ పొలిటికల్ స్ట్రాటజీలో భాగంగానే చిరంజీవికి పెద్దపీట వేస్తూ వస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సినీ పరిశ్రమ పెద్దగా సీఎం జగన్ చిరంజీవి కలిశారు. అటు తరువాత వ్యక్తిగతంగా కూడా కలిసిన సందర్భాలున్నాయి. అటు అల్లూరి విగ్రహావిష్కరణకు పిలిచారు. అన్ని సందర్బాల్లో గౌరవిస్తూ వచ్చారు. అదే సమయంలో చిరంజీవికి వైసీపీ తరుపున రాజ్యసభ సీటు ఇస్తారని లీకులిచ్చారు. అయితే ఇదంతా రాజకీయ లబ్ధి కోసమేనన్న విమర్శలున్నాయి. పవన్ నిలువరించేందుకు చిరంజీవిని మచ్చిక చేసుకోవడానికేనన్న ప్రచారమైతే ఉంది.

అయితే తాజాగా చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ చిత్ర ప్రమోషన్ లో భాగంగా తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానే తప్ప నా నుంచి రాజకీయం దూరం కాలేదని చెప్పే డైలాగును చిరంజీవే స్వయంగా సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఇది పొలిటికల్ సర్కిల్ లో బాగా చర్చనీయాంశమైంది., చిరంజీవి మళ్లి పొలిటికల్ రీ ఎంట్రీ ఇస్తారన్న ప్రచారం సాగుతోంది. అయితే ఈ నేపథ్యంలోనే తన గాడ్ ఫాదర్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏపీలోనే నిర్వహించనున్నట్టు చిరంజీవి ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. దీనిపైవైసీపీ కీలక నేత ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు.నిర్ణయాన్ని ప్రశంసిసస్తూ ట్విట్ చేశారు.అంటే చిరంజీవిని వైసీపీ నేతలు భలేగా ఫాలో అవుతున్నారన్న మాట. సోదరుల దూకుడును చిరంజీవితో కట్టడి చేయాలన్నుకుంటున్నారన్న మాట.
Also Read: CM Jagan- Chiranjeevi and Nagarjuna: జగన్ కు జై కొట్టిన చిరంజీవి, నాగార్జున.. షేక్ అవుతున్న టీడీపీ?