Prashant Kishor: ప్రశాంత్ కిషోర్ కు రూ.125 కోట్లు ఆఫర్ చేసిన చంద్రబాబు

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యూహ కర్తగా పనిచేసిన సునీల్ కొనుగోలు పీకే శిష్యుడే. కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకు రాగలిగారు.

Written By: Dharma, Updated On : December 16, 2023 10:34 am

Prashant Kishor

Follow us on

Prashant Kishor: దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ముందుగా ఒక పేరు వినిపించేది. ఆయన సారధ్యంలోనే రాజకీయ పార్టీలు ఎన్నికల బరిలోకి దిగేవి. ఆయన చేసే వ్యూహాలతోనే అధికారంలోకి వచ్చేవి. ఆయనే ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే. చాలా రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు అధికారంలోకి రావడానికి పీకే తన వ్యూహ సలహాలు అందించేవారు. అయితే వేరే ఎవరికో సలహాలు ఇచ్చి అధికారంలోకి తీసుకు రావడం కంటే తానే సొంతంగా పార్టీ పెట్టాలని భావించారు. స్వరాష్ట్రం బీహార్లో ఏకంగా రాజకీయ పార్టీ పెట్టి.. వ్యూహకర్త పదవి నుంచి తప్పుకున్నారు. ఆ బాధ్యతలను తన శిష్యులకు అప్పగించారు.

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యూహ కర్తగా పనిచేసిన సునీల్ కొనుగోలు పీకే శిష్యుడే. కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకు రాగలిగారు. అంతకుముందు కర్ణాటక ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ కు పనిచేసి అక్కడ కూడా తన పాత్ర పోషించారు. దీంతో సునీల్ కొనుగోలు పేరు మార్మోగిపోయింది. తెలంగాణ ఎన్నికల్లో ఫైనల్ స్టేజ్ సమయంలో బిఆర్ఎస్ పీకే కి పిలిపించుకుని సూచనలు తీసుకుందని వార్తలు వచ్చాయి. అయినా సరే బిఆర్ఎస్ కు ఓటమి తప్పలేదు. గత నాలుగేళ్ల కిందట బీఆర్ఎస్ కు పీకే పని చేసినా.. ఎందుకో కేసీఆర్ ప్రశాంత్ కిషోర్ ను వదులుకున్నారు. కేవలం నివేదికల వరకు మాత్రమే పరిమితం చేశారు. చివర్లో అదే పీకే ఎంత ప్రయత్నించినా కెసిఆర్ కు ఓటమి తప్పలేదు.

ఇప్పుడు ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండడంతో మరోసారి ప్రశాంత్ కిషోర్ పేరు మార్మోగిపోతుంది. గత ఎన్నికలకు ముందు వైసీపీ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ పనిచేశారు. జగన్ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించారు. అయితే స్వరాష్ట్రం బీహార్లో రాజకీయ కార్యకలాపాలు ప్రారంభించడం కు స్ట్రాటజిస్ట్ పదవికి దూరంగా ఉన్నారు పీకే. ప్రస్తుతం ఏపీలో వైసీపీకి రిషి రాజ్ సింగ్ నేతృత్వంలోని ఐపాక్ టీం సేవలందిస్తోంది. పూర్వాశ్రమంలో ఈ టీం పీకే కు చెందినదే. అయితే మొన్నటి వరకు వైసిపికి సలహాలు సూచనలు అందించడంలో పీకే ఉండేవారని వార్తలు వచ్చాయి.

అయితే ఇప్పుడు మరో రకమైన వార్త ప్రచారం జరుగుతోంది. క్షేత్రస్థాయిలో కూడా వాస్తవమేనని టాక్ నడుస్తోంది. తెలుగుదేశం పార్టీకి ప్రశాంత్ కిషోర్ సలహాలు, సూచనలు అందించబోతున్నారని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. చంద్రబాబు అరెస్టు తదనంతర పరిణామాలతో ఢిల్లీలో ఉన్న లోకేష్ తో పీకే భేటీ అయ్యారని.. చాలా రకాలుగా చర్చించుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడంతో టిడిపికి విలువైన రాజకీయ సలహాలు, వ్యూహాలు అందించేందుకు ప్రశాంత్ కిషోర్ సిద్ధపడ్డారని.. ఇందుకుగాను చంద్రబాబు రూ.125 కోట్లు ఆఫర్ చేశారని ప్రచారం జరుగుతోంది. ఈ ఎన్నికలు టిడిపికి ప్రతిష్టాత్మకం కావడంతో.. చంద్రబాబు అంత మొత్తం ఇచ్చేందుకు సిద్ధపడ్డారని.. ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ రంగంలోకి దిగారని ఒక వార్త హల్ చల్ చేస్తోంది. మరి అందులో వాస్తవం ఎంత ఉందో చూడాలి.