
NTR30 : నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ ‘ఎన్టీఆర్30’. ఈ నెలలో ఎన్టీఆర్ 30 రెగ్యులర్ షూట్ మొదలుకానుంది. ఈ చిత్ర కథపై అనేక ఊహాగానాలు ఉన్నాయి. ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నారని అంటున్నారు. హైదరాబాద్, గోవా నగరాల్లో స్పెషల్ సెట్స్ వేస్తున్నారట. అక్కడే కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ఎన్టీఆర్ 30 ప్రతి పోస్టర్లో సముద్రం హైలెట్ చేస్తున్నారు. సీ పోర్ట్ సినిమా ప్రధాన ఇతివృత్తం అని ప్రచారం జరుగుతుండగా… పోస్టర్స్ బలం చేకూర్చుతున్నాయి.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆస్కార్ కోసం అమెరికా వెళ్లాడు. అతను ప్రస్తుతం అమెరికాలో ఉన్నాడు. ఆస్కార్ ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ తిరిగి రానున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తన 30 వ చిత్రంలో నటించనున్నాడు. వివిధ కారణాల వల్ల ప్రాజెక్ట్ ఆలస్యం అయింది. మార్చి నుంచి సెట్స్‌లో జాయిన్ అవుతానని ఎన్టీఆర్ స్వయంగా ప్రకటించాడు.
ఈ క్రమంలోనే ఈ చిత్రం ఇప్పుడు గ్రాండ్ లాంచ్‌కి సిద్ధమవుతోంది. పూజా కార్యక్రమాలు మార్చి 18న గ్రాండ్‌గా జరగనున్నాయి. రెగ్యులర్ షూటింగ్ కూడా ఈ నెలలోనే మొదలై ఫస్ట్ షెడ్యూల్‌లో ఎన్టీఆర్ సెట్స్‌పైకి వెళ్లనున్నారు.
ఎన్టీఆర్ 30 చిత్రంతో జాన్వీ కపూర్ టాలీవుడ్‌లో కథానాయికగా అరంగేట్రం చేస్తోంది. ఈ చిత్రం పాన్-ఇండియన్ లెవల్ లో విడుదల కాబోతోంది. ఇది యాక్షన్ పై ఎక్కువగా ఉంటుంది. అనిరుధ్ సంగీతం అందించడానికి రెడీ అయ్యారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ నిర్మాతలు. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రం వేసవి 2024లో విడుదలకు ప్రకటించబడింది.