Chandrababu And Pawan Kalyan Meet : ఏపీ రాజకీయాల్లో మరో సంచలన కలయికకు పురుడుపోశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లు కలిసిపోయారు. హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసానికి స్వయంగా వెళ్లిన పవన్ కళ్యాణ్ రు అరుదైన స్వాగతం లభించింది. పవన్ కోసం గుమ్మం వద్దకు వచ్చి మరీ చంద్రబాబు స్వాగతం పలికారు.ఇటీవల కుప్పంలో జరిగిన ఘటనల దృష్ట్యా చంద్రబాబుకు పవన్ సంఘీభావం తెలిపారు. అనంతరం ఏపీలోని తాజా రాజకీయ పరిణామాలపై వీరిద్దరూ చర్చించుకున్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక బలోపేతానికి ఐక్య కార్యాచరణ రూపొందించే అంశంపై వీరిద్దరూ చర్చించారు.

జగన్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఐక్యంగా పోరాడాలని చంద్రబాబు, పవన్ నిర్ణయించారు. కొద్దినెలల క్రితం విజయవాడలోని ఓ హోటల్ లో సమావేశమై పలు అంశాలపై చర్చించిన వీరిద్దరూ తాజాగా మరోసారి సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోనంబర్ 1 పైన తాజా భేటిలో చర్చించారు. తమ సభలు, సమావేశాలను జరగనీయకుండా అడ్డుకుంటున్న జగన్ సర్కార్ ను ఎలా ఎదురించాలన్నది ప్రధాన ఎజెండా గా పెట్టుకున్నారు.
వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన మధ్య పొత్తు ఉంటుందనే ప్రచారం నేపథ్యంలో చంద్రబాబు , పవన్ తాజా భేటికి ప్రాధాన్యం ఏర్పడింది. అయితే పొత్తుల గురించి ఎన్నికల వేళ చర్చిస్తామని.. ఇప్పుడు కేవలం ప్రజాసమస్యలు.. వైసీపీ అరాచక పాలన, తమ సభలు సమావేశాలకు అనుమతించకపోవడంపై కలిసి కట్టుగా పోరాడుతామని చంద్రబాబు, పవన్ చెప్పారు.
బ్రిటీష్ కాలం నాటి జీవో తెచ్చిన జగన్ సర్కార్ ఈ జీవోను ఎలా వెనక్కి తీసుకోవాలనే దానిపై తాము చర్చించామని పవన్ తెలిపారు. తమ పర్యటనలను అడ్డుకున్న విషయాలపై చర్చించామని.. దీనిపై కలిసి పోరాడాలని.. ప్రతిపక్ష నేతలకు హక్కులపై కలిసి సాగుతామని పవన్ తెలిపారు.
మొత్తంగా వీరిద్దరి భేటి ఏపీ రాజకీయాల్లో సంచలనమైంది. ఇద్దరు కీలక నేతలు .. ఏపీ రాజకీయాలను మార్చే నేతలు కలిసి సాగాలని నిర్ణయించడంతో వైసీపీ ప్రభుత్వం షేక్ అవుతోంది. వచ్చే ఎన్నికల వరకూ వీరిద్దరి ప్రయాణం సాగితే ఖచ్చితంగా వైసీపీ అధికారం కోల్పోయే ప్రమాదంలో పడడం ఖాయం.