Captain Miller Movie Review: కెప్టెన్ మిల్లర్ ఫుల్ మూవీ రివ్యూ…

నటీనటుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో ధనుష్ వన్ మ్యాన్ షో చేశాడనే చెప్పాలి. ఇంతకుముందు సినిమాల్లో ఏ విధమైన నటన ని కనబరిచాడో అంతకు మించి ఈ సినిమాలో వైవిధ్యమైన నటనని చూపించాడు.

Written By: Gopi, Updated On : January 26, 2024 1:16 pm

Captain Miller

Follow us on

Captain Miller Movie Review: ప్రతి వారం చాలా సినిమాలు వస్తు ఉంటాయి, అయినప్పటికీ అందులో కొన్ని సినిమాలు మాత్రమే మంచి సినిమాలుగా పేరు సంపాదించుకుంటాయి. పెద్ద హీరోలు ఉన్నా, లేకపోయినా కంటెంట్ ని బేస్ చేసుకొని సినిమాలు సక్సెస్ లను సాధిస్తాయి అనేది రీసెంట్ టైమ్ లో మనం చాలా సార్లు చూస్తూనే వస్తున్నాం. ఇక్కడ కూడా ఇప్పటినుంచి కంటెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్టుగా కూడా మనకు అర్థమవుతుంది. ఇక అందులో భాగంగానే ఎప్పుడు డిఫరెంట్ అటెంప్ట్ లను ఎంకరేజ్ చేస్తూ వచ్చే ధనుష్ మరోసారి ఒక డిఫరెంట్ అటెంప్ట్ తో మన ముందుకు వచ్చాడు. అయితే ఆ సినిమా ఎలా ఉంది ధనుష్ కి తెలుగు లో సార్ సినిమా తర్వాత మరొక సక్సెస్ దక్కిందా అనే విషయాలను మనం ఒకసారి బ్రీఫ్ అనాలసిస్ ద్వారా తెలుసుకుందాం…

కథ
ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే మిల్లర్ అనే వ్యక్తి రాజుల దగ్గర బానిసలుగా ఉండే కంటే బ్రిటిష్ పోలీస్ సైన్యంలో చేరి సైనికుడిగా ఉండాలనే ఉద్దేశ్యం లో బ్రిటిష్ సైన్యంలో చేరుతాడు. అక్కడ కొంతమంది వల్ల ఆయనకి అన్యాయం జరుగుతుంది. ఒక సైనికుడుగా ఉన్నవాడు కెప్టెన్ గా ఎలా మారాడు..? తనకి అన్యాయం చేసిన వాళ్ల మీద రివెంజ్ ఎలా తీర్చుకున్నాడు అనేది తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…

విశ్లేషణ
ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే ఈ స్టోరీని అరుణ్ మతేశ్వరన్ చాలా ఎఫర్ట్ పెట్టి రాసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇది ఆయనకు మూడవ సినిమా అయినప్పటికీ సినిమాలో ఏ మాత్రం డెప్త్ తగ్గకుండా చాలా హైలీ ఎమోషన్ తో ఈ సబ్జెక్ట్ ని డీల్ చేశాడు. ముఖ్యంగా ఈ సినిమా స్టార్ట్ అయిన 20 నిమిషాలు మాత్రం ఎక్స్ ట్రా ఆర్డినరీ గా ఉందనే చెప్పాలి.ఆ విజువల్స్ గాని, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గానీ దర్శకుడు తీసుకెళ్లిన విధానం గాని ప్రతిధి కంప్లీట్లీ గా చూసే ఆడియెన్స్ కి మతి పోతుందనే చెప్పాలి. ఇక ఈ క్రమంలో ఫస్టాఫ్ అంత హై లో తీసుకెళ్లిన దర్శకుడు సెకండ్ హాఫ్ లో కొంచెం గాడి తప్పినట్టుగా అనిపించినప్పటికీ, తన గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే దర్శకుడు మ్యాజిక్ చేసాడు. ముఖ్యంగా బ్రిటిష్ కాలం నాటి రోజులను రీ క్రియేట్ చేయడంలో దర్శకుడు 100% సక్సెస్ అయ్యాడు. అలాగే ఒక్కొక్క క్యారెక్టర్ తాలూకు ఎమోషన్ ని టాప్ నాచ్ లో చూపించడంలో కూడా దర్శకుడు చాలా బాగా సక్సెస్ అయ్యాడు. ధనుష్ క్యారెక్టర్ ని రాసుకున్న విధానం కూడా బాగుంది అలాగే ఈ సినిమాలో వచ్చే కొన్ని డైలాగులు ప్రేక్షకుడి హృదయాన్ని హత్తుకునేలా ఉన్నాయి. దర్శకుడు బెస్ట్ అవుట్ ఫుట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశాడు. ఇక సార్ సినిమా తర్వాత ధనుష్ కి మరొక సక్సెస్ దక్కిందనే చెప్పాలి…

ఆర్టిస్టు ల పర్ఫామెన్స్

ఇక నటీనటుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో ధనుష్ వన్ మ్యాన్ షో చేశాడనే చెప్పాలి. ఇంతకుముందు సినిమాల్లో ఏ విధమైన నటన ని కనబరిచాడో అంతకు మించి ఈ సినిమాలో వైవిధ్యమైన నటనని చూపించాడు. ఫ్రేమ్ ఫ్రేమ్ కి తనని తాను మౌల్డ్ చేసుకున్న విధానం అద్భుతంగా ఉంది. ఆయన నటన సినిమాకి హైలైట్ గా నిలిచిందనే చెప్పాలి. ఇక గెస్ట్ రోల్ లో నటించిన కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ అలాగే సందీప్ కిషన్ పాత్రలు బాగున్నాయి. వాళ్ళకి ఇంకొంచెం స్కోప్ ఉంటే బాగుండేది. ఇక మిగితా ఆర్టిస్టులు కూడా వాళ్ళ పరిధి మేరకు ఓకే అనిపించారు…

టెక్నికల్ అంశాలు
టెక్నికల్ అంశాల విషయానికి వస్తే జీవి ప్రకాష్ కుమార్ మరొకసారి ధనుష్ కి అద్భుతమైన మ్యూజిక్ ని ఇచ్చాడు. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే ఎక్స్ ట్రా ఆర్డినరీ గా ఉందనే చెప్పాలి. సినిమా మొత్తం ఒక టెంపో లో వెళుతుంటే దాన్ని జివి ప్రకాష్ తన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో చాలా వరకు ఎలివేట్ చేశాడు. ధనుష్ కి మాత్రమే జీవి ప్రకాష్ మంచి మ్యూజిక్ ఇస్తాడంటూ ఇంతకుముందు చాలా వార్తలు వచ్చేవి. కానీ ఈ సినిమాను చూసిన తర్వాత అది నిజమే అనిపిస్తుంది. ఇక ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ అయిన శ్రేయాస్ కృష్ణ కూడా తన విజువల్స్ తో ఈ సినిమాకి ప్రాణం పోశాడు. ముఖ్యంగా వార్ టైప్ లో ఉండే యక్ష ఎపిసోడ్స్ ని చాలా రియలేస్టిక్ గా చూపించడం లో తను 100% సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ప్రతి డిపార్ట్ మెంట్ కూడా ఈ సినిమా మీద హెవీ వర్క్ చేయడం వల్లే ఈ సినిమా ఒక స్టాండర్డ్ లో నిలబడింది…

ఇక ఈ సినిమాలో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటంటే

కథ
ధనుష్
డైరెక్షన్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్

ఇక ఈ సినిమాలోని మైనస్ పాయింట్స్ ఏంటంటే

కొన్ని సీన్లు ప్రేక్షకుడికి బోర్ కొట్టిస్తూ స్లోగా సాగుతుంటాయి.

శివరాజ్ కుమార్, సందీప్ కిషన్ లకి పర్ఫామెన్స్ ఇచ్చే స్కోప్ లేకుండా పోయింది…

ఇక ఈ సినిమాకి మేము ఇచ్చే రేటింగ్ 2.75/5