Bro the Avatar Preview : కాసేపు బాధ.. కాసేపు సంతోషం..అదిరిపోయిన ‘బ్రో ది అవతార్’ ప్రివ్యూ షో టాక్!

సినిమా మొత్తం లో మైనస్ పాయింట్ ఏమైనా ఉందా అంటే,అది ప్రొడక్షన్ వాల్యూస్ అని అంటున్నారు. గ్రాఫిక్స్ చాలా చెత్తగా ఉన్నాయట. అయితే పవన్ కళ్యాణ్ సినిమాలో కేవలం పవన్ కళ్యాణ్ ని చూసేందుకు మాత్రమే జనాలు వస్తారని, మిగతావేమి పట్టించుకోరు అని అంటున్నారు.

Written By: NARESH, Updated On : July 25, 2023 1:25 pm

Bro Trailer Records

Follow us on

Bro the Avatar Preview : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్యపాత్రలో సాయి ధరమ్ తేజ్ కేతికశర్మ జంటగా సముద్ర ఖని దర్శకత్వం లో తెరకెక్కిన ‘బ్రో ది అవతార్’ చిత్రం మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఓవర్సీస్ మొత్తం ప్రారంభం అయ్యింది. ఇక ఇండియా లో ఇప్పటికే కర్ణాటక ప్రాంతం లో బుకింగ్స్ ఓపెన్ చెయ్యగా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

సినిమాకి అసలు హైప్ లేదు, ఓపెనింగ్స్ రావేమో అని భయపడిన అభిమానులకు ఈ అడ్వాన్స్ బుకింగ్స్ చూసిన తర్వాత ఈసారి కూడా దుమ్ము లేచిపోయే రేంజ్ ఓపెనింగ్ వస్తుందని బలమైన నమ్మకం తో ఉన్నారు. ఆంధ్ర ప్రదేశ్/ తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ రేపు ప్రారంభం కాబోతున్నాయి. ఇక పోతే ఈ సినిమాకి సంబంధించిన ప్రివ్యూ షో ని కాసేపటి క్రితమే దుబాయి లో కొంతమంది ప్రముఖులకు వేసి చూపించారు.

ఈ ప్రివ్యూ షో నుండి ఎలాంటి టాక్ వచ్చిందో ఒకసారి చూద్దాం. ఈ చిత్రం సెకండ్ హాఫ్ మాత్రం పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే ది బెస్ట్ గా నిలిచిపోతుందని అంటున్నారు. ప్రేక్షకుల హృదయాలను పిండేసే రేంజ్ సెంటిమెంట్ ని డైరెక్టర్ సముద్ర ఖని ఈ సినిమాలో పెట్టాడు అని అంటున్నారు. ఇక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రాసిన డైలాగ్స్, పవన్ కళ్యాణ్ నోటి నుండి తూటాలు లాగ పేలాయని, ఇది ఆయన కెరీర్ బెస్ట్ వర్క్స్ లో ఒకటి అని అంటున్నారు. ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ ఎంటర్టైన్మెంట్ తో సాగిపోతుంది. ఇంటర్వెల్ సన్నివేశం అదిరిపోయింది.

కానీ సినిమా మొత్తం లో మైనస్ పాయింట్ ఏమైనా ఉందా అంటే,అది ప్రొడక్షన్ వాల్యూస్ అని అంటున్నారు. గ్రాఫిక్స్ చాలా చెత్తగా ఉన్నాయట. అయితే పవన్ కళ్యాణ్ సినిమాలో కేవలం పవన్ కళ్యాణ్ ని చూసేందుకు మాత్రమే జనాలు వస్తారని, మిగతావేమి పట్టించుకోరు అని అంటున్నారు. మరి ప్రివ్యూ షో నుండి వచ్చిన ఈ టాక్ , పబ్లిక్ నుండి కూడా వస్తుందో లేదో తెలియాలంటే మరో మూడు రోజులు ఆగాల్సిందే.