Tollywood Film Workers Strike: సినిమా కార్మికులు నేటి నుంచి బంద్ పాటిస్తున్నారు. దీంతో సినిమాల నిర్మాణం ఆగిపోయింది. నిర్మాతలకు భారీగా నష్టం వాటిల్లుతోంది. ఫలితంగా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి నోటీసు ఇవ్వకుండా ఎలా బంద్ పాటిస్తారని ప్రశ్నిస్తున్నారు. కార్మికుల వేతనాలు పెంచడం లేదని సమ్మెకు ఉపక్రమించారు. కానీ బంద్ పాటించే ముందు పదిహేను రోజుల ముందే సమ్మె నోటీసు ఇవ్వాల్సి ఉన్నా అలా చేయకపోవడంతోనే నిర్మాతలకు భారీ నష్టాలు వచ్చినట్లు తెలుస్తోంది. దీనికి సినిమా కార్మికులు మాత్రం సమాధానం చెప్పడం లేదు. నిర్మాతలు మాత్రం వారి తీరుకు ఆక్షేపిస్తున్నారు.

ప్రతి మూడేళ్లకు సినిమా కార్మికులకు వేతనాలు పెంచాల్సి ఉన్నా పెంచడం లేదని విమర్శిస్తున్నారు. 2018లో పెంచిన వేతనాలు ఇప్పటికి కూడా పెంచడం లేదు. మూడేళ్లకోసారి ముప్పై శాతం పెంచాల్సి ఉన్నా కరోనా ప్రభావంతో ఆ నిర్ణయం వాయిదా వేశారు. 2021లో పెంచాల్సి ఉన్నా వీలు కాలేదు. దీంతో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నేటి నుంచి బంద్ పాటిస్తున్నారు. దీంతో కోట్లాది వ్యాపారం నష్టాల బారిన పడుతోంది. సినిమా కార్మికులు మాత్రం వేతనాలు పెంచాల్సిందేనని పట్టుబడుతున్నారు.
Also Read: Balakrishna- Chiranjeevi: బాలయ్యతో చిరంజీవి ఖాయమేనా?
వ్యక్తిగత విద్వేషాలను సినిమా రంగంపై రుద్దుతున్నారనే వాదనలు కూడా వస్తున్నాయి. ఎవరో కొందరి ఇష్టానుసారం బంద్ పాటిస్తూ అందరికి నష్టం కలిగిస్తున్నారని నిర్మాతలు వాదిస్తున్నారు. కార్మికులు ఇలా అర్థంతరంగా బంద్ పాటిస్తే నిర్మాణాలు ఎలా సాగుతాయి. సినిమా రంగంలో 24 విభాగాల్లో కార్మికులు ఉంటారు. వారంతా నేటితో బంద్ పాటించడంతో సినిమాల నిర్మాణంలో నష్టాలు రానున్నట్లు తెలుస్తోంది. దీనికి ఎవరు బాధ్యులని నిర్మాతలు అడుగుతున్నారు.

కోట్లాది రూపాయలు పెట్టి సినిమాలు తీస్తున్న తమకు ఇలా మధ్యంతరంగా బంద్ చేస్తున్నట్లు ప్రకటించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మూడేళ్లకు 30 శాతం పెంచాల్సి ఉన్నా కరోనా వల్ల పెంచకపోవడంతో ఇప్పుడు 45 శాతం పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ నిర్మాతలు మాత్రం ముప్పై శాతం పెంచుతామని చెబుతున్నారు. దీంతో కార్మికులకు నిర్మాతలకు మధ్య వివాదం రగులుతోంది. గతంలో కూడా ఫైటర్ల యూనియన్ కు నిర్మాతలకు గొడవ రావడంతో షూటింగ్ లు నిలిచిపోయి భారీ నష్టాలు వచ్చాయి. ఇప్పుడు కూడా ఇలా చేస్తుండటంతో సినిమాల నిర్మాణం ఆగిపోయి నష్టాలే రానున్నట్లు తెలుస్తోంది.
కార్మికులు అర్థంతరంగా విధులు ఆపేసి ఆందోళన చేస్తే నిర్మాతలు వేతనాలు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. పని చేస్తేనే కదా వేతనాలు ఇచ్చేది. ఇలా పని బంద్ చేసి వేతనాలు పెంచాలంటే కుదరదని చెబుతున్నారు. మొత్తానికి సినిమా రంగం ఎటు వెళ్తుందో తెలియడం లేదు.
Also Read:Mahesh -Trivikram Movie Cancelled: మహేష్ – త్రివిక్రమ్ మూవీ క్యాన్సిల్..?? కారణం అదేనా?
[…] Also Read: Tollywood Film Workers Strike: టాలీవుడ్ లో సినిమా కార్మి… […]