బాలయ్యకు దక్కిన కేంద్ర గౌరవం

తెలుగు రాష్ర్టాల్లో బసవతారకం, సత్యసాయి ఆస్పత్రులు ఉచితంగా సేవలు అందిస్తున్నాయి. దశాబ్దాలుగా ప్రజలకు ఉచిత సేవలందిస్తూ ప్రశంసలు పొందుతున్నాయి. ప్రైవేటు వైద్యం చేయించుకోలేని వారికి అండగా నిలుస్తున్నాయి. దీంతో ఈఆస్పత్రుల గురించి నీతి ఆయోగ్ ప్రశంసలు చేస్తోంది. ఆస్పత్రులకు వచ్చే విరాళాలకు వంద శాతం పన్ను మినహాయింపు ఇవ్వాలని భావిస్తోంది.కొవిడ్ కాలంలో వైద్య సేవలు ఎంత భారమో సామాన్యుడికి తెలిసింది. ప్రభుత్వ రంగంలో మౌలిక వసతులు లేకపోవడంతో ప్రైవేటు దోపిడీ ఎక్కువైపోతోంది. దీంతో అలాంటి పేదలకు ఈ […]

Written By: Srinivas, Updated On : June 30, 2021 1:23 pm
Follow us on

తెలుగు రాష్ర్టాల్లో బసవతారకం, సత్యసాయి ఆస్పత్రులు ఉచితంగా సేవలు అందిస్తున్నాయి. దశాబ్దాలుగా ప్రజలకు ఉచిత సేవలందిస్తూ ప్రశంసలు పొందుతున్నాయి. ప్రైవేటు వైద్యం చేయించుకోలేని వారికి అండగా నిలుస్తున్నాయి. దీంతో ఈఆస్పత్రుల గురించి నీతి ఆయోగ్ ప్రశంసలు చేస్తోంది. ఆస్పత్రులకు వచ్చే విరాళాలకు వంద శాతం పన్ను మినహాయింపు ఇవ్వాలని భావిస్తోంది.కొవిడ్ కాలంలో వైద్య సేవలు ఎంత భారమో సామాన్యుడికి తెలిసింది. ప్రభుత్వ రంగంలో మౌలిక వసతులు లేకపోవడంతో ప్రైవేటు దోపిడీ ఎక్కువైపోతోంది. దీంతో అలాంటి పేదలకు ఈ ఆస్పత్రులు అండగా నిలుస్తున్నాయి.

క్యాన్సర్ వ్యాధికి పెట్టింది పేరు బసవతారకం ఆస్పత్రి. తెలుగు రాష్ర్టాల్లో ఈ పేరు తెలియని వారుండరు. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 2000 సంవత్సరంలో ప్రారంభించిన ఈ ఆస్పత్రి హైదరాబాద్ లో విస్తృతంగా సేవలందిస్తోంది. పేదవారికి ఉచితంగా సేవలందిస్తూ బాధితులకు అండగా నిలుస్తోంది.

ఎన్టీఆర్ సతీమణి క్యాన్సర్ వ్యాధితో చనిపోవడంతో ఇంకెవరు కూడా అలా కాకూడదని భావించి ఆస్పత్రి నిర్మించి సేవలందిస్తున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ ఆస్పత్రి చైర్మన్ గా ఉన్నారు. ఆస్పత్రిని 500 పడకలకు విస్తరించారు. తెల్లకార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ఉచిత వైద్యం చేస్తున్నారు. ఆస్పత్రికి వచ్చే విరాళాలే ఎక్కువగా ఉండడంతో రోగుల చికిత్స కోసమే వాటిని కేటాయిస్తున్నారు.

అనంతపూర్ లో సత్యసాయి ఆస్పత్రి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా అత్యాధునిక వైద్యం అందిస్తోంది.1948లో ఏర్పాటైన ఈ ఆస్పత్రి ఉచిత వైద్యం అందిస్తూ ఎందరో పేదవారికి అండగా నిలుస్తోంది. అనంతపురం జిల్లాలో 12 నోడల్ పాయింట్లలో మొబైల్ ఆస్పత్రులను నిర్వహిస్తూ పేదలకు వైద్యం దగ్గర చేస్తోంది. చుట్టు పక్కల గ్రామాల ప్రజలకు ఉచిత సేవలు అందజేస్తున్నారు. కరోనా సమయంలో అద్భుతమైన సేవలు సత్యసాయి ఆస్పత్రిలో దొరుకుతున్నాయి.

ఈ ఆస్పత్రులకు వచ్చే విరాళాలను వాటిలో మెరుగైన సదుపాయాల కల్పనకే ఖర్చు చేస్తున్నారు. ఇప్పటివరకు వీటికి వచ్చే విరాళాల్లో యాభై శాతం పన్ను మినహాయింపు ఉంది. ఇకపై వంద శాతం పన్ను మినహాయింపు ఇవ్వాలని నీతి ఆయోగ్ కేంద్రానికి సిఫారసు చేసింది. దీంతో ఇక్కడ పేదలకు మరింత మెరుగైన వైద్యం అందించే విధంగా అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. నీతిఆయోగ్ తెలుగు రాష్ర్టాల్లో ఉన్న ఈరెండు ఆస్పత్రులేకాకుండా మరిన్ని ఆస్పత్రులకు మినహాయింపులు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.