Homeజాతీయ వార్తలుBRS MLA Tatikonda Rajaiah: చిలిపా.. చిల్లరా.. రాజయ్యా ఏందీ రాసలీలలు!?

BRS MLA Tatikonda Rajaiah: చిలిపా.. చిల్లరా.. రాజయ్యా ఏందీ రాసలీలలు!?

BRS MLA Tatikonda Rajaiah
BRS MLA Tatikonda Rajaiah

BRS MLA Tatikonda Rajaiah: కామాతురానాం.. న భయం.. న లజ్జ అన్న నానుడిని నిజం చేస్తున్నాడు మాజీ ఉప ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. దళిత సామాజికి వర్గంలో పుట్టిన రాజయ్య దానిని అడ్డుపెట్టుకుని కామ పిశాచిలా తయారయ్యాడు. కులం కార్డును అడ్డుపెట్టుకుని రాసలీలు చేస్తున్నాడు. అడ్డు చెప్పేవారిపై అట్రాసిటీ కేసులు పెట్టించడం, తప్పుడు కేసులు పెట్టించడం స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గంలో సాధారణమైంది.

సొంతపార్టీ మహిళా నేతలకే లైంగిక వేధింపులు..
రాజయ్య రాసలీలలపై గతంలోనే అనేక ఆరోపణలు ఉన్నాయి. ‘నవ్విపోదురుగాక, నాకేటి సిగ్గు’ అన్న చందంగా ఎవరేమనుకుంటే నాకేంటి అన్నట్లుగా సొంత పార్టీ ప్రజాప్రతినిధులనే లైగికంగా వేధిస్తున్నాడు. తాజాగా ఓ మహిళా సర్పంచ్‌పై కన్నేశాడు రాజయ్య. ఆమె కోసం రాయబారం నెరిపాడు. బాధితురాలు మీడియా ముందుకు రావడంతో బండారం బయటపడింది.

కోరిక తీర్చలేదని నిధులు నిలిపేశాడు..
హన్మకొండ జిల్లా ధర్మసాగర్‌ మండలం జానకీపురం సర్పంచ్‌ కుర్సపెల్లి సవ్యపై రాజయ్య కన్నుపడింది. దీంతో వెంటనే ఆమెను తన కోరిక తీర్చోకోవాలనుకున్నాడు. ధర్మసాగర్‌ మండలానికి చెందిన కొంతమంది ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులను నవ్యతో రాయబారం నెరిపాడు. అయితే అందుకు సదరు సర్పంచ్‌ అంగీకరించలేదు. దీంతో గ్రామాభివృద్ధికి నిధుల కేటాయింపులో వివక్ష చూపిస్తున్నాడు.

బండారం బయటపెట్టిన సర్పంచ్‌..
లైంగికంగా వేధించడమే కాకుండా, గ్రామాభివృద్ధికి నిధుల కేటాయింపులో వివక్ష చూపడంతో సదరు సర్పంచ్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏకంగా ప్రెస్‌మీట్‌ పెట్టి రాజయ్య బండారం బయటపెట్టింది. తన కోరిక తీర్చాలని అడిగాడని, రాయబారం పంపించాడని చెప్పాడు. అంగీకరించకపోవడంతో ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలకు పిల వడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘మీకు అక్కాచెల్లెల్లు లేరా?’ అంటూ సదరు నేతలపై ఫైర్‌ అయ్యారు. ప్రజా సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చామని తెలిపారు.

BRS MLA Tatikonda Rajaiah
BRS MLA Tatikonda Rajaiah

గతంలో అనేక ఆరోపణలు..
ఎమ్మెల్యే రాజయ్యపై ఆరోపణలు రావడం ఇదే మొదటి సారి కాదు.. గతంలో అనేకమార్లు రాజయ్యపై మహిళలు ఆరోపణలు చేశారు. గతంలో తన బర్త్‌డే వేడుకల్లోనూ మద్యం మత్తులో ఓ మహిళా నేత నోట్లో వేలు పెట్టి తన కామవాంఛ తీర్చుకున్నాడు. అప్పట్లో ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. నియోజకవర్గంలో నిర్వహించిన ఓ సమావేశంలో నియోజకవర్గంలో చాలా మందికి నా కారణంగానే పిల్లలు పుట్టారని వ్యాఖ్యానించాడు. ఇలా అనేకమార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు, తాజాగా సర్పంచ్‌ నవ్యతో తాటికొండ చేసిన రాయబేరం కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

 

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular