PK Survey On TRS Leaders: మాంత్రికుడి ప్రాణం పంజరంలో ఉన్న చిలకలో ఉన్నట్టు.. ఇప్పుడు అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకుల భవితవ్యం పీకే సర్వే రిపోర్ట్ లో ఉంది. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ దాకా పదేపదే పీకే సర్వే రిపోర్ట్ ఆధారంగానే టికెట్లు ఇస్తామని చెబుతుండడంతో ప్రస్తుత ఎమ్మెల్యేల్లో గుబులు పట్టుకుంది. ఈ క్రమంలో ప్రజావ్యతిరేకత ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు ప్రతిపక్ష పార్టీలతో టచ్ లో ఉంటున్నారు. అంగబలం అర్థబలం మెండుగా ఉండటంతో వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను అని తెరవెనుక ప్రచారం చేసుకుంటున్నారు. వాస్తవానికి పీకే సర్వే రిపోర్ట్ అనేది బయటకి వెల్లడించక పోయినా లీకుల ద్వారా సమాచారం తెలుసుకున్న సదరు ఎమ్మెల్యేలు వచ్చే ఎన్నికల నాటి దాకా వేచి చూసి టిక్కెట్ రాకుంటే అప్పుడు ఏదో ఒక పార్టీలో చేరి పోటీలో నిలబడ్డామని యోచిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా ఇందులో అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల బలం 80 స్థానాలు పైచిలుకే. ఈ స్థానాల్లో 35 మంది దాకా తీవ్ర ప్రజావ్యతిరేకత ఎదుర్కొంటున్న టుడే పీకే తన సర్వేలో కేసీఆర్కు నివేదించారు. వీరిని తప్పిస్తేనే పార్టీకి ప్రయోజనం ఉంటుందని వివరించారు. ఇటీవల ప్రగతి భవన్ లో నిర్వహించిన టిఆర్ఎస్ శాసనసభ పక్ష సమావేశంలో కేసీఆర్ పదేపదే ఇదే విషయాన్ని వెల్లడించారు. ఎమ్మెల్యేలు ఎవరు కూడా హైదరాబాదులో ఉండదు మీ నియోజకవర్గంలోనే ఉండి ప్రజా సమస్యల పరిష్కారం కోసం పని చేయండి అంటూ దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి నల్లగొండలోని టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీవ్రమైన ప్రజావ్యతిరేకత ఎదుర్కొంటున్న ట్లు తెలిసింది. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అధికార టీఆర్ఎస్ పార్టీకి 2018 ఫలితాలు వస్తాయని సర్వే రిపోర్టులు వెల్లడించడం టిఆర్ఎస్ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

KCR, PK
ఎందుకు ఈ వ్యతిరేకత
2014లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇవాల్టి వరకు మేము గొప్పగా సంక్షేమ పథకాల అమలు చేస్తున్నామని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పదేపదే చెబుతున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదు. మరీ ముఖ్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు మెజారిటీ వర్గం టిఆర్ఎస్ కార్యకర్తలు జైల్లోకి వెళుతున్నాయి. పైగా ప్రభుత్వం ఇటీవల ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన దళిత బంధు పథకం లబ్ధిదారుల ఎంపిక మొదట్లో అధికారులకు కట్టబెట్టిన ప్రభుత్వం.. ఆ తర్వాత ఎమ్మెల్యేలకు అప్పగించింది. దీంతో ఆ పథకం నిర్వహణ గాడి తప్పింది. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో దళిత బంధు పథకానికి సంబంధించిన గొడవలు జరుగుతున్నాయి. ఇక డబుల్ బెడ్రూం పథకాన్ని సంబంధించి ప్రభుత్వం ఎంతో గొప్పగా చెబుతున్నప్పటికీ.. వాస్తవానికి ఇప్పటివరకు కట్టి ఇచ్చిన ఇల్లు 17 వేలు మాత్రమే. ఈ పథకం కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిర్మించినట్టు రాష్ట్రం చెబుతుండడం గమనార్హం. ఇక మిషన్ భగీరథ, గొర్రెల పంపిణీ పంపిణీ పథకాలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉన్నాయి. ప్రభుత్వం గత మూడేళ్ళ నుంచి కొత్త రేషన్ కార్డులు, కొత్త పింఛన్లు మంజూరు చేయకపోవడంతో ఆయా వర్గాల్లో తీవ్ర ఆగ్రహం నెలకొని ఉంది.
పెట్రేగిపోతున్న ఎమ్మెల్యేలు
వాస్తవానికి టిఆర్ఎస్ ప్రభుత్వానికి కొంతమంది ఎమ్మెల్యేలు తీవ్రమైన తలనొప్పులు తెచ్చి పెడుతున్నారు. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి నుంచి ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ వరకు అందరూ కూడా భూకబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారే. వీరిలో కొందరు అయితే అత్యాచారాలకు తెగబడుతున్నారు. నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ ఏకంగా ఒక యువతి లోబర్చుకొన్నాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. మన జూబ్లీహిల్స్ మైనర్ పై జరిగిన అత్యాచారం ఘటన లో ఒక బోర్డ్ చైర్మన్, అధికార పార్టీకి అత్యంత ప్రీతిపాత్రమైన మిత్రపక్షం ఎంఐఎం ఎమ్మెల్యే ఉండటం.. ఘటనపై టిఆర్ఎస్ పార్టీ నిదానంగా చర్యలు తీసుకోకపోవడం ప్రజల్లో విమర్శలకు తావిచ్చింది.

PK, KCR
కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్లకు టికెట్లు దాదాపుగా లేనట్టే
2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కందాల ఉపేందర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, రోహిత్ రెడ్డి, హరిప్రియ నాయక్, రేగా కాంతారావు, మెచ్చా నాగేశ్వరరావు (టిడిపి), సండ్ర వెంకటవీరయ్య, గండ్ర వెంకటరమణా రెడ్డి.. ఇంకా మిగతా ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరిలో ఒకరి తప్ప మిగతా వాళ్లందరికీ కూడా టిఆర్ఎస్ రిక్త హస్తం చూపించే యోచనే ఉన్నట్టు తెలుస్తోంది. ఇక అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల్లో చాలామందికి టికెట్లు ఇవ్వకూడదనే నిర్ణయానికి అధిష్టానం వచ్చినట్లు తెలుస్తోంది. అయితే వీరిలో చాలామంది కూడా ప్రతిపక్ష పార్టీ నాయకులతో సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా బిజెపి, కాంగ్రెస్ పార్టీలోని నాయకులు వీరిని తీసుకోవాలని యోచిస్తున్నట్టు సమాచారం. ఈ తరహా గోడమీద పిల్లి ఇలాంటి రాజకీయాలు చేస్తున్న అధికార పార్టీ ఎమ్మెల్యేలకు టిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఉంటున్నట్టు సమాచారం. వీరు నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి పనులు కూడా నిధులను అంతంతమాత్రంగానే విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. మొన్నీమధ్య ఖమ్మంలోని ఓ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యే తన నియోజకవర్గ పరిధిలో రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ను కోరితే నిర్ద్వందంగా తోసిపుచ్చినట్టు తెలుస్తోంది. పైగా ఇంకోసారి తనని కలవద్దని ముఖంమీద చెప్పినట్టు సమాచారం. దీంతో ఆ ఎమ్మెల్యే ఇప్పుడు టిఆర్ఎస్ నాయకులతో అంటకాగుతున్నట్టు వినికిడి. అధిష్టానం ఎలాగూ తమను పావులుగా వాడుకున్నదని, ఎన్నికల టికెట్ అయిపోతే తాము కూడా వేరే దారి చూసుకుంటామని సదరు ఎమ్మెల్యేలు వారి వారి అంతరంగికులతో చెబుతున్నట్టు విశ్వసనీయ సమాచారం.
Also Read:BJP Operation Kamalam In Country: మోడీ వచ్చాక దేశంలో కూల్చిన ప్రభుత్వాలెన్ని?