Australia bumper offer to RRR: నేషనల్ రేంజ్ లోనే గొప్ప విజువల్ డైరెక్టర్ గా తనకంటూ వందల కోట్ల మార్కెట్ సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నాడు రాజమౌళి. కాగా ఆయన డైరెక్షన్ లో ‘ఎన్టీఆర్ – రామ్ చరణ్’ హీరోలుగా రానున్న క్రేజీ భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి మరో ఘనత దక్కింది. ప్రీమియర్స్‌తో ఆర్ఆర్ఆర్ ఒకరోజు ముందుగా, అంటే మార్చి 24నే పలకరించనుంది. ఈక్రమంలో నిన్ననే అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేశారు.

ఏ చిత్రానికి లేనంత క్రేజీగా ప్రీమియర్ టికెట్లు అమ్ముడుపోతున్నాయి. ట్రేడ్ వర్గాల ప్రకారం యూఎస్‌లో 267 లోకేషన్లలో 935 షోస్‌కి అప్పుడే $500k వచ్చేశాయట. ఇంకా 20 రోజులు ఉండగా, ప్రీ టికెట్ సేల్స్‌లో సంచలనం సృష్టించడం ఖాయం అంటున్నారు. చరణ్, తారక్ అభిమానులు ఒక్క టికెట్‌తో ఆగట్లేదట. ఒక్కొక్కరు రెండేసి టికెట్లు కొంటున్నారు. పైగా నిజమైన మల్టీస్టారర్ కాబట్టి ఈ సినిమాకి పోటీగా ఏ సినిమా రావట్లేదు.
ఇక ఆస్ట్రేలియా దేశంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. రోజువారి షోల కంటే అదనపు షోలు వేసుకోవచ్చని ఆస్ట్రేలియా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో మెల్ బోర్న్.. ఇంకా పలు ప్రాంతాల్లో ఐమాక్స్ థియేటర్ లలో ‘ఆర్ఆర్ఆర్’ ఎక్స్ ట్రా షోలకు టికెట్లు హాట్ కేకులా అమ్ముడవుతున్నాయి. ఈనెల 26,27 తేదీల్లో భారీ ఎత్తున ఆస్ట్రేలియాలో షోలు పడుతున్నాయి. విదేశాల్లో అన్ని దేశాలకంటే ఆస్ట్రేలియాలోనే ఎక్కువగా ఎక్స్ ట్రా, అదనపు షోలు వేస్తున్నారట.. అదో రికార్డుగా చెప్పొచ్చు.
Also Read: Manchu Vishnu Movie Update: పాయల్, సన్నీలియోన్ లతో రొమాన్స్ కి రెడీ అయిన మంచు విష్ణు !
కాగా ఈ సినిమాలో ఇతర ముఖ్యమైన పాత్రల్లో అజయ్ దేవగన్, సముద్రఖని నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇక ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడం, ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా పై ఆరంభం నుండి భారీ అంచనాలు నెలకొన్నాయి.
పైగా ఇప్పటికే ఈ సినిమా నుండి అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ ఫస్ట్ లుక్ టీజర్, కొమురం భీమ్ గా జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ టీజర్, మరియు ట్రైలర్ అండ్ సాంగ్స్ విడుదలైయి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేశాయి. దాదాపు నాలుగు వందల కోట్లకు పైగా బడ్జెట్‌తో రూపొందిన ఈ ప్యాన్ ఇండియా మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి.
Also Read: Anupama Parameswaran: రెడ్ డ్రెస్ తో ‘అనుపమ పరమేశ్వరన్’.. నెటిజన్లు ఫిదా