India Football Team: భారత ఫుట్ బాల్ జట్టు అద్భుతమైన ఆటతీరుతో గత కొన్నాళ్ల నుంచి అదరగొడుతోంది. వరుస విజయాలు సాధిస్తూ జట్టు ముందుకు సాగుతోంది. వరుసగా ఇంటర్ కాంటినెంటల్, శాఫ్ ఛాంపియన్ షిప్ టైటిల్ ను కైవశం చేసుకుని సత్తా చాటింది ఫుట్ బాల్ జట్టు. అయితే ఈ విజయాలతోనే భారత జట్టు ఏమాత్రం సంతృప్తి చెందడం లేదు. టీమిండియా ఆటగాళ్లతోపాటు కోచ్ సహా అంతా ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ విజయాలతో తాము సంతృప్తి చెందడం లేదంటూ బాహాటంగానే తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అంటే దీనిని బట్టి ఏదో సాధించాలన్న లక్ష్యంతో భారత ఫుట్ బాల్ జట్టు ముందుకు సాగుతోందని అంతా భావిస్తున్నారు.
గతానికి భిన్నంగా భారత ఫుట్ బాల్ జట్టు అద్భుతమైన ఆటతీరును కనబరుస్తోంది. ఈ విజయాలు వెనక కోచ్ ఇగార్ స్టిమాక్, కెప్టెన్ సునీల్ చెత్రీ కష్టం, కోచ్ మార్గ నిర్దేశం ఎంతో ఉంది. ఆటగాళ్లు అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేలా చేయడంలో వీరిద్దరూ సఫలీకృతమయ్యారు. అయితే, ప్రస్తుత భారత జట్టు ప్రదర్శన మెరుగుపడినప్పటికీ.. ఇంకా రాటుదేలాల్సిన అవసరం ఉందన్న భావన కోచ్ లో కనిపిస్తోంది.
అగ్రశ్రేణి జట్లకు ధీటుగా నిలబడేలా..
భారత జట్టు అగ్రశ్రేణి జట్లకు పోటీ ఇచ్చి నిలబడే స్థాయిలో ఎదగాలన్నది కోచ్ ఆకాంక్ష. అందుకు అనుగుణంగా ఆటగాళ్లు సహకారాన్ని అందిస్తే మరిన్ని ఉత్తమ ఫలితాలను సాధించే అవకాశం ఉందని కోచ్ ఇగార్ స్టిమాక్ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాడు. మిగిలిన క్రీడలతో పోలిస్తే ఫుట్ బాల్ ఇప్పటికీ భారత్ లో భాగం కాలేకపోయింది. దీంతో ఎక్కువ మంది ఆటగాళ్లు ఈ క్రీడల్లోకి ఆసక్తి చూపించడం లేదు. దీనివల్ల ఫుట్ బాల్ లో రాణించేందుకు అవకాశం ఉన్న ఎంతో మంది క్రీడాకారులు ప్రత్యామ్నాయ ఆటలవైపు దృష్టి సారిస్తున్నారు. భారత జట్టు బలంగా తయారు కాలేకపోతోంది. ప్రధానంగా దీనిపైన ప్రస్తుత కోచ్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. జట్టులోకి యువ ఆటగాళ్లను తీసుకురావడంతో పాటు వారిని అంతర్జాతీయ స్థాయికి అనుగుణంగా ఆడేలా తీర్చిదిద్దే పనిలో కోచ్ నిమగ్నమై ఉన్నాడు. దీనివల్ల మెరుగైన ఫలితాన్ని సాధించేందుకు అవకాశం ఉందని చెబుతున్నారు. ఇండియన్ సూపర్ లీగ్ నుంచి ఆటగాళ్లు కొన్ని చెడ్డ అలవాట్లను భారత ఆటగాళ్లు తీసుకుని వచ్చారు. దీనివల్ల సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. సకాలంలో తీసుకునే సరైన నిర్ణయాలు వల్ల మెరుగైన ఫలితం వస్తుంది. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవడం పట్ల ఆటగాళ్లతోపాటు యాజమాన్యం దృష్టిసారించింది. అగ్రశ్రేణిజట్లకు పోటీనిచ్చేలా జట్టులో మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. జట్టు యాజమాన్యం తీసుకోబోతున్న చర్యలు సత్ఫలితాలను అందిస్తే అంతర్జాతీయ స్థాయిలో అద్భుతాలను సృష్టించే దిశగా భారత,ఫుట్ బాల్ జట్టు ముందుకు సాగుతుందన్న ఆశాభావాన్ని అభిమానులతోపాటు విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. కోచ్, మేనేజ్మెంట్ ఆశిస్తున్నట్టు జరిగితే భారత్ ఫుట్బాల్ జట్టు అంతర్జాతీయ స్థాయికి ఎదిగేందుకు అవకాశం ఉంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.