Homeజాతీయ వార్తలుUP Exit Polls: యూపీలో మళ్లీ బీజేపీనే.!? కేంద్రంలో మళ్లీ మోడీనే? కానీ ట్విస్ట్ ఇదే!

UP Exit Polls: యూపీలో మళ్లీ బీజేపీనే.!? కేంద్రంలో మళ్లీ మోడీనే? కానీ ట్విస్ట్ ఇదే!

UP Exit Polls: అనుకున్నట్టే అయ్యింది. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ లో మరోసారి బీజేపీ జెండానే ఎగురబోతోంది. దీంతో సహజంగానే కేంద్రంలో మరోసారి కమలం పార్టీ అధికారంలోకి వస్తుందని తేటతెల్లమైంది. ప్రధాని మోడీ హవా ఏమాత్రం తగ్గలేదని నిరూపితమైంది.

UP Exit Polls
Yogi, Modi

కొద్దిరోజుల ముందు వరకూ యూపీలో బీజేపీపై తీవ్ర విమర్శలు.. వివాదాలు.. రైతులను తొక్కించి చంపారని స్వయంగా ఓ కేంద్రమంత్రి కొడుకు జైలు పాలయ్యాడు. కేంద్రమంత్రిపై కూడా విమర్శలు వచ్చాయి. కేబినెట్ మంత్రులు, ఎమ్మెల్యేలు పార్టీని వీడి ప్రభుత్వంపై విమర్శలు చేసినా.. కుల సమీకరణాల్లో ప్రత్యర్థి పార్టీలు అన్నీ ఏకమైనా సరే.. అవేవీ యోగి ఆధిత్యనాథ్ విజయాన్ని ఆపలేకపోతున్నాయా? అంటే ఔననే సమాధానం వస్తోంది.

కోవిడ్ కట్టడిలో యోగి ప్రభుత్వంపై విమర్శలు.. బ్రాహ్మణ సామాజికవర్గం నుంచి వ్యతిరేకత ఉన్నా.. మరోసారి అతిపెద్ద రాష్ట్రం బీజేపీ ఖాతాలో పడబోతోందని అన్ని ఎగ్జిట్ పోల్స్ తాజాగా కోడై కూశాయి. 5 రాష్ట్రాల ఎన్నికలు ముగియడంతో దేశవ్యాప్తంగా ప్రముఖు మీడియా, సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశాయి. అందరి దృష్టి యూపీపైనే ఉండేది.

ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్ లో కమలం పార్టీ గెలుపు ఖాయమని తేలిపోయింది. అయితే సీట్ల పరంగా సమాజ్ వాదీ పార్టీ భారీగా పుంజుకుంటుందని.. బీజేపీకి కొన్ని సీట్లు తగ్గుతాయని తేలింది. సీఎం కుర్చీ మాత్రం అఖిలేష్ కు అందనంత దూరంగా ఉంది. యోగినే సీఎం కాబోతున్నారు. ఇక బీఎస్పీ కి కనీసం రెండంకెల సీట్లు రావడం కానకష్టంగా మారింది. 50 ఏళ్లకు పైగా రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ కు కనీసం 10 సీట్లు రావడం గగనమేనని తేలింది.

Also Read: Punjab Election Exit Poll: పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ ఎలా గెలవబోతోంది?

యూపీలో గత 2017 అసెంబ్లీ ఎన్నికల్లో 312 స్థానాల్లో గెలిచి క్లియర్ కట్ గా విజయం సాధించింది. ఎవరి సపోర్టు లేకుండా అధికారం సాధించింది. యోగిని సీఎం సీట్లో మోడీషాలు కూర్చుండబెట్టారు. అయితే ఈసారి మెజార్టీ సీట్లు బీజేపీకి యూపీ ప్రజలు కట్టబెట్టడం కష్టమేనంటున్నారు. గతంలో కంటే 100 వరకూ స్తానాలు తగ్గొచ్చని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనావేశాయి. అప్నా దళ్, నిషాద్ పార్టీలకు మంత్రి పదవులు ఇచ్చి ఆ పార్టీలను కలుపుకొని ఎన్నికలకు వెళ్లినా ఈసారి మెజార్టీ సీట్లు 202 కంటే కొన్ని సీట్లు మాత్రమే అధికంగా వస్తాయని తేలింది.

యూపీ ట్రెండ్ చూస్తే మోడీ మేనియా తగ్గలేదని.. ఎన్ని ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నా.. బీజేపీకే ప్రజలు పట్టం కట్టబోతున్నారని తేలింది. అయితే క్లియర్ కట్ గా బీజేపీకి పట్టం కట్టే అవకాశాలు లేవు. మెజార్టీ తగ్గిపోవచ్చు. రాష్ట్రాల్లో బీజేపీ వెనుకబడి ప్రాంతీయ పార్టీలు కీలకంగా మారే అవకాశాలున్నాయి. మొత్తంగా 2019లో లాగా 2024లో బీజేపీ సొంతంగా అధికారంలోకి రావడం కష్టమేనన్న అంచనాలు యూపీ ఎన్నికలతో ఏర్పడ్డాయి.

Also Read: Why BJP Losing State After State: మోడీ వ్యూహాలు రాష్ట్రాల్లో పనిచేయవా?

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

2 COMMENTS

  1. […] AP Politics: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సమీకరణలు మారనున్నాయి. ముఖ్యమంత్రి జగన్ పై అసమ్మతి పెరిగిపోతోంది. రాజకీయ పార్టీల్లోనే కాదు సొంత ఇంటిలో కూడా వేరు కుంపటి రగులుతోంది. ఇన్నాళ్లు జగన్ కు చేదోడు వాదోడుగా ఉన్న బావ బ్రదర్ అనిల్ అసంతృప్తితో రగిలిపోతున్నారు.క్రైస్తవ సమాజం మొత్తం జగన్ వెంట ఉన్నా ఆయన పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడలో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీంతో రాష్ట్రంలో పరిణామాలు మారేలు కనిపిస్తున్నాయి. […]

Comments are closed.

Exit mobile version