Mahesh Babu Emotional: అమ్మ నాకు దైవంతో సమానం. ఆమె కాఫీ తాగితే నాకు గుడిలో ప్రసాదం తిన్నట్లు ఉంటుందని మహేష్ చెప్పిన ఎమోషనల్ వర్డ్స్ వైరల్ అవుతున్నాయి. రెండు మాటల్లో తల్లి ఇందిరా దేవి అంటే తనకు ఎంత ప్రేమో మహేష్ తెలియజేశారు. నేడు తెల్లవారుఝామున కృష్ణ భార్య ఇందిరా దేవి కన్నుమూసిన విషయం తెలిసిందే. చాలా కాలంగా ఇందిరా దేవి అనారోగ్యంతో బాధపడుతున్నారు. గత రాత్రి ఆమె ఆరోగ్యం విషమించింది. 70ఏళ్ల ఇందిరా దేవి తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఇందిరా దేవి మరణనాన్ని కుటుంబ సభ్యులు అధికారికంగా ధృవీకరించారు.

తల్లి మరణంతో మహేష్ కన్నీరు మున్నీరు అవుతున్నారు. తిరిగిరాని లోకాలకు ఏగిన మాతృమూర్తిని తలచుకొని విలపిస్తున్నారు. ఈ సందర్భంగా గతంలో మహేష్ తల్లి గురించి చెప్పిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 2019లో విడుదలైన మహర్షి చిత్రం బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టింది. ఈ మూవీ సక్సెస్ మీట్లో మహేష్ మాట్లాడుతూ… ”నాకు అమ్మంటే దేవునితో సమానం. ప్రతి సినిమా రిలీజ్ కి ముందు అమ్మ ఇంటికి వెళ్లి కాఫీ తాగుతాను. ఆ కాఫీ తాగితే దేవుడి గుడిలో ప్రసాదం తిన్నట్లు ఉంటుంది నాకు. ఆమె బ్లెస్సింగ్స్ నాకు ఎంతో అవసరం. మహర్షి మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ప్రపంచంలో ఉన్న అమ్మలందరికీ అంకింతం చేస్తున్నాను” అని మహేష్ ఎమోషనల్ అయ్యారు.
Also Read: Anushka Shetty Marriage: అనుష్క పెళ్లి ఫిక్స్.. వరుడు మనవాడే.. అతనికి రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి !
ఇకపై మహేష్ కి ఆ అవకాశం ఉండదు. ఇందిరా దేవి చేతి కాఫీతో పాటు సినిమా విడుదలకు ముందు తల్లిని కలిసి బ్లెస్సింగ్స్ తీసుకునే ఛాన్స్ కోల్పోతాడు. కాగా అమ్మ ప్రేమను అద్భుతంగా వివరించే నాని సినిమాలోని మహేష్ సాంగ్ చాలా ఫేమస్. ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించిన ‘పెదవే పలికే మాటల్లోని తియ్యని మాటే అమ్మ” సాంగ్ ఎవర్ గ్రీన్ ఫేవరేట్ గా ఉంది. ఇక ఇందిరా దేవి మృతికి చిత్ర ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. చిరంజీవి ట్విట్టర్ వేదికగా సానుభూతి ప్రకటించారు. నేడు మహాప్రస్థానంలో ఇందిరా దేవి అంత్యక్రియలు జరగనున్నాయి.

కృష్ణ మొదటి భార్య ఇందిరా దేవి. హీరో కాకముందే ఆమెతో వివాహం జరిగింది. అనంతరం నటి విజయ నిర్మలను కృష్ణ రెండో వివాహం చేసుకున్నారు. ఇందిరా దేవికి మొత్తం ఐదుగురు సంతానం. పెద్ద కుమారుడు రమేష్ బాబు 2022 జనవరిలో అనారోగ్యంతో మరణించారు. మహేష్ హీరోగా రాణిస్తున్నాడు. పద్మజ,మంజుల, ప్రియదర్శి ముగ్గురు కూతుళ్లు. హీరో సుధీర్ బాబు కృష్ణ చిన్న అల్లుడు.
Also Read: Chiranjeevi- Ram Charan- Pawan Kalyan: ఒకే రూట్లో చిరంజీవి, రామ్ చరణ్.. ఇపుడు పవన్ కళ్యాణ్
[…] […]