Chandrababu : నన్ను అరెస్ట్ చేస్తారు.. దాడి కూడా చేస్తారు.. ఎట్టకేలకు 118 కోట్ల ముడుపుల కథ విప్పిన చంద్రబాబు

ఇదంతా జగన్ కుట్రనంటున్నాడు. అమరావతి కాంట్రాక్ట్ పట్టిన సంస్థను బెదిరించి.. కేసులు పెడుతామని హెచ్చరించి చంద్రబాబును ఇరికించారట..

Written By: NARESH, Updated On : September 6, 2023 2:56 pm

Chandrababu

Follow us on

Chandrababu : చంద్రబాబు ఎట్టకేలకు తన 118 కోట్ల ముడుపుల కథ విప్పాడు. కుంభకోణం బయటపడ్డప్పటి నుంచి నొప్పించక తానొవ్వక తప్పించుకు తిరుగుతున్న బాబు గారు ఎట్టకేలకు దీన్ని విజయవంతంగా  వైసీపీపై నెట్టేశారు. అసలు 118 కోట్ల ముడుపులు తీసుకొని కేంద్ర ఐటీశాఖకు అడ్డంగా దొరికాడు చంద్రబాబు. ఇందులో ఏపీ ప్రభుత్వానికి కానీ.. జగన్ కు కానీ ఎటువంటి సంబంధం లేదు. దీంతో ఎలా లింక్ చేయాలో తెలియక గత నాలుగైదు రోజులుగా   చంద్రబాబు తెగ ఆలోచించేశాడు. ఇప్పుడు బయటకు  మీడియా ముందుకు వచ్చాడు. తాను అవినీతిపరుడిని కాదు.. ఇదంతా జగన్ కుట్ర అంటున్నాడు.

అమరావతి పేరిట గ్రాఫిక్స్ రాజధానిని సృష్టించింది చంద్రబాబునే. ఎల్ అండ్ టీ, షాపూర్ జీ పల్లాంజీ లాంటి సంస్థలకు భారీగా కోట్లకు కాంట్రాక్ట్ ఇచ్చి వారి నుంచి 118 కోట్లు ముడుపులు తీసుకున్నట్టు సోదాల్లో తేలింది. కేంద్ర ఐటీశాఖ చంద్రబాబుకు నోటీసులు ఇచ్చింది. ఈ ముడుపుల కథ ఏంటన్నది బాబు చెప్పినా ఐటీశాఖ వినడం లేదు. ఆధారాలు ఉన్నాయి అవినీతి చేశావని బాబుకు నోటీసులు ఇస్తూనే ఉంది. దాన్ని ఎలా కవర్ చేయాలో బాబుకు అర్థం కాలేదు.

దీన్ని కూడా మన చంద్రబాబు ఏమర్చారు. తనది కాదని అంటున్నాడు. ఇదంతా జగన్ కుట్రనంటున్నాడు. అమరావతి కాంట్రాక్ట్ పట్టిన సంస్థను బెదిరించి.. కేసులు పెడుతామని హెచ్చరించి చంద్రబాబును ఇరికించారట.. జగన్ ప్రోద్బలంతోనే ఆ సంస్థలు చంద్రబాబును ఇరికించాయట.. ఇది బాబు గారు చెబుతున్న కారణం.

అసలు చంద్రబాబు అవినీతి చేసింది నిజం. అది ఒప్పుకోవడం లేదు. కేంద్ర ఐటీశాఖ నోటీసులు ఇచ్చింది నిజం. దాన్ని నిర్ధారించడం లేదు. కానీ మధ్యలో జగన్ కు ఏపీ ప్రభుత్వాన్ని ఇందులోకి లాగేశాడు. జగన్ వల్లే కేంద్ర ఐటీశాఖ నోటీసులు ఇచ్చిందట.. ఆ కంపెనీలు చంద్రబాబు పేరు చేర్చాయట.. . ‘వైఎస్ఆర్ తనను ఏం చేయలేకపోయారని.. 45 ఏళ్లలో ఒక్క కేసు పెట్టలేదని..’ చంద్రబాబు సెలవిచ్చాడు. కానీ కేసులు కాకుండా లాబీయింగ్ చేసింది చంద్రబాబు అని. ఆయన మేనేజ్ మెంట్ ఏ లెవల్ లో ఉంటుందో అందరికీ తెలుసు అని వైసీపీ అంటుోంది.  ఇప్పుడు అడ్డంగా బుక్కయ్యే సరికి ఏం చేయాలో పాలుపోకనే చంద్రబాబు ఇలా వైసీపీపై నెట్టేశాడని వాళ్లు కౌంటర్ ఇస్తున్నాడు.