https://oktelugu.com/

ఆ ఆలయాలను పునర్నిర్మిస్తాం: జగన్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఏపీ రాజకీయాలు కంప్లీట్‌గా ఆలయాల చుట్టూనే తిరుగుతున్నాయి. రోజుకో చోట విగ్రహాల ధ్వంసం జరుగుతుండడంతో రాజకీయాలు హాట్‌హాట్‌గా నడుస్తున్నాయి. ఒకవైపు ప్రతిపక్షాల అటాక్‌.. మరోవైపు అధికార పక్షం కౌంటర్‌‌.. వెరసి టెంపుల్‌ టౌన్స్‌ చుట్టూ నేతలు పరుగులు పెడుతున్నారు. జగన్‌ అధికారం చేపట్టి 18 నెలల కాలంలో పదుల సంఖ్యలో ఆలయాలపై దాడులు చేసినా ఒక్క నిందితుడిని పట్టుకోలేకపోయారు. దీంతో ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. ముఖ్యంగా అంతర్వేది ఘటన.. ఇప్పుడు రామతీర్థ ఘటన. Also Read: స్పృహ […]

Written By:
  • Srinivas
  • , Updated On : January 7, 2021 / 10:21 AM IST
    Follow us on


    ఏపీ రాజకీయాలు కంప్లీట్‌గా ఆలయాల చుట్టూనే తిరుగుతున్నాయి. రోజుకో చోట విగ్రహాల ధ్వంసం జరుగుతుండడంతో రాజకీయాలు హాట్‌హాట్‌గా నడుస్తున్నాయి. ఒకవైపు ప్రతిపక్షాల అటాక్‌.. మరోవైపు అధికార పక్షం కౌంటర్‌‌.. వెరసి టెంపుల్‌ టౌన్స్‌ చుట్టూ నేతలు పరుగులు పెడుతున్నారు. జగన్‌ అధికారం చేపట్టి 18 నెలల కాలంలో పదుల సంఖ్యలో ఆలయాలపై దాడులు చేసినా ఒక్క నిందితుడిని పట్టుకోలేకపోయారు. దీంతో ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. ముఖ్యంగా అంతర్వేది ఘటన.. ఇప్పుడు రామతీర్థ ఘటన.

    Also Read: స్పృహ తప్పిన అఖిల.. ఇంకా పరారీలోనే భార్గవ్‌

    ఇదిలా ఉండగా.. ఆలయాలపై దాడులు చేయడాన్ని ప్రభుత్వం కూడా సీరియస్‌గా తీసుకుంటోంది. సీఎం జగన్‌.. దాడులకు పాల్పడుతున్న నిందితులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని ఆదేశాలు జారీ చేశారు. ఎవ్వరినీ ఉపేక్షించొద్దంటూ ఆర్డర్ వేశారు.

    అయితే.. మరో ఇంట్రెస్టింగ్‌ ఏంటంటే.. గతంలో టీడీపీ హయాంలో కూల్చేసిన ఆలయాలను పునర్నించేందుకు జగన్‌ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈనెల 8న దీనికి ముహూర్తాన్ని ఖరారు చేసింది. టీడీపీ హయాంలో పుష్కరాల సమయంలో చంద్రబాబు అనేక ఆలయాలను కూల్చేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వాటిని ఇప్పుడు తిరిగి నిర్మిస్తామంటున్నారు. 13 జిల్లాల్లో ఇప్పటి వరకు కూల్చివేసిన 40 ఆలయాలను తిరిగి నిర్మిస్తామని తెలిపారు ఏపీ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి. ఈనెల 8న ఉదయం 11 గంటల 1 నిమిషానికి ముఖ్యమంత్రి జగన్‌ దుర్గ గుడి దగ్గర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు. రూ.70 కోట్లతో ఆలయాల పునర్నిర్మాణ పనులు చేపడుతున్నామని తెలిపారు.

    Also Read: కుప్పలుగా చచ్చిపోయిన పక్షులు.. తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కలకలం

    ఆలయాల పునర్నిర్మాణానికి సంబంధించి రూపొందించిన నమూనాలు కూడా విడుదలయ్యాయి. విజయవాడలో సీతమ్మవారి పాదాలు ఆలయానికి సంబంధించిన నమూనా విడుదలైంది. పుష్కరాల సమయంలో విజయవాడలో దక్షిణముఖ ఆంజనేయస్వామి ఆలయం, సీతమ్మ వారి పాదాలు, రాహు కేతువు, బొడ్డుబొమ్మ, గోశాల కృష్ణుడు దేవాలయాలను పునర్నిర్మిస్తామని మంత్రి వెల్లంపల్లి తెలిపారు. వీటితో పాటు రాష్ట్రంలోని 40 వరకు కూల్చివేసిన ఆలయాలను తిరిగి నిర్మిస్తామంటున్నారు. 2016లో జరిగిన కృష్ణా పుష్కరాల సమయంలో టీడీపీ సర్కార్‌ అనేక ఆలయాలను కూల్చివేసిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కృష్ణానది కరకట్టపై ఉన్న ఆలయాలతో పాటు విజయవాడ నడిమధ్యలో ఉన్న గుళ్లను కూడా రోడ్డు వెడల్పు పేరుతో చంద్రబాబు కూల్చివేయించారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్