Draupadi Murmu Telangana Tour Cancelled: తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని బీజేపీ ఫోకస్ పెట్టింది. అందుకు అనుగుణంగా పావులు కదుపుతోంది. ఇప్పటినుంచే ప్రజల్లోకి చొచ్చుకుపోతూ తమ పార్టీ గురించి తీవ్రంగా ప్రచారం చేస్తోంది. అయితే ఇప్పటికే హిందుత్వ పార్టీ అని ముద్రవేసుకున్న బీజేపీ కొన్ని విషయాల్లో తెలంగాణను అవమానిస్తోందని కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో దిగిన ద్రౌపది ముర్ము ఇప్పటి వరకు తెలంగాణలో పర్యటించకపోవడానికి కారణమేంటి..? అని ప్రశ్నిస్తున్నారు. బీజేపీతో పాటు ఇక్కడ ఇతర పార్టీలకు చెందిన నాయకులు ఉన్నారు. అయితే మిగతా రాష్ట్రాల్లో పర్యటించేర ముర్ము తెలంగాణలో ఎందుకు రావడం లేదని అంటున్నారు. ఈ విషయంలోనూ తెలంగాణపై బీజేపీ వివక్ష చూపుతుందా..? అని చర్చించుకుంటున్నారు.

ఈనెల చివరిలో రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్డీయే తరుపున ద్రౌపతి ముర్ము.. ప్రతిపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా బరిలో ఉన్నారు. అయితే తెలంగాణలో బీజేపీ మినహా టీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం నాయకులు యశ్వంత్ సిన్హాకే మద్దతు పలికే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే యశ్వంత్ సిన్హాను సీఎం కేసీఆర్ ఆహ్వానించారు. అయితే బీజేపీ కూడా తెలంగాణలో పుంజుకుంటోంది. ఇక్కడ ఆ పార్టీకి నలుగురు ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే కనీసం వారి కోసమైన ద్రౌపది ముర్ము తెలంగాణలో పర్యటించరా..? అని అంటున్నారు. రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపతి ముర్ము తెలంగాణకు అవసరం లేదు కావొచ్చు.. కానీ రాష్ట్రపతి కాబోయే అభ్యర్థికి ప్రతి రాష్ట్రం సమానమే అన్నట్లుగా భావించాలని అంటున్నారు.
Also Read: Pawan Kalyan Janavani : జనం ఘోష Vs జగన్ ఘోష
పొరుగున్న ఉన్న ఏపీకి వెళ్లిన ద్రౌపది తెలంగాణ పై మాత్రం చిన్న చూపు చూస్తున్నారని అంటున్నారు. అయితే తన టూర్ షెడ్యూల్ లో తెలంగాణ పేరు చేర్చి ఆ తరువాత మళ్లీ తొలగించడంపై రకరకాలుగా చర్చ సాగుతోంది. ఇప్పటికే తెలంగాణలో అధికారంలోకి రావాలని బీజేపీ శాయశక్తులా కృషి చేస్తోంది. జాతీయ సమావేశాలను తెలంగాణలో నిర్వహించి దేశాన్ని తన వైపు తిప్పుకుంది. అయితే విపక్ష అభ్యర్థి యశ్వంత్ సిన్హా కు ఎలాగూ టీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం ఓట్లు పడుతాయి. దీంతో ఇక్కడ ప్రచారం చేయడం ఎందుకని ద్రౌపది ముర్ము భావించారా..? అని అంటున్నారు.

రాష్ట్రపతి అయ్యాక తెలంగాణలో కచ్చితంగా శీతాకాల విడిది కోసం హైదరాబాద్ కు ద్రౌపది ముర్ము రావాల్సిందే. కానీ ఎన్నికల ప్రచారంలో మాత్రం హైదరాబాద్ గుర్తుకు రాలేదా..? అని అంటున్నారు. కొందరు ప్రతిపక్షాలు దీనిని ఆసరాగా తీసుకొని మరిన్ని విమర్శలు చేయడానికి అవకాశం దొరికింది కదా..? అని అంటున్నారు. ఇలాంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ద్రౌపది ముర్ము తెలంగాణలో పర్యటిస్తారా…? లేక ఇక్కడికి రాకుండానే ఎన్నికల్లోకి వెళ్తారా..? అని చర్చించుకుంటున్నారు. అంతేకాకుండా తెలంగాణపై ఇప్పటికే కేంద్ర నిధుల విషయంలో తీవ్ర అన్యాయం చేస్తోందని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఇప్పుడు రాష్ట్రపతి అభ్యర్థిని తెలంగాణలో పర్యటించకుండానే ప్రక్రియ ముగిస్తారా..? అని అంటున్నారు.
Also Read:Janasena Digital War: గుడ్ మార్నింగ్ సీఎం సార్.. జనసేన ‘డిజిటల్ వార్’
[…] […]
[…] […]