https://oktelugu.com/

గురువారం బృహస్పతిని పూజిస్తే ఏం జరుగుతుందో తెలుసా?

నవగ్రహాలు 9 అన్న విషయం మనకు తెలిసిందే. గ్రహ దోషాలు ఉన్న వారు ఈ నవగ్రహాలకు వెళ్లి దోష పరిహారం చేయించుకోవడం మనం చూస్తూనే ఉంటాం. ఈ వారం లో ఉన్న ఏడు రోజులలో ఒక్కరోజుకి ఒక్కో గ్రహం అధిపతిగా ఉంటారు. ఈ నవగ్రహాలలో ఒకటైన బృహస్పతి గురువారానికి అధిపతి. ఈ బృహస్పతిని గురుడు అని కూడా పిలుస్తారు. వారంలో గురువారం ఈ బృహస్పతి ని పూజించడం ద్వారా ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అన్న సందేహం చాలా […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 7, 2021 / 10:34 AM IST
    Follow us on

    నవగ్రహాలు 9 అన్న విషయం మనకు తెలిసిందే. గ్రహ దోషాలు ఉన్న వారు ఈ నవగ్రహాలకు వెళ్లి దోష పరిహారం చేయించుకోవడం మనం చూస్తూనే ఉంటాం. ఈ వారం లో ఉన్న ఏడు రోజులలో ఒక్కరోజుకి ఒక్కో గ్రహం అధిపతిగా ఉంటారు. ఈ నవగ్రహాలలో ఒకటైన బృహస్పతి గురువారానికి అధిపతి. ఈ బృహస్పతిని గురుడు అని కూడా పిలుస్తారు. వారంలో గురువారం ఈ బృహస్పతి ని పూజించడం ద్వారా ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అన్న సందేహం చాలా మందికి ఉంటుంది.అయితే బృహస్పతిని గురువారం పూజ చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం..

    Also Read: రావి చెట్టుకు పూజించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?

    గురువారం ఉదయం స్నానమాచరించి నవగ్రహాలను ప్రత్యేక భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల విశేష ఫలితాలను పొందవచ్చు. ఏ నెలలో అయినా శుక్లపక్షంలో వచ్చే గురువారం ఈ బృహస్పతి గ్రహానికి పూజలు చేయటం ద్వారా అష్టైశ్వర్యాలను పొందవచ్చు. గురుడుకి పూజించే సమయంలో అతనికి ఎంతో ప్రీతికరమైన ముల్ల పువ్వులు (గులాబీ) వంటి పువ్వులు ద్వారా పూజ చేసి శెనగల మాలను సమర్పించడం ద్వారా స్వామివారి కృపకు పాత్రులు కాగలరు.

    Also Read: మంగళవారం కుబేర స్థానాన్ని చూస్తే ఏమవుతుందో తెలుసా?

    ఏనుగును వాహనంగా కలిగి ఉన్న బృహస్పతిని గురువారం పూజించి స్వామివారి ఎదుట నెయ్యి దీపం వెలిగించడం ద్వారా ఈతిబాధలు తొలగిపోయి సుఖ సంతోషాలతో గడుపుతారు. గురువుకు ఆదిత్య సంఖ్య 3. గురువుకు ఆది దేవత అయిన బ్రహ్మను పూజించడం ద్వారా బుద్ధికుశలత, వికాసం కలుగుతుంది. అంతేకాకుండా గురు గాయత్రీ మంత్రాన్ని108 సార్లు పఠించడం వల్ల సమస్త దోషాలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.

    మరిన్ని వార్తల కోసం: ప్రత్యేకం