Chandrababu Naidu: ముందు నుయ్యి.. వెనుక గొయ్యి.. అన్నచందంగా మారింది ఏపీ టీడీపీ పరిస్థితి. గతంలో ఇతర పార్టీలపై శాసించే అధికారం ఉన్న చంద్రబాబు ఇప్పుడు ఇతర పార్టీలను యాచించే స్థాయికి దిగజారారని తెలుస్తోంది. ఒకప్పుడు దేశంలో రాష్ట్రపతులను, ప్రధానులను కూడా డిసైడ్ చేసిన ఘన చరిత్ర మన బాబు గారి సొంతం. వాజ్ పేయి హయాంలో చంద్రబాబు ఏదంటే అది రాజధాని ఢిల్లీలో జరిగేది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్లీ అధికారంలోకి రావాలంటే చిన్న పార్టీలు చెప్పినా వినాల్సిన దుస్తితి ఏర్పడింది. ఇటీవల జనసేన అధినేత పవన్ ప్రసంగంపై చంద్రబాబు మోహంలో కొత్త కోణాలు కనిపించాయి. పవన్ చేసిన వ్యాఖ్యలకు నవ్వాలో.. ఏడ్వాలో అర్థంకాక తల పట్టుకున్నట్లు సమాచారం. ఎందుకంటే ఇంతకాలం జనసేన తనతో కలిసి వస్తుందని భావించిన బాబు ఇప్పుడు ఇతర పార్టీలను కూడా కలుపుకోతామని చెప్పడం ఆశ్చర్యంగా అనిపించింది.

కేవలం జనసేన పార్టీతో కలిసి ఎన్నికల బరిలో దిగితే మరోసారి గద్దెనెక్కి కూర్చోవాలని బాబు కలలు కన్నాడు. కానీ జనసేన అధినేత పవన్ తెలివిగా ఆలోచించాడు. వైసీపీని గద్దె దించాలంటే ఆ పార్టీకి వ్యతిరేక శక్తులన్నింటిని కలుపుకోతామని చెప్పాడు. ఇందులో భాగంగా టీడీపీతో పాటు బీజేపీ, వామ పక్షాలు కూడా జనసేనతో కలిసి బరిలోకి దిగుతాయనే సంకేతాలిచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు జనసేనపై ఆశలు పెట్టుకున్న బాబుకు పవన్ ఇలా అనడంతో ఒక్కసారిగా నిరాశ చెందినట్లు తెలుస్తోంది.
ఎందుకంటే జనసేనతో పాటు బీజేపీ, వామపక్షాలతో కూటమి గా ఏర్పడితే టీడీపీ చాలాచోట్ల సీట్లను కోల్పోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో టీడీపీకి పట్టున్న నియోజకవర్గాలను జనసేనకు వదులుకోవాలి. అటు వామ పక్షాలు, బీజేపీలకు సైతం కొన్ని సీట్లను త్యాగం చెయ్యాలి. ఇలా రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో కనీసం 75 సీట్లసైనా టీడీపీ మిగతా పార్టీలకు కేటాయించాలి. దీంతో మిగతా స్థానాలన్నీ టీడీపీ గెలుస్తుందన్న అవకాశం లేదు. ఒకవేళ ఇతర పార్టీలకు కేటాయించిన వాటిల్లోనూ కొన్ని పోతే టీడీపీకి మళ్లీ పాతరోజులే వస్తాయని బాబు భయపడుతున్నాడట.
Also Read: Allu Arjun Pushpa 3 Movie: ‘పుష్ప 3’లో హీరో విజయ్ దేవరకొండ.. మరి బన్నీ ఏమిటి ?
ఈసారి టీడీపీ అధికారంలోకి రాకపోతే ఇక పార్టీకి భవిష్యత్ ఉండదనే ఊహాగానాలు వస్తున్నాయి. దీంతో బాబు మింగలేక.. కక్కలేక.. జనసేన చెప్పినట్లు వినాల్సి వస్తోందని అంటున్నారు. ఒకప్పుడు బాబు చెప్పినట్లు ఇతర పార్టీలు విన్నాయి. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయిందని అంటున్నారు. అయితే ఎన్నికల సమయానికి బాబు ఈ కూటమిలో భాగస్వామిగా ఉంటారా..? లేక మళ్లీ ఒంటరిగా పోటీ చేస్తారా..? అనే చర్చ కూడా సాగుతోంది.
ఏ పార్టీతోనైనా పొత్తు ఉంటేనే బాబుకు కలిసి వస్తుంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తో పైపై పొత్తుతో ఉంటూ అన్ని సీట్లలో పోటీ చేశారు. దీంతో ఘోర పరాజయం చెందారు. దీంతో మరోసారి ఆ తప్పు చేయకుండా జనసేనతో పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ ఆ పార్టీ అధినేత పవన్ మాత్రం కొత్త స్కెచ్ వేయడంతో బాబు మరోసారి ఆలోచనలో పడ్డాడట. అయితే అన్ని పార్టీలను కలుపుకుపోతామన్న పవన్ సీఎం సీట్లో కూర్చోడానికేనా..? అని కొందరు అంటున్నారు. అదే జరిగితే బాబు ఇక రాజకీయాలకు స్వస్తి చెప్పినట్లేనని అంటున్నారు.
Also Read: Megastar Chiranjeevi- Anasuya Bharadwaj: అనసూయకి వార్నింగ్ ఇచ్చిన చిరంజీవి.. కారణం అదే