Pawan Kalyan : అభిమానంతోనో లేక ఆరోపణలతోనో ప్రముఖుల ఇళ్ల ముందు కొందరు వీరంగం చేస్తూ ఉంటారు. హైడ్రామాకు తెరలేపుతూ ఉంటారు. చాలా రోజులుగా బోయ సునీత అనే మహిళ నిర్మాత బన్నీ వాసుపై ఆరోపణలు చేస్తున్నారు. ఆయన అవకాశాల పేరుతో నన్ను లైంగికంగా వాడుకున్నాడు. నమ్మించి మోసం చేశాడంటూ ఆమె వేదన వ్యక్తం చేస్తూ ఉంటారు. గీతా ఆర్ట్స్ ఆఫీస్ ఎదుట పలుమార్లు ఆమె నిరసన వ్యక్తం చేశారు. ఈ మధ్య ఆమె అక్కడ అర్థనగ్న ప్రదర్శన చేయడం సంచలనమైంది. బోయ సునీత మానసిక స్థితి సరిగా లేకపోవడంతోనే ఈ చర్యలకు పాల్పడుతున్నట్లు తెలుస్తుంది.

ఆమె ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు.మానసిక అనారోగ్యం కారణంగా బన్నీ వాసుపై ఆమె నిరాధార ఆరోపణలు చేస్తున్న క్రమంలో పలుమార్లు మెంటల్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్చారు. ఎన్నిసార్లు ఆమెకు వైద్యం చేసినా… బయటకు రావడం ఆరోపణలు చేయడం పరిపాటి అయ్యింది. ఇదే తరహా సంఘటన పవన్ కళ్యాణ్ ఇంటి ముందు జరిగింది. 36 ఏళ్ల యువతి పవన్ కళ్యాణ్ ని కలవాలంటూ బీభత్సం సృష్టించింది.
వివరాలు పరిశీలిస్తే తమిళనాడుకు చెందిన జాయిస్ కమల జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 35లో ఉన్న పవన్ కళ్యాణ్ ఇంటి వద్దకు వెళ్ళింది. ఆయనను కలవాలని సెక్యూరిటీ సిబ్బందితో చెప్పింది. వారు కుదరదు అని చెప్పడంతో బట్టలు తీసేస్తూ నగ్న ప్రదర్శన చేయబోయింది. అలాగే రాళ్లతో సిబ్బంది మీద దాడి చేసింది. సెక్యూరిటీ పోలీసులకు ఫిర్యాదు చేయంతో ఆమెను అక్కడి నుండి తరలించారు. గతంలో ఈ యువతి సాయి ధరమ్ తేజ్ ఇంటి ముందు కూడా ఇలానే గొడవ చేసినట్లు తెలుస్తుంది. ఆమె మానసిక స్థితి సరిగా లేదని కుటుంబ సభ్యుల సమాచారం.
జాయిస్ కమలను మానసిక వైద్యశాలలో చేర్చినట్లు సమాచారం అందుతుంది. పవన్ కళ్యాణ్ ఇంటి ముందు ఆమె చేసిన హైడ్రామా హాట్ టాపిక్ అయ్యింది. కొందరు మానసిక సమస్యలతో, మరి కొందరు ఎలాగైనా తమ అభిమాన హీరోని కలవాలి, మాట్లాడాలని ఇలాంటి చర్యలకు పాల్పడుతూ ఉంటారు. అభిమానం వరకూ ఓకే కానీ అది హద్దులు దాటితే కష్టం.