
కృష్ణానది యాజమాన్య బోర్డుకు ఏపీ ప్రభుత్వం మరో లేఖ రాసింది. కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శికి ఏపీ ఇంజనీర్ చీఫ్ నారాయణ రెడ్డి లేఖ రాశారు. విద్యుత్ ఉత్పత్తి కోసం తెలంగాణ నీటి వినియోగంపై ఫిర్యాదు చేశారు. కృష్ణానది యాజమాన్యం బోర్డు నుంచి అనుమతి లేకుండా వినియోగిస్తోందని ఫిర్యాదు చేశారు. తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.